
'నా కొడుకు హత్యను సీబీఐతో తేల్చండి'
ముజఫర్నగర్: వివాదాస్పద స్వామీజి ఆశారాం బాపు నేరాలకు సంబంధించి కీలకమైన సాక్షుల్లో ఒకరైన తన కుమారుడి అనుమానాస్పద మృతిపట్ల సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన గుజరాత్ అధికారులకు ప్రత్యేక లేఖ రాశారు. ఆశారాం బాపు కేసుకు సంబంధించి సాక్షుల్లో ఒకరైన అఖిల్ గుప్తా గత ఆరు నెలలకిందట అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.
దీంతో ఆయన తండ్రి నరేశ్ గుప్తా స్ధానిక పోలీసులు తన కుమారుడు హత్య కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని, వెంటనే జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. సూరత్లోని ఆశారాం బాపు ఆశ్రమంలో అఖిల్ గుప్తా వంటమనిషిగా పనిచేశాడు. ఓ మైనర్ బాలికపై ఆశారాం బాపు లైంగిక దాడులకు పాల్పడిన కేసులో అఖిల్ను కీలక సాక్షిగా భావించారు. అయితే అతడు మాత్రం జనవరి 11న గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.