'ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేం'
జోద్పూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారం బాపునకు మరోసారి రాజస్థాన్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దాదాపు ముగింపు దశలో ఉండగా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కోర్టు స్పష్టం చేసింది.
2013 సెప్టెంబర్ 2న జోద్ పూర్ సెంటర్ జైలుకు ఆశారాం బాపును తరలించారు. ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించగా అప్పటి నుంచి ఆయన పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఆశారాం బెయిల్ పిటిషన్ వేయడం.. కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి.