Janaki
-
ఆమె కథ
సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. ఆరు నెలల ముందుగా బుక్ చేసుకుంటేనే గాని, అందులో పెళ్ళి చేసుకునే అవకాశం రాదు. సుధీర్, రేవతిల పెళ్ళి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికీ మొదటిరాత్రికీ మధ్యలో ఒకరోజు గ్యాప్ రావడంతో సుధీర్, రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచే రేవతి ఇంట్లో హడావుడి మొదలైంది. ‘రేవతి! టైమ్ మర్చిపోకమ్మా! సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు’ అని ఉదయం నుంచి లెక్కలేనన్నిసార్లు చెబుతూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్ళే రేవతిని ఆపి మరీ. ‘సాయంత్రం గదిలోకెళ్ళిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు’ వివరంగా చెప్పింది కవిత.‘రేవతీ! స్నానం చేశావా?’ అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ‘ఏంటీ, అప్పుడే అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు. మేం వినకూడదా?’ అంటూ రేవతి, కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి.‘అలాగేం లేదమ్మా! నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర దాపరికాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే!’ అంది కవిత. ‘టైమ్ చూసుకుని కలవమంటోంది అత్తయ్య!’ తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ.‘అది చాలా ముఖ్యం రేవతి! మా పిన్నమ్మ ఆ పంతులుతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైమ్ పాటించకపోతే మీ అత్తయ్య, మా పిన్ని కష్టం వృథా అయిపోతుంది’ అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది.‘మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్నీ అంత గట్టి నమ్మకం?’ ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ‘ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంటపట్టాయి’ చెప్పింది కవిత. ‘అలా వచ్చిందా! మీది పెద్ద చరిత్రే’ అంది దేవకి. ‘ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళయి పిల్లలు పుట్టాక వాళ్ళకు జరిపించే అన్నప్రాశనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది’ అని చెప్పింది కవిత. ‘ఏంటమ్మా! పిన్ని, కూతుళ్ళు తీరిగ్గా ముచ్చట్లు పెట్టారు. అక్కడ శోభనం గదిలో పనేంలేదా?’ అంటూ వచ్చింది దేవకి తోటికోడలు మీనా.‘నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది. ఇంక మాకా గదిలో పనేముంటుంది చెప్పు!’ అంది కవిత. ‘పిన్ని! మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు’ అని కబురు తెచ్చింది మీనా. ‘ఎందుకు తల్లీ! కొడుక్కి శోభనం అయితే ఈయన కంగారేంటి?’ అంటూ వెళ్ళింది, కవిత. మీనా, దేవకి నవ్వుకున్నారు. ‘చాలా సరదాగా ఉంటుందే పిన్ని. మన రేవతి అదృష్టవంతురాలు. మంచి అత్త దొరికింది’ అంది మనస్పూర్తిగా మీనా. ‘హలో అక్కగారు! ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండోవైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏంటంటే, పూజ గది, ఈవిడగారుండే గది పనిమనుషులు శుభ్రం చెయ్యరట! ఇంటి కోడళ్లే ఆ పని చెయ్యాలట! ఇప్పుడున్న ఇద్దరూ కోడళ్లూ అలాగే చేస్తున్నారట! బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరు కోడళ్ళ మొహాలు చూశావా, ఈమెపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయ్! ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట! చీపురు, చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట! ఏ రోజు ఏ రంగు చీరకట్టాలో ఆవిడే ముందు రోజు నైట్ చెబుతుందట! ఇంట్లో పనివాళ్ళు ఆమెకు ఐదడుగుల దూరంలో నడవాలట! కాని, ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంకో గొప్ప సంగతి. ఇద్దరు కోడళ్ళకు సుఖప్రసవం జరుగుందని డాక్టర్లు చెబితే, ఈవిడ మాత్రం మంచి రోజు, మంచి ఘడియలని చెప్పి రెండు మూడు రోజులు ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి, బిడ్డలను బయటకు తీయించిందట!’ అని చెప్పింది దేవకి. ‘అమ్మ బాబోయ్! ఈవిడకింతుందా?’ అని అమాయకంగా అడిగింది మీనా.‘ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. నీకు శాంపిల్‌గా కొన్నే చెప్పాను’ చెప్పింది దేవకి. ‘అవును చెల్లి! ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు?’ అడిగింది మీనా. ‘మెల్లగా వాళ్ళ పనిమనిషి దగ్గర నుంచి రాబట్టాను’ చెప్పింది దేవకి. ‘ఈ లెక్కన చూస్తే, మన అత్తగారే నయమనిపిస్తుంది’ అంది మీనా. ‘అవును. ఆవిడ కంటే మన అత్తగారు వందరెట్లు మంచిది’ నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. ‘మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా?’ రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. ‘మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను, మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం! రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే, ఊరుకునే ప్రసక్తే లేదు’ చెప్పింది దేవకి. ‘మేము మాత్రం ఊరుకుంటామా? తేడా వస్తే అడిగి, కడిగి పారేస్తాం!’ అంది మీనా. తోటికోడళ్ళ సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి, మీనా, దేవకిల అత్తగారు జానకి ‘నా కోడళ్ళు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు’ అని మనసులోనే అనుకుంది.రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. ‘రేవతి, నీదే లేటు. నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము‘ అంది మీనా.