
ఆశారాం బాపు అరెస్టు
ఇండోర్/జోధ్‌పూర్: మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును శనివారం రాత్రి ఇండోర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆశారాంపై సమాచారం కోసం జోధ్‌పూర్ ఆశ్రమానికి వెళ్లిన ఇద్దరు టీవీ జర్నలిస్టులపై ఆయన అనుచరులు దాడి చేసి, తీవ్రంగా గాయపరచారు. ఆశారాం అనుచరులు తమపై దాడిచేసి, కెమెరా లాక్కున్నట్లు జర్నలిస్టులు ఆరోపించారు.
ఈ సంఘటనకు సంబంధించి ఒక మహిళ సహా 13 మందిని జోధ్‌పూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆశారాం అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. ఆయన పోలీసులకు చిక్కకుండా దాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఆయన ఇండోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన కుమారుడు నారాయణ్ సాయి చెప్పారు.