ఆశారామ్ బాపూను అరెస్ట్ చేసే అవకాశం | Asaram Bapu may be arrested | Sakshi
Sakshi News home page

ఆశారామ్ బాపూను అరెస్ట్ చేసే అవకాశం

Published Sat, Aug 31 2013 12:06 PM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూను శనివారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.

జైపూర్ :వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూను శనివారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. గత మంగళవారం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు అతనిపై పోలీసులు  చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ రోజు ఆశారాంను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. ఆశారామ్ ఇటీవల తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు.

 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురా లు పేర్కొంది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. బాధి తురాలు మధ్యప్రదేశ్ చింద్వారాలో ఆశారామ్‌కు చెందిన గురుకులంలో 12వ తరగతి చదువుతోంది.  ఆశారాం అరెస్టు వార్తలు రావడంతో అక్కడి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడికి దిగారు.  ఆశారాం లైంగిక దాడి చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవని పలువురు పార్టీ నాయకులు తెలపడంతో  ఈ వివాదం కాస్తా అతని మెడకు మరింత చుట్టుకునేలా కనిపిస్తోంది.

ఆశారామ్ బాపూ,, , ,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement