జైపూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ శనివారం జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని ఐసీయూలో చేరారు. కాలేయ సంబంధిత వ‍్యాధి, మూత్రంలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేగాక గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో 80 ఏళ్ల ఆశారాం బాపుకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించి 48 గంటల పాటు వైద్యుల పరిరక్షణలో ఉంచనున్నారు.
చదవండి: ‘కళ్లు పీకి.. చేతులు విరుస్తా’ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాగా ఆశారాం బాపూ ప్రస్తుతం అత్యాచారం కేసులో జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదుగా ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక 2013లో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది 2014లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
అయితే అతన్ని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నెలకు ఒకటి, రెండుసార్లు ఏయిమ్స్‌కు జోధ్‌పూర్‌కు తీసుకువస్తారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆశారాం బాపు జైలు నుంచి బయటకు వెళ్లకముందే, ఆయన్ను జోధ్‌పూర్ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారనే సమాచారంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారిని స్థానిక అధికారులు బలవంతంగా ఆ ప్రాంతం నుంచి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment