
ఆశారాం బాపూకు బెయిల్ తిరస్కరణ
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ బెయిల్ పిటిషన్ను జోథ్పూర్ కోర్టు తిరస్కరించింది.
జోథ్పూర్ : ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను జోథ్పూర్ కోర్టు మరోసారి తిరస్కరించింది. ఆశారాం జ్యూడిషీయల్ కస్టడీ నేటితో ముగియటంతో పోలీసులు ఆయన్ని ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. అలాగే ఆశారాం బాపూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరిపిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. అంతే కాకుండా ఆయన రిమాండ్ను మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
16 ఏళ్ల బాలికపై ఆత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆశారాం బాపును.. సెప్టెంబర్ ఒకటి ఆర్థరాత్రి.. మధ్యప్రదేశ్‌లోని చింధ్వారా ఆశ్రమంలో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు జ్యూడిషీయల్ కస్టడీ విధించడంతో జోధ్‌పూర్ జైలుకు తరలించారు. మరోవైపు ఆశారాం బాపు శిష్యులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.