ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమ్మ ఇటీవలే చనిపోయారు. ఆమెకు చేయాల్సిన అన్ని ఖర్మక్రతువులను మోదీ దగ్గరుండి చేయించారు. ఇప్పుడేమో మరో అమ్మ తెరపైకి వచ్చింది. ఇదేంటి అనుకుంటున్నారా? అసలు కథేంటంటే.. మంగీబాయికి వయసు 100 ఏళ్లు. ఆమెకు 14 మంది పిల్లలు ఉండగా.. మోదీని తన 15వ కొడుకుగా భావిస్తున్నానని చెప్పింది. ప్రధాని దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, తనవంటి వారి కోసం ఎన్నో పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. మోదీకి మాత్రమే ఓటేస్తానని ఆమె వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా హరిపురా గ్రామానికి చెందిన ఆ వృద్ధురాలు మంగీబాయి తన్వర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ప్రధాని మోదీ దేశానికి చాలా చేస్తున్నారని, తన కోసం కూడా చాలా చేశారని అన్నారు. అయన తనలాంటి వృద్ధులకు ఆహారం, వసతి వంటివి కల్పించారని చెప్పారు. 'మోదీ నాకు ఇల్లు ఇచ్చారు.. ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.. వితంతు పింఛన్ ఇస్తున్నారు, ఆర్థికంగా ఆదుకుంటున్నారు.
ఆయన వల్లే నేను తీర్థయాత్రలకు వెళ్లగలిగాను.. అందుకే నా కొడుకు. అవకాశం దొరికితే స్వయంగా ప్రధానిని కలవాలనుకుంటున్నాను’’ అని మంగీబాయి చెప్పింది. తన పేరున ఉన్న 25 బిగాస్ (15 ఎకరాల) భూమిని ప్రధానికి రాసిస్తానని 100 ఏళ్ల బామ్మ చెప్పడం సంచలనంగా మారింది. మంగళవారం మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటించనున్న సందర్భంగా ఈ వీడియో వైరల్‌గా మారడం గమనార్హం.
చదవండి: మహారాష్ట్ర వేదికగా బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment