bail denie
-
ఢిల్లీ మద్యం కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
-
వనమా రాఘవకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ–2 నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావుకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. గతంలో రెండు సార్లు రాఘవ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించిన విషయం విదితమే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా అక్కడా బెయిల్ తిరస్కరించారు. రాఘవ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముం దని, మరో పది కేసుల్లోనూ ఆయనపై విచా రణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దనే ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ నిరాకరించి, తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నాగరామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవికి మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే, రాఘవకు బెయిల్ నిరాకరిస్తూ గురువారం సాయంత్రమే తీర్పు వెలువడినా, ఉత్తర్వులు శుక్రవారం అందాయి. -
కిడ్నాప్ కేసు: అఖిల ప్రియకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో ఆమె కోరారు. అయితే వైద్యులు న్యాయస్థానానికి సమర్పించిన వైద్యపరీక్షల్లో ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. దీంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు కోట్టివేసింది. కిడ్నాపు కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఆమెను వారంరోజుల పాటు విచారించాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానాకి తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిల ప్రియ అనుచరులు మరికొన్ని నేరాలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని, ఆమె భర్త భార్గవ్‌రామ్‌తో పాటు పరారీలో ఉన్న అనుచరులను అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదన విన్న కోర్టు.. అఖిల ప్రియను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది. నేటి నుంచి అఖిల ప్రియ 13వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. కాగా బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చంచల్‌గూడ జైల్లో 14 రోజుల రిమాండ్‌లో ఉండగా.. కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. మరోవైపు కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్‌తో పాటు ఆయన అనుచరుడు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిద్దరి కోసం మూడు రాష్ట్రాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: గుంటూరు శ్రీను నేర చరిత్రపై ఆరా.. -
వివాదాస్పద గురువుకు మళ్లీ నిరాశ
జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూనకు మరోసారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆశారామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. బాపు బెయిల్ పిటిషన్ ఇంతకుముందు రాజస్థాన్ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కూడా తిరస్కరించాయి. 2013లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నాడు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాతే బెయిల్ పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాపును పరీక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎయిమ్స్‌ను ఆదేశించింది. పది రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ఎయిమ్స్‌కు గడువు విధించింది.