Jodhpur Central Jail
-
అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అహ్మదాబాద్: దశాబ్దకాలం నాటి అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ దోషిగా తేలిన విషయం తెలిసిందే. 2013లో తన ఆశ్రమంలో నివసిస్తున్న మహిళపై లైంగికదాడి కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం ఆయన్ను దోషిగా తేల్చింది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. తాజాగా నేడు (జనవరి31) అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో 2001 నుంచి 2006 వరకు తనపై గురువు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ 2013లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ ఆశారాం బాపూతో సహా ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేనందున ఆశారాం భార్య, కుమార్తె, కుమారుడితో పాటు మరో నలుగురు మహిళలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆశారాంకు జీవిత ఖైదు విధించింది. కాగా 81 ఏళ్ల ఆశారం బాపూ ప్రస్తుతం మరో అత్యాచారం కేసులో జోధ్‌పూర్ జైలులో శిక్షననుభవిస్తున్నారు. జోధ్‌పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వగా..2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు. 2013 నుంచి జోధ్‌పూర్ జైలులోనే ఉన్నారు. ప్రముఖ అధ్యాత్మిక గురువుగా దేశ విదేశాల్లో శిష్యులను సంపాదించుకున్న ఆశారం చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. చదవండి: చైనా సంస్థ నుంచి డబ్బులు తీసుకొనే బీబీసీ తప్పుడు ప్రచారం' -
ఆశారాం బాపూకు చుక్కెదురు
జోధ్‌పుర్: మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో విధించిన జీవితఖైదును సవాలు చేస్తూ.. ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను జోధ్‌పుర్ హైకోర్టు సోమవారం కొట్టిపారేసింది. బాధిత బాలిక మేజర్ అని, పోస్కో చట్టం నిబంధనల ప్రకారం ఆశారామ్‌కు శిక్ష వర్తించదని ఆయన తరపు న్యాయవాదులు శిరీష్ గుప్తే, ప్రదీప్ చౌదరి వాదించారు. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ వినీత్ కుమార్ మాధుర్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ వీరి వాదనను తోసిపుచ్చింది. నేరం జరిగిన సమయంలో బాలిక మైనర్ అని ట్రయల్ కోర్టులో అభియోగాలు రుజువైన విషయాన్ని ప్రస్తావించింది. కాగా తన ఆశ్రమంలో చదువుతున్న మైనర్ బాలికను జోధ్‌పూర్‌కు దగ్గరలోని మనాయ్ గ్రామంలో 2013 ఆగస్ట్‌లో అత్యాచారం చేశానని ఆశారాం అంగీకరించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో జోధ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆశారాం బాపూకు జీవితఖైదు విధించింది. తనను తాను దైవదూతగా చెప్పుకునే ఆశారాం ప్రస్తుతం జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి 20 సంవత్సరాల చొప్పున శిక్షను కోర్టు విధించింది. -
త్వరలో మంచిరోజులొస్తాయి: ఆసారాం
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి ‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది. నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం) -
సల్మాన్ జైల్ మేట్ ఎవరంటే...
జోధ్‌పూర్ : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను చంపిన కేసులో దోషిగా కోర్టు తేల్చటంతో అరెస్ట్ చేసిన జోధ్‌పూర్ పోలీసులు అటునుంచి అటే సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే జైలులో 2006లో సల్మాన్ ఐదు రోజులు గడిపారు కూడా. ఇక ప్రస్తుతం బ్యారక్ నంబర్ 2లో సల్మాన్‌కు జైలు గదిని కేటాయించారు. ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు. ‘సల్మాన్ కోసం ఇప్పటికే సెల్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఫ్యాన్, ఏసీ లాంటి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆశారాంను ఉంచిన బ్యారక్‌లోనే సల్మాన్ ఉంటారు. అయితే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బ్యారక్ వద్ద భద్రతను మాత్రం కట్టుదిట్టం చేయబోతున్నాం’ అని జైలు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా, 2013లో ఆశ్రమానికి చెందిన బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై 5 ఏళ్లుగా ఆశారాం ఇదే జైళ్లో ఉంటున్నారు. బెయిల్ పిటిషన్ దాఖలు.. ఇక శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్ రేపు ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇవాళ రాత్రి జైల్లోనే గడపాల్సి ఉంటుంది. బిష్ణోయిస్లో సంబరాలు... కాగా, ఈ కేసులో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బిష్ణోయిస్ తెగ సంబరాలు మునిగింది. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు బయట పటాసులు పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. Visuals of #SalmanKhan at Jodhpur Central Jail. #BlackBuckPoachingCase pic.twitter.com/Q3NbMqkxhk — ANI (@ANI) 5 April 2018 -
ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(72)కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై స్థానిక జిల్లా, సెషన్స్(రూరల్) కోర్టు న్యాయమూర్తి మనోజ్ వ్యాస్ విచారించారు. వాదనలు విన్న తర్వాత ఆశారాం బాపుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు ఇంకా పట్టుబడనందున ఆశారాంకు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానం వెలుపల విలేకరులతో చెప్పారు. కోర్టు ఈ నెల 15కు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆశారాం బాపు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.