ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ | Jodhpur Court rejects Asaram Bapu's bail plea | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ

Published Wed, Sep 4 2013 5:57 PM | Last Updated on Mon, Aug 20 2018 5:41 PM

ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ - Sakshi

ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(72)కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై స్థానిక జిల్లా, సెషన్స్(రూరల్) కోర్టు న్యాయమూర్తి మనోజ్ వ్యాస్ విచారించారు. వాదనలు విన్న తర్వాత ఆశారాం బాపుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు ఇంకా పట్టుబడనందున ఆశారాంకు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానం వెలుపల విలేకరులతో చెప్పారు.

కోర్టు ఈ నెల 15కు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆశారాం బాపు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement