సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూతో ప్రధాని నరేంద్ర మోదీ కలిసి ఉన్న ఓ వీడియోను కాంగ్రెస్ బుధవారం తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియోలో ఉన్న ఫోటోలు కొన్నేళ్ల కిందటవి కావడం గమనార్హం. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘ ఓ వ్యక్తి ఎలాంటి వాడన్నది అతని చుట్టూ ఉండే వాళ్లను చూస్తే తెలుస్తుంద’నే సామెతను క్యాప్షన్‌గా ఉటంకించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు స్పందించారు. కాంగ్రెస్ పోస్ట్‌కు దీటుగా కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆశారాంకు నమస్కరిస్తున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఫోటోలను పోస్ట్ చేశారు. మరోవైపు ఆశారాంతో ప్రధాని మోదీ కలిసున్న పాత ఫోటోలను పోస్ట్ చేయడంపై నటుడు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మండిపడ్డారు. స్వామీజీగా తనకు తాను చెప్పుకున్న వారితో వారు దోషులుగా నిర్థారణ కాకముందు వారితో సన్నిహితంగా మెలగడం నేరం కాదని వ్యాఖ్యానించారు. ఐదేళ్ల కిందట తన ఆశ్రమంలో16 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఆశారాం బాపూను దోషిగా నిర్ధారించిన జోథ్‌పూర్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment