( ఫైల్ ఫోటో )
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ–2 నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావుకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. గతంలో రెండు సార్లు రాఘవ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించిన విషయం విదితమే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా అక్కడా బెయిల్ తిరస్కరించారు.
రాఘవ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముం దని, మరో పది కేసుల్లోనూ ఆయనపై విచా రణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దనే ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ నిరాకరించి, తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.
కాగా, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నాగరామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవికి మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే, రాఘవకు బెయిల్ నిరాకరిస్తూ గురువారం సాయంత్రమే తీర్పు వెలువడినా, ఉత్తర్వులు శుక్రవారం అందాయి.
Comments
Please login to add a commentAdd a comment