బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు కోసం ప్రభుత్వం అనవసరంగా భారీ భద్రత కల్పించిందంటూ సుప్రీంకోర్టు మండిపడింది.
బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు కోసం ప్రభుత్వం అనవసరంగా భారీ భద్రత కల్పించిందంటూ సుప్రీంకోర్టు మండిపడింది. టీవీలలో చూస్తుంటే భారీ ఎత్తున ఆయనకు భద్రత కల్పించినట్లు తెలుస్తోందని జస్టిస్ జీఎస్ సింఘ్వీ, జస్టిస్ వి.గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది సరికాదని ప్రతి ఒక్కరూ అంటున్నా, సర్వసాధారణం అయిపోయిందంటూ జస్టిస్ సింఘ్వీ వ్యాఖ్యానించారు.
అనవసరమైన వ్యక్తులకు భారీ స్థాయిలో కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకోవాలని, వాళ్లు దాన్ని ఓ స్టేటస్ సింబల్లా ఉపయోగించుకుంటున్నారని చెబుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపును రాజస్థాన్లో 14 రోజుల కస్టడీకి పంపిన విషయం తెలిసిందే.