'పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా చిత్రీకరిస్తోంది'
పిల్లల రక్తం తాగే డ్రాకులలా మీడియా తనను చిత్రీకరించడంపై జోక్యం చేసుకోవాలని ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు దాఖలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తన ప్రవర్తనపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలపై ఆంక్షలు విధించాలని ఆశారాం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సధాశివం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ రాజన్ గగోయ్ లతో కూడిన ధర్నాసనం విచారించింది.
పోలీసుల నుంచి, ఇతర మార్గాల సేకరించిన సమాచారాన్ని మీడియా ప్రసారాం చేయడాన్ని తప్పపట్టలేమని కోర్టు వెల్లడించింది. ఆశారాంను డ్రాకులలా చిత్రీకరించారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఆశారాం భార్య, కూతుళ్లు ఆయనకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని మీడియా కథనాలు వెల్లడించిన వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.