‘అక్కా! నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్ళి వంట పనులు చూసుకుంటాను’ అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావడం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, ‘అమ్మా దేవకి! అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది. కాస్త నువ్వెళ్ళి చూసుకోమ్మా’ అంది జానకి. ‘అలాగే అత్తయ్యా! మీరు మన రేవతికి అన్నీ చెప్పండి, ఆ పిన్నిగారు టైమ్, టైమ్ అని తెగ ఆరాటపడుతోంది’ అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం ఏడు నలభై నిమిషాలవుతోంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తోంది. కవిత హాల్లో కోడళ్ళతో ముచ్చట్లు చెబుతోంది. మగాళ్ళు పెంటహౌస్లో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమళాలతో నిండిపోయింది. పెళ్ళి కొడుకు సుధీర్‌ను తన ఇద్దరన్నలూ వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్‌తో ఇంకో పదిమంది స్నేహితులు ఉండటంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం ఎనిమిది రెండు నిమిషాలైంది. కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్ళికొడుకు గది దగ్గరికి వచ్చి, ‘సుధీర్ రెడీ అయ్యాడా?’ అనడిగింది.‘హా! రెడీ!’ అని, ‘రేయ్ తమ్ముళ్లూ! మీరంతా కాస్త వాడికి దారిస్తే, పంజరంలోకి పంపుదాం!’ అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ‘ఆల్ ది బెస్ట్ రా సుధీర్!’ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ ఎనిమిది గంటల పదకొండో నిమిషంలో గదిలోకి వెళ్ళాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై ఎనిమిది గంటల పదహారో నిమిషంలో గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కళ్ళారా చూస్తూ చాలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. ‘పిన్నిగారు! అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం!’ అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ‘ఇప్పుడు ఆకలేస్తుంది. పద తిందాం!’ అని దేవకి వెనుకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబసభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు.సందడిగా ఉంది ఆ ప్రాంతం! సమయం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలవుతోంది. సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని, ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, ‘వదినా! నాకు డేట్ వచ్చింది. ప్లీజ్ హెల్ప్ మీ!’ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి, దేవకి మొహంలో చిరునవ్వు మాయమై, కంగారు మొదలై చెమటలు పట్టాయి.‘వెంటనే నీ రూమ్‌కి రా!’ అని రిప్లై చేసి, మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి, ‘హమ్మయ్యా!’ అని ఊపిరి పీల్చుకుని, ‘అక్క! నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో!‘ అని మీనాకి చెప్పి, లోపలికి వెళ్ళింది.‘ఏంటి రేవతి! ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా! ఇప్పుడెలా? మా తమ్ముడికి చెప్పావా?’ అని అడిగింది దేవకి టెన్షన్‌గా. ‘చెప్పాను. వెళ్ళి రెస్టు తీసుకో’ అని చెప్పారు. ‘సరే,నువ్వు కంగారు పడకు. అయినా, ఇంకా టైముంది కదా?’ కంగారుగానే అడిగింది దేవకి. ‘రేపు కానీ, ఎల్లుండు కానీ రావాలి’ అమాయకంగా చెప్పింది రేవతి. ‘సరే సరే, ఈ రూమ్‌లోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందాం!’ అని చెప్పి, ‘ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమౌతుందో, ఏంటో’ అంటూ టెన్షన్‌గా వెనక్కి తిరిగేసరికి, ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు, దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. ‘అసలు మీరు ఆడవాళ్లేనా? నోటికి అన్నమే తింటున్నారా? ముందుగా టేబ్లెట్స్ వేసుకోవాలని తెలియదా? మీ కంటే లేబరోళ్ళే బెటర్ కదా!’ అని పిచ్చ కోపంగా తిట్టి, హాల్లో కొచ్చి, ‘నీరజా! శ్యామ్! అందరూ రండి ఇంటికి పోదాం!’ అంటూ గేటువైపు దారి తీసింది కవిత. ‘ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా!’ అన్నాడు సుధీర్ గట్టిగా. ‘ఏమైందా? అప్పుడే పెళ్ళానికి సపోర్టా? ఇంత అరెంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా?’ కోపంగానే అంది కవిత. ‘మనం స్వచ్ఛమైన నీళ్ళు తాగి ఎంతకాలమైంది? పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్ళైంది? రోగం లేని మనిషెవడైనా ఉన్నాడా?’ సూటిగా అడిగాడు సుధీర్. ‘దానికి, దీనికి సంబంధమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్?’ అర్థం కానట్టు అడిగింది కవిత. ‘అమ్మా! సంబంధం ఉంది. మంచి ముహుర్తం కాబట్టి, నెలసరి రాకుండా టేబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా! అనేగా నీ కోపం, బాధ? తప్పు. సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంత కాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో! ఇకనైనా కళ్ళుతెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతిసృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు, కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకుని మీ మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తిలేనివే అందించాడు. మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము’ అని చెప్పడం ఆపి, ‘నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే, రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు’ అని తన గదివైపు వెళ్ళిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి, దేవకికి సారీ చెప్పింది కవిత. ‘భయపడకు. ఈ మూడు రోజులూ నువ్వు నాతో ఉండు. నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం!’ అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. -
రియల్ స్టోరీతో వస్తోన్న అనుపమ పరమేశ్వరన్..!
మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ సినిమాను యధార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్నారు. ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి ఫణీంద్ర కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందనేదే అసలు కథ. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో జానకి కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.రియల్ స్టోరీ కావడంతో ఈ చిత్రంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు గిరీష్ నారాయణన్ , జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
నేను పాటలు పాడాను అంటే వచ్చి గొడవ చేసేవారు ఇళయరాజా గారు
-
జానకి గారిని అసలు ఎవరు టచ్ కూడా చెయ్యలేరు
-
నాకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్
-
ఆ పాటకు సంబంధించిన వారు ఎవరు లేరు ఇప్పుడు
-
సింగర్ ఎస్ జానకి ఎంత బాగా పాడిందో చూడండి
-
నేను ఇంట్లో ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు : జానకి
-
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ జానకి
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా ఇన్స్పెక్టర్(సీఐ) లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ జానకి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సెక్షన్లో జానకి ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుంచి సీఐ జానకి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ శానిటేషన్ ఇన్స్పెక్టర్ జానకీ. దీంతో, సదరు బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలో 20వేలు ఇస్తుండగా జానకిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఆఫీసులో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
నాది సంతోషకరమైన జీవితం..
-
చాలా అసహ్యమైన పాటలు పాడించారు నాతో...
-
ఆ టైం లో రెండో పెళ్లి చేసుకోవాలనిపించింది..
-
సోషల్ మీడియాలో దుమ్మురేపే ‘నృత్య సందేశం’
దక్షిణ భారతదేశం నుంచి రెండు జంటలు ఇప్పుడు వార్తల్లో ఉన్నాయి. ఒకటి తమిళనాడు నుంచి ధీ–అరివు జంట. రెండు కేరళ నుంచి జానకి– నవీన్ రజాక్ జంట. ధీ–ఇరువి చేసిన సింగిల్ వీడియో ‘ఎంజాయ్ ఎంజామి’ ఈ దేశం మూలవాసులను, పూర్వికుల సామరస్య జీవనాన్ని గుర్తు చేసే సందేశం ఇస్తూ సంచలన విజయం నమోదు చేసింది. ఇక కేరళ జంట చేసిన ‘రస్పుటిన్’ నృత్యం అనివార్యంగా ద్వేషానికి ప్రతిఘటనగా మలచబడింది. కొంతమంది కుర్రవాళ్లు ముందు యుగం దూతలు అన్నాడు శ్రీశ్రీ. ప్రేమను, సామరస్యాన్ని సందేశంగా ఇవ్వడానికి ఈ కాలపు అమ్మాయిలు, అబ్బాయిలు ముందుకు రావడం అవసరం అనే ఎక్కువ మంది భావిస్తున్నారు. 1978 నాటి డిస్కో గీతం ‘రస్పుటిన్’ ఎంత మందికి గుర్తుందో కాని సడన్‌గా ఆ పాట ఇప్పుడు మళ్లీ కేరళ అంతా మార్మోగుతోంది. డిస్కో గ్రూప్ ‘బోని ఎం’ తయారు చేసి పాడిన ఆ పాట ఆ రోజుల్లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటలోని ‘రస్పుటిన్’ అనే పేరు 20 శతాబ్దంలో రష్యా జార్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక మత పెద్దది. ‘పొలిటికల్ మేనిపులేటర్’గా ఖ్యాతి గడించిన రస్పుటిన్ను ఈ పాట తిట్టిందో పొగిడిందో తెలియనివారు ఉన్నారు. ఏమైనా దాని బీట్‌కు మంచి ఊపు ఉంది. అందుకే త్రిశూర్ మెడికల్ కాలేజీలోని ఇద్దరు మెడికోలు దానికి 30 సెకన్ల స్టెప్పు వేసి ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేశారు. తాము చదువుతున్న మెడికల్ కాలేజీ టాప్ ఫ్లోర్లో ఉండే హౌస్ సర్జన్స్ క్వార్టర్స్ కారిడార్‌లో దీని తోటి విద్యార్థి షూట్ చేయగా డాన్స్ చేసి పోస్ట్ చేశారు. ఆ ఇద్దరి పేర్లు జానకి ఓమ్కుమార్, నవీన్ రజాక్. వీళ్లిద్దరి డాన్స్ ముఖ్యంగా కాళ్ల కదలిక, ఉత్సాహం నెటిజన్స్‌కు ఎంత నచ్చాయంటే రాత్రికి రాత్రి వాళ్లు స్టార్లైపోయారు. కాలు కదిపిన మెడికో జంట కరోనా వ్యాప్తి వైద్యరంగంపై ఎంత వొత్తిడి పెంచిందో అందరికీ తెలుసు. వైద్య విద్యార్థులు కూడా ఇందుకు అతీతం కాదు. స్ట్రెస్ నుంచి బయట పడటానికి డాక్టర్లు కూడా ఐసియులలో డాన్స్ చేసి వీడియోలు పోస్ట్ చేయడం చూశాం. అలానే కేరళ త్రిశూర్ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న నవీన్ రజాక్, థర్డ్ ఇయర్ చదువుతున్న జానకి ఓమ్ కుమార్ కూడా నాటి డిస్కో గీతం ‘రస్పుటిన్’కు స్టెప్పులేసి పోస్ట్ చేశారు. వారిద్దరి ఆనంద తాండవం క్షణాల్లో వైరల్‌గా మారింది. కేరళతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా పాకిపోయింది. అందరూ వారి డాన్స్‌ను మెచ్చుకున్నారు. జానకి తల్లి డాక్టర్, తండ్రి సైంటిస్ట్. నవీన్ రజాక్ తండ్రి వ్యాపారి. అతని కుటుంబీకులు హైదరాబాద్‌లో సివిలింజనీరింగ్ లో ఉన్నారు. త్రిశూర్ మెడికల్ కాలేజీలో ‘వైకింగ్స్’ పేరుతో 13 మంది సభ్యుల డాన్స్ బృందం ఉంది. అందులో నవీన్, జానకి ఇద్దరూ సభ్యులు. ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లు. అందుకే డ్యూటీ మధ్యలో ఆటవిడుపుగా ఈ డాన్స్ షూట్ చేసి పోస్ట్ చేశారు. చాలా పొగడ్త.. వివాదం.. పొగడ్తలు వచ్చి పడ్డ ఈ జంటను ఇప్పటి కేరళ సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఒకరిద్దరు ‘మత వ్యాఖ్యానం’ చేయడానికి చూశారు. ఒక అడ్వకేట్ దీనిని ‘డాన్స్ జిహాద్’గా వ్యాఖ్యానిస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టడంతో అతనికి విపరీతమైన ఎదురు సమాధానాలు వచ్చాయి. ప్రతి దాన్ని మతంతో ముడిపెట్టడంపై మండిపడ్డ మెడికోలు, విద్యార్థి సంఘ నాయకులు ‘హేట్ రెసిస్ట్’ హ్యాష్స్టాగ్తో అదే పాటకు బోలెడన్ని వీడియోలు చేస్తూ తిరిగి పోస్ట్ చేయసాగారు. బాగా డాన్స్ చేసే జంటకు 5 వేల రూపాయల క్యాష్ అవార్డు కూడా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ లో 30 సెకన్ల వీడియోకు అనుమతి ఉండటం వల్ల నిడివి అంతలోనే ఉండాలని షరతు పెట్టారు. దాంతో మా నృత్యం ద్వేషానికి ప్రతిఘటనగా అభివర్ణిస్తూ అక్కడ చాలా మంది డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా ఈ జంటను మీరు మళ్లీ మళ్లీ ఇలా డాన్స్ చేయండి అని కోరుతున్నవారే ఎక్కువ. ఈ మట్టి సామరస్యమైనది మరోవైపు గత నెల రోజులుగా ఇండి పాప్‌లో ‘ఎంజాయ్ ఎంజామి’ పాట దుమారం రేపుతోంది. దీనిని పాడింది తమిళ గాయకుడు అరివు. గాయని ధీ (దీక్షిత). ఇద్దరికీ శ్రీలంకకు వలస వెళ్లిన తమిళ కుటుంబాల మూలాలు ఉన్నాయి. గాయకుడు అరివును అతని నానమ్మ ‘నా తండ్రీ’ (ఎంజామి) అని పిలిచేదట. ‘ఎంజాయ్ నా తండ్రీ’ అర్థంలో ‘ఎంజాయ్ ఎంజామి‘ పేరుతో అతడు పాట రాసి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వంలో పాడి వీడియో విడుదల చేశాడు. ధీ దీనికి గొంతు ఇచ్చింది. ‘ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరికతను కలలు కన్నారు. వారు ఎంతో సామరస్యాన్ని పాటించారు. అందరూ దగ్గరగా రండి. అందరూ దగ్గరగా కూడండి. అందరూ ఎంజాయ్ చేయండి. కలిసి ఎంజాయ్ చేయండి’ అనే అర్థాన్ని ఇస్తూ ప్రకృతిని తలపోస్తూ ‘ఎంజాయ్ ఎంజామి’ పాట సాగుతుంది. పాట చివరలో తన నానమ్మను చూపిస్తాడు కూడా. అరివు కనీసం రేడియోకు కూడా స్థోమత లేని కుటుంబంలో పెరిగాడు. దర్శకుడు పా రంజిత్‌కు రాక్ బ్యాండ్ ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’లో సభ్యుడయ్యాడు. దళిత స్పృహతో పాటలు రాసే ఇతడికి రంజిత్ అవకాశం ఇచ్చాడు. తమిళంలో ఎన్నో పాటలు రాసి పాడుతున్నాడు. ధీ కూడా సామాజిక సందేశాన్నిచ్చే పాప్ గీతాలను విడుదల చేస్తోంది. ఆమె గానానికి ఒక విశిష్ట తత్త్వం ఉంటుందని అంటారు. ఆమె గొంతు వినాలంటే వెంకటేశ్ ‘గురు’లో ‘ఓ సక్కనోడా’... పాట వినాలి. సంగీతం, నృత్యంలో కొత్తతరం సందేశాన్ని ఇమిడ్చే ప్రయత్నం చేస్తుంది. పూర్వం మంచి బుద్ధులు పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు పిల్లలు చెప్పే కాలం వచ్చింది. పిల్లల చేత చెప్పించుకునే స్థితిలో సమాజం ఎందుకుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫ్యామిలీ -
ప్రముఖ గాయకుడుకి మాతృ వియోగం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య మాతృమూర్తి కన్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్ బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో కారుణ్య తల్లి జానకి (70), తండ్రి మధు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ బీడీఎల్ విశ్రాంత ఉద్యోగులు. జానకి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సైదాబాద్ శ్మశాన వాటికలో జానకి అంత్యక్రియలు నిర్వహించారు. జానకి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి ఇకలేరు
జైపూర్/అమరావతి: మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ దాదీ జానకి (104) శుక్రవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆమె, దీర్ఘకాలిక వ్యాధిబాధల కారణంగా మృతిచెందినట్లు ఆ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు. 21వ ఏటనే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాను ఎంచుకున్న విభాగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 140 దేశాల్లో ఆమె స్థాపించిన సేవా కేంద్రాలు ఉన్నాయి. దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆమె మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారత కోసం జానకి విశేష కృషి అందించారని కొనియాడారు. ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ గవర్నర్ల సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా ఆమె తన జీవితాన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవకు అంకితం చేశారని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. -
రాజయోగిని జానకి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారిత కోసం జానకి విశేష కృషి అందించారని, ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు. కాగా, దాదీ జానకి 1916 జనవరి 1వ తేదీన పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో జన్మించారు. 21 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిరంతరం కృషితో బ్రహ్మకుమారీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఉదర, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజస్తాన్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. రాజయోగిని జానకి ఎంతో శ్రద్ధతో సమాజానికి సేవ చేశారని, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని మోదీ కొనియాడారు. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
ఉత్తరమే దీపం
వాళ్లిద్దరినీ చిదివి దీపం పెట్టవచ్చు. అంతముద్దు వస్తున్నారు. తలంటు పోసుకుని కొత్త చొక్కాలు తొడుక్కున్నారు. ‘‘నేనే– నేనే’’ ఏదో తమ్ముడు చెప్పబోతున్నాడు. ‘‘ఊ’’ ‘‘ఊ అంటే కాదే. వినవే–’’ ‘‘వింటున్నాగా చెప్పు.’’ ‘‘తలెత్తి వినాలి’’అక్క నవ్వింది. పెద్దాడబడుచు తను ఆ యింటికి. తనకు కోపం రారాదు. అమ్మ చెప్పింది ఆ మాట. అప్పటినుంచీ ‘జానకి’కి కోపం రాదు. కోపం వచ్చినా నవ్వేస్తుంది. ‘‘తలెత్తాను చెప్పు’’ ‘‘మనం మామయ్యగారింటికి వెళ్దామే’’ ‘‘దీనికేనా యింత చేశావ్?’’ నవ్వింది జానకి. తమ్ముడికి కోపం వచ్చింది. తమ్ముడు ఎలాగైనా మగబిడ్డ. మగబిడ్డలు కోపాన్నీ ప్రేమనూ అణుచుకోలేరు. ‘నే చెప్పను ఫో’ అన్నాడు. ‘‘మానాన్నే– చెప్పమ్మా. అల్లాగే వెళదాంలే,’’ అంది జానకి. తమ్ముడి బుగ్గలు పట్టుకు నిమిరింది. అంత కోపం వచ్చిన తమ్ముడూ ఫక్కున నవ్వాడు. ‘‘ఉత్తరమండోయ్’’ అంటూ పోస్టు జవాను వచ్చాడు. జానకి ఉత్తరం పుచ్చుకుంది. ‘నాన్నగారికి నేనే యిస్తా. ఉత్తరమండోయ్ అంటా. నాన్న నవ్వుతాడు’ అనుకుంది. పక్కయింటి పిల్లవాడు టపాకాయలు కాల్చడం మొదలెట్టాడు. జానకి నేరుగా తల్లి దగ్గిరికి వచ్చింది. ‘‘ఏం అమ్మా ఇల్లా వచ్చావు’’ అంది తల్లి. తల్లికి జానకి అంటే ఎంతో ఆపేక్ష. ‘‘టపాకాయలు ఇవ్వవూ’’ అంది జానకి. యింట్లో టపాకాయలు లేవు. దీపావళికి కొన్నవన్నీ జానకీ, తమ్ముడూ కాల్చేశారు. యివాళ అమ్మాయి పుట్టినరోజు. వచ్చేప్పుడు కాసిని పువ్వొత్తులూ టపాకాయలూ తెండని చెప్పింది భర్తతో. ‘‘వచ్చేప్పుడు తెస్తాలే’’ అని వెళ్లాడు ఆయన, ఆఫీసుకు పోతూ. ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ వచ్చాడు బాబు. ‘‘టపాకాయలేవీ’’ అన్నాడు. తల్లి క్షణం ఊరుకుంది. బాబు దుడుకువాడు. జానకిలాగా చెప్తే వినడు. ‘‘అప్పచ్చులా?’’ అంది తల్లి. ‘‘కావే. టపాకాయలే. ఏవీ?’’ అన్నాడు బాబు. ‘‘సాయంత్రం కాందే.’’ ‘‘సాయంత్రం కావాలేమిటీ?’’ ‘‘చీకటి పడవద్దూ, కాల్చుకోడానికి?’’ ‘‘అన్నీ అబద్ధాలే–’’ ‘‘కావమ్మా. అక్కయ్య పుట్టినరోజు కదా యివాళ అబద్ధాలు చెప్తామ్మా?’’ ‘‘వాళ్లబ్బాయి కాల్చడంలా మరీ?’’ అన్నాడు బాబు. ‘‘అమ్మా, అమ్మా, ఉత్తరం వచ్చిందే–’’ అంది జానకి. ‘‘ఇలాతే. చూస్తా,’’ అంది తల్లి. ‘‘ఊహూ. నీకివ్వను. నాన్నగారేమన్నారు? ఇంకోళ్ల ఉత్తరాలు చూడకూడదనలా?’’ అంది జానకి. ‘‘మా అమ్మే’’ అని కూతుర్ని ఎత్తుకుని ముద్దెట్టుకుంది తల్లి. జేబులోంచి ఎక్కడ ఉత్తరం లాగుతుందో అని జాగ్రత్తగా జేబు దగ్గర చెయ్యి పెట్టుకుంది జానకి. ‘‘నన్నెత్తుకోమరి’’ అన్నాడు బాబు. తల్లి జానకిని దించింది. యింతలో పక్కయింట్లో టపాకాయల మోత బాగా వినబడటం మొదలెట్టింది. బాబు బిక్కమొహం వేశాడు. తల్లికి ఇదయింది. ‘‘నాన్నా, పరమాన్నం తిందాం...’’ అంది. ‘‘టపాకాయలు’’ అన్నాడు బాబు. ‘‘నాన్నగారు వచ్చాక, అక్కయ్యా, నువ్వూ కొనుక్కుందురు గాని’’ అంది. ‘‘మామయ్యో’’ హఠాత్తుగా మామయ్య ఏమిటో అర్థం కాలేదు ఆమెకు. మామయ్యగారింటికి పోదాం అంటూ తమ్ముడు అన్నమాటను జానకి తల్లికి చెప్పింది. ‘‘వెళ్దాంలే అమ్మా, వెళ్దాంలే’’ అంది తల్లి. ‘‘మామయ్య, మామయ్య’’ అంటూ బాబు కిందికి దిగాడు. టపాకాయల మాట కాస్త మరిచిపోయాడుగదా అని తల్లి సంతోషించింది. పిల్లలిద్దర్నీ పడమటింట్లోకి తీసుకుపోయింది. పరమాన్నం పెట్టింది. సాయంత్రం అయింది. వీధిలో దీపాలు వెలిగించారు. ‘‘నాన్న రాలా?’’ అడిగాడు బాబు. యింతసేపూ ఆగాడు. ఇక ఆగడు. పనిమనిషి చేత కొద్దిగా టపాకాయలూ అవీ తెప్పించింది. ‘‘ఎప్పుడొస్తాడే నాన్న’’ అంటూ మళ్లీ వచ్చాడు బాబు. తల్లి ఆకాశదీపం వెలిగిస్తోంది. ‘‘దణ్ణంపెట్టు బాబూ.’’ఇంతట్లో జానకి చక్కా వచ్చింది. అందరూ దణ్ణం పెట్టాక, దీపాన్ని తాటికి కట్టి ఆకాశానికి ఎత్తింది. దీపారాధన కాంగానే జానకి, తనలో తాననుకున్నట్లు ‘నాన్నా రాలా’ అంది. తల్లి నెమ్మదిగా దీపాలు వెలిగించింది. ఒక్కొక్కటీ వీధి వాకిలి దగ్గిర గూళ్లల్లో పెట్టింది. ఆయన యింకా యింటికి రాలేదు. ‘‘టపాకాయలు కాల్చుకోరూ’’ అంది. టపాకాయలు టపాకాయలు అంటూ బాబు గబగబా వస్తూ పడ్డాడు. దెబ్బ తగల్లేదు. వీపు రాచింది. నేలను కొట్టింది. బాబు ఏడుపు మానాడు. తెప్పించిన టపాకాయలు కాసినీ యిద్దరికీ యిచ్చింది. తనుగూడా గుమ్మంలో నుంచుంది. ఐపోయినై. ‘‘ఇంకా కాసిని’’ అన్నాడు బాబు. ‘‘పోనీ, నావి తీసుకోరా’’ అంది జానకి. జానకి పెద్దాడబడుచు. పెద్దాడబడుచు అంటే తల్లి అంత. ‘‘తే’’ అని, అవీ కాల్చేశాడు. ‘‘అన్నాలు తినరూ’’అంది ఆమె. ‘‘పువ్వొత్తులు కావాలి’’ అన్నాడు బాబు. జానకి తమ్ముణ్ణి సముదాయించింది. పిల్లలు అన్నాలు తిన్నారు. ఆయన యింకా రాలేదు. పిల్లలకు నిద్దరవొస్తోంది. జోగుతున్నారు. ‘‘ఇంతాలిస్యం చేశారేమి చెప్మా’’ అనుకుందామె. ‘‘అక్కడికీ వెళ్లేప్పుడు చెప్పాను గూడానూ’’ అనుకుంది మళ్లీ. వీధిలోకి చూసింది. రావడం లేదు. ‘‘ఎప్పుడొస్తారో ఏమో’’ అనుకుని పిల్లవాడి దగ్గిర పడుకుంది. నాన్నగారికి వుత్తరం యిస్తా అని నిద్ర మానుక్కూర్చున్న జానకి కూడా నిద్రపోయింది. వీధిలో పిల్లల మోత గూడా ఆగిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. వస్తూనే ఉస్సూరుమన్నాడు. ‘‘పొద్దోయి వచ్చారేం?’’ అంది. అతను మాట్లాడలేదు. ‘‘సినీమాకు పోయారా?’’ అంది. తనూ, పిల్లలూ రాందే ఆయన పోడని తెలుసు. ఐనా అనాలని అంది. ‘‘అబ్బా లేదే’’ అన్నాడు ఆయన. చిరు చలికాలంలో గూడా ఆయనకు గొంతిక పొడి ఆరిపోయింది అప్పుడు. ‘‘మీరొస్తారు వస్తారని చూసి చూసి పిల్లలు యిప్పుడే పడుకున్నారు’’ అంది. ‘‘పాపం’’ అన్నాడు భర్త. ‘‘ఏం అల్లా వున్నారు?’’ ఏదో జరుగుతోందని తెలుసు. యింట్లో చెప్పడం దేనికని చెప్పలేదు. ‘‘నన్ను యివాళ పనిలోనుంచి తీసేశారు’’ అన్నాడు ఆయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘‘కాళ్లు కడుక్కోండి, భోజనం చేద్దురుగాని’’ అంది. అతడు కాళ్లు కడుక్కుంటున్నాడు. జానకి చప్పుడు విని లేచింది. ‘‘లెక్కంతా చూచి చెక్కు ఇచ్చారు’’ అన్నాడాయన. ‘‘నీకు ఉత్తరం వచ్చింది నాన్నా’’ అంటూ పక్కమీంచి లేచింది జానకి. ‘‘మీకేదో ఉత్తరం వచ్చిందిట. తనే ఇస్తానని నాకు చూపించనన్నా లేదు అది’’ అంది తల్లి. ‘‘ఏదమ్మా’’ అని తీసుకున్నాడు. దీపం దగ్గిరికి వచ్చి కవరు చింపి ఉత్తరం చదువుకున్నాడు. ‘‘ఎక్కణ్ణుంచండీ’’ అందామె. ‘‘మీ తమ్ముడు వ్రాసేడే, ఇదిగో వినూ’’ ‘‘బావకు నమస్కారాలు. అక్కయ్యను అడిగానని చెప్పండి. జానకికీ బాబుకూ నా ముద్దులు. ఇక్కడ నీకు మంచి ఉద్యోగం చూశాను బావా. అక్కడపడి ఎన్నాళ్లని బాధపడతావు? సెలవు పెట్టిరా. ఓ వేళ సెలవు ఇవ్వకపోతే– ఆ ఉద్యోగాన్ని తన్నేసి మరిరా. అన్నీ ఆలోచించే రాస్తున్నానిది. అందరం కలిసివుందాము. ఎక్కువ జీతం గూడాను. నా మాటవిని, ఒకసారి రా బావా.’’ ‘‘నేననుకుంటూనే ఉన్నా. అమ్మాయి పుట్టినరోజు ఇది. చెడు జరగలేదీరోజున. పోతే పోయిందిలెండి పాడు వుద్యోగం. రాత్రింబవళ్లూ రెక్కలు విరుచుకున్నా మెప్పు లేదు’’ ‘‘మామయ్య దగ్గిరికి పోదాం నాన్నా’’ అంది జానకి. ‘‘మాతల్లే’’ అని జానకిని ముద్దాడాడు తండ్రి. ‘‘మా తల్లి వుండగా చీకటా. నేను, మా అమ్మ, మా యింటికి. శరత్ పూర్ణిమ’’ అన్నాడు తండ్రి. -
భార్య, కూతుర్ని రైల్వేస్టేషన్లో వదిలేశాడు..
సాక్షి, విశాఖపట్నం : తాళికట్టిన భార్యను, రక్తం పంచుకుపుట్టిన బిడ్డను ఓ ప్రబుద్ధుడు రైల్వేస్టేషన్లో వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఆ బాధితురాలు శనివారం విశాఖ మహారాణిపేటలో భర్త ఇంటి వద్ద ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని బచేలిలో రైల్వేశాఖలో పని చేస్తున్న సందీప్‌కి ఏలూరు శాంతినగర్‌కు చెందిన జానకితో 2008లో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. కాగా పెళ్లి సమయంలో జానకి తల్లిదండ్రులు భారీగా కట్నం కూడా ముట్టచెప్పారు. రైల్వే ఉద్యోగి అయిన సందీప్ విధుల్లో అలసత్వం కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు..జానకిని కొట్టడం, మానసికంగా హింసించడంతో ఆమె తల్లిదండ్రులకు వద్దకు వెళ్లిపోయింది. కుటుంబ కలహాలపై ఏలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం... ఆ తర్వాత ఇరు కుటుంబాలు కాంప్రమైజ్ కావడంతో గొడవలు సద్దుమణిగాయి. ఇటీవలే సందీప్ తిరిగి విధుల్లోకి చేరడంతో పాటు వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో జానకిని ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం.. భర్త వద్ద వదిలి వెళ్లారు. అయితే బచేలి నుంచి శుక్రవారం భార్య, కుమార్తెతో సహా విశాఖకు వచ్చిన సందీప్.. వారిని రైల్వేస్టేషన్లోనే వదిలి వెళ్లిపోయాడు. భర్త కోసం ఎంతసేపు చూసినా రాకపోవడంతో కుతూరితో కలిసి జానకి అత్తవారింటికి వెళ్లింది. అయితే ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా, ముఖం చాటేయడంతో ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తనను పట్టించుకోవడం లేదంటూ... తనకు న్యాయం చేయాలంటూ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
సేవతో ప్రపంచాన్ని గెలవొచ్చు
హైదరాబాద్: నిస్వార్థం, సేవాతత్పరతతో ప్రపం చాన్ని గెలవొచ్చని బ్రహ్మకుమారీస్ చీఫ్, రాజయోగిని దాదీ జానకీ అన్నారు. హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఆమె ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి శాంతి సరోవర్‌లో ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ప్రతి వ్యక్తి సింపుల్‌గా ఉంటూనే శాంపిల్‌గా ఉండగలిగితే (హర్ ఆద్మీ ‘సింపుల్’రహెతే హువే ‘శాంపిల్’బన్నా హై) ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వగలిగే వారమవుతాం’అని అన్నారు. ప్రతి వ్యక్తి మధురత, నమ్రత, స్వచ్ఛత, ధీరత, విధేయత అనే ఐదు ప్రధాన అంశాలను గుర్తించి ముందుకు నడిస్తే అన్నింటా విజయం సాధ్యమేనన్నారు. ‘బ్రహ్మబాబా ఎంతోమంది పేర్ల ను మార్చినప్పటికీ నా పేరు జానకీ అని, అందులో జాన్ కీ ఉందని అందుకే నీవు జానకీగానే ఉండాలని సూచించారు’అని ఆమె గుర్తు చేశారు. బాబా సూచనతో నా కర్తవ్యం అర్థమైందన్నారు. మనం ఏ పనిచేసినా అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించవద్దని, అన్ని పనులు చేయడమే మనం అలవర్చుకోవాలన్నారు. పరమేశ్వరుడే పరమాత్మ అని, అతనిలోనే తల్లి, తండ్రి, సద్గురు ఉన్నాడని, పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటేనే మనం సుఖజీవనాన్ని