న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు అనుచరులు ఆయనకు మద్దతుగా స్థానిక ఇందిరాగాంధీ విమానాశ్రయం (ఐజీఐ) బయట నినాదాలు చేశారు. ఆశారాం నిందితుడు కాదన్నారు. కాగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆశారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపును ఇండోర్‌లో అరెస్టు చేసిన సంగతి విదితమే. జోధ్‌పూర్‌కు తరలించేందుకుగాను స్థానిక విమానాశ్రయానికి ఆదివారం ఉదయం గం 9.30 నిమిషాల సమయంలో తీసుకొచ్చిన పోలీసులు వీఐపీ లాంజ్‌లో ఉంచారు.
ఆ తర్వాత గం 11.20 నిమిషాలకు విమానంలో జోధ్‌పూర్‌కు త రలించారు. ఈ సమాచారం అందుకున్న ఆశారం అనుచరులు హంగామా సృష్టించారు. అనంతరం ఆశారాం మద్దతుదారురాలైన జ్యోతిసింగ్ అనే 32 ఏళ్ల యువతి మీడియాతో మాట్లాడుతూ ఆయన నిందితుడు కాదన్నారు. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఇరికించారని ఆరోపించారు.
, ,