neelam dubey
-
ఆశారామ్ బాపూను అరెస్ట్ చేసే అవకాశం
జైపూర్ :వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూను శనివారం అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. గత మంగళవారం ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు అతనిపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ రోజు ఆశారాంను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. ఆశారామ్ ఇటీవల తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురా లు పేర్కొంది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. బాధి తురాలు మధ్యప్రదేశ్ చింద్వారాలో ఆశారామ్కు చెందిన గురుకులంలో 12వ తరగతి చదువుతోంది. ఆశారాం అరెస్టు వార్తలు రావడంతో అక్కడి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయన అనుచరులు దాడికి దిగారు. ఆశారాం లైంగిక దాడి చేసినట్లు రుజువైతే చర్యలు తప్పవని పలువురు పార్టీ నాయకులు తెలపడంతో ఈ వివాదం కాస్తా అతని మెడకు మరింత చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆశారామ్ బాపూ,, , , -
ఆశారామ్ బాపూపై లైంగిక దాడి కేసు నమోదు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్లో జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆశారామ్బాపూ ఆశ్రమ ప్రతినిధి నీలమ్ దూబే తోసిపుచ్చారు. ఆశారామ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ఈ తప్పుడు కేసు పెట్టించారని ప్రత్యారోపణ చేశారు. పోలీసు దర్యాప్తు మొదలైతే ఈ కేసు వెనక ఎవరున్నారో తేలుతుందన్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్లోనూ భూకబ్జా కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్లో ఆశారామ్కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.