'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు' | Asaram's daughter-in-law complains against godman and his son | Sakshi
Sakshi News home page

'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు'

Nov 25 2015 11:30 AM | Updated on Sep 3 2017 1:01 PM

'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు'

'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు'

తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, చెడుగా ప్రవర్తించేవాడని అతడి వల్ల ఓ యువతి గర్భవతి కూడా అయిందని ఆశారాం బాపు కోడలు జానకీ చెప్పింది.

ఇండోర్: మామ, భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరు లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించింది. రాజస్థాన్ లోని ఖాజురాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ 19నే ఆశారాం కోడలు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు స్టేషన్ కు పిలిచారు.

ఈ సందర్భంగా ఆమె తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, చెడుగా ప్రవర్తించేవాడని ఓ యువతిని గర్భవతిని కూడా చేశాడని చెప్పింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే, తనకు విడాకులు ఇచ్చాకే ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పినట్లు తెలిపింది. ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెతో సంబంధాన్ని పెట్టుకొని తనను చీకట్లో మగ్గేలా చేశాడని అన్నారు.

తన మామ కూడా వేధించాడని, తన తండ్రి దేవరాజ్ కృష్ణానిని మాటలతో మభ్యపెట్టి ఆస్తులు మొత్తం తన ఆశ్రమానికి రాయించుకున్నాడని చెప్పింది. తనను నారాయణ్ మే 22, 1997న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులకు తమ పెళ్లినాటి ఫొటోలు, వీడియోలు, ఇతర పత్రాలు పోలీసులకు సమర్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement