జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో దోషిగా కోర్టు తేల్చటంతో అరెస్ట్ చేసిన జోధ్‌పూర్ పోలీసులు అటునుంచి అటే సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే జైలులో 2006లో సల్మాన్ ఐదు రోజులు గడిపారు కూడా. ఇక ప్రస్తుతం బ్యారక్ నంబర్ 2లో సల్మాన్‌కు జైలు గదిని కేటాయించారు. ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు.
‘సల్మాన్ కోసం ఇప్పటికే సెల్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్యాన్, ఏసీ లాంటి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆశారాంను ఉంచిన బ్యారక్‌లోనే సల్మాన్ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బ్యారక్ వద్ద భద్రతను మాత్రం కట్టుదిట్టం చేయబోతున్నాం’ అని జైలు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 5 ఏళ్లుగా ఆశారాం ఇదే జైళ్లో ఉంటున్నారు.
బెయిల్ పిటిషన్ దాఖలు.. ఇక శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ రేపు ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇవాళ రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
బిష్ణోయిస్‌లో సంబరాలు... కాగా, ఈ కేసులో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బిష్ణోయిస్ తెగ సంబరాలు మునిగింది. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట పటాసులు పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు.
Visuals of #SalmanKhan at Jodhpur Central Jail. #BlackBuckPoachingCase pic.twitter.com/Q3NbMqkxhk
— ANI (@ANI) 5 April 2018
Comments
Please login to add a commentAdd a comment