సాగిస్తామని చెప్పారు. శాంతి ప్రధాత భగవంతుడు మాత్రమేనని, వారితో సంబంధం ఏర్పర్చుకున్న ప్రతి ఒక్కరికీ ఇది లభ్యమ వ్వగలదన్నారు. సుఖాన్ని ఎలా పొందడం.. ఎలా పంచడం.. అనే విషయాలను పూర్తిగా గ్రహించాలన్నారు. ప్రకృతితో మమేకమయితే అన్ని అంశాలు గ్రహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) మాజీచైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, శాట్స్ వీసీ, ఎండీ దినకర్‌బాబు, సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, జోనల్ ఇన్చార్జి సంతోష్ దీదీ, రాజయోగి మృత్యుంజయ, శాంతిసరోవర్ డైరెక్టర్ కులదీప్ దీదీ, తెలంగాణ, ఏపీలకు చెందిన బ్రహ్మకుమారీస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అట్టహాసంగా ‘ఇన్నర్ స్పేస్’ప్రారంభం హైదరాబాద్ బ్రహ్మకుమారీస్ సంస్థ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన ‘ఇన్నర్ స్పేస్’భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ సమక్షంలో దాదీ జానకీ ప్రారంభించారు. ఆధునిక ప్రపంచానికి ఆధునిక తరహాలో ఆధ్యాత్మిక చింతన కలగచేసే దిశగా ఈ కేంద్రాన్ని రూపొందించారు. ముఖ్యంగా యువతలో ఒక చైతన్య స్పూర్తిని ఉత్సాహన్ని అందించే దిశగా ఈ సెంటర్లో మెడిటేషన్రూమ్, ఆర్ట్‌గ్యాలరీ, 3ఎం(మైండ్, మ్యాటర్, మెడిటేషన్), 3ఎస్( సైనర్జీ,సైన్స్, స్పిరిచువ్యాలిటీ)వంటి సిద్ధాంతాలతో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు నగరంలోనే అతిపెద్ద బ్రహ్మకుమారీస్ సంస్థ పతాకాన్ని దాదీ జానకీ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా జైన్ హెరిటేజ్ విద్యార్థులు రూపొందించిన దశావతారాల నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
సకారాత్మకమే సమాజ హితం
ఎవరికయితే భవిష్యత్ పట్ల సకారాత్మకమైన దృష్టి ఉంటుందో వారే ఈ ప్రపంచానికి ఉపయోగ పడే విధంగా ఉంటారని, భవిష్యత్ పట్ల ఎన్నో ఆశలతో వారి దృక్పథాన్ని మార్చుకోగలుగుతారని దాది జానకి అంటారు.ప్రజాపిత బ్రహ్మ కుమారిస్ ముఖ్య సంచాలిక దాది జానకి గత 83 సంవత్సరాలుగా తమ జీవితాన్ని ఈశ్వరీయ సేవకు కైంకర్యం చేశారు. యావత్ భారత దేశంలో ఆమె సేవలను అందించిన తరువాత 1974 సంవత్సరంలో లండన్‌లో తమ సేవా కార్యక్రమాలు ఆరంభించారు. 125 దేశాలలో ఈశ్వరీయ సేవలను విస్తరింప చేయడంలో వారి పాత్ర కీలకమైనది. దాది ప్రకాశ మణి పరమపదించిన తరువాత 2007 సంవత్సరం నుండి ముఖ్య సేవా కేంద్రమైన మౌంట్ అబు రాజస్థాన్‌లో ముఖ్య ప్రసాసికగా బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జానకి దాది గొప్ప అధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. వారి ముఖ్య ధ్యేయం వారి మనస్సుని, హృదయాన్ని భగవంతుని కార్యాన్ని నిర్వహించడమే తమ జీవిత లక్ష్యంగా, ఆశయంగా పెట్టుకున్నారు. భగవంతుడు ఒక పవిత్రమైన ప్రేమ జ్ఞానికి ఆధారం అనే అనుభవాన్ని వారు స్వయంగా అనుభవించి, ఆ గుణాలను తమలో నింపుకొన్నారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఎంతోమందికి స్పూర్తిని ఇచ్చింది. జీవితంలో కొత్త ఆశలను కలిగించింది. ప్రస్తుత సమాజంలో ఉండే స్వార్థ పూరితమైన సంబంధాలు అవగాహన చేసుకొని ఈ ప్రపంచం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని చేరబోతోంది అనే పరిస్థితిని గుర్తించారు కానీ వారి దృష్టి ఎప్పుడూ కూడా సకారాత్మకంగా మానవతా విలువలను పెంచే మంచిని పెంచే విధంగా ఉంటుంది. ప్రాచీన రాజయోగ విధానాన్ని తిరిగి ఆధునిక విధానంలో ప్రచారం చేయడానికి వారు ఆధారమయ్యారు. ఒక చక్కటి క్రమ శిక్షణ, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా దాది అనేక రంగాల వారికి తిరిగి ఆత్మ విశ్వాసాన్ని తమలో ఎలా చిగురింప చేయాలో తమ సాధన ద్వారా తెలియ చేశారు. ఈ విధంగా నేటిసమాజానికే కాకుండా భవిష్య సమాజ ఉన్నతి కోసం వారు ఎంతో పాటు పడ్డారు. 1916 వ సంవత్సరంలో ఉత్తర భారత దేశంలోని పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుండి ఇతరుల సంక్షేమం కోసమే వారు ఆలోచించేవారు. తమ బాల్య అవస్థలోనే వారి తండ్రితో వారు ఎన్నో అధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తూ శాకాహారం గురించి ప్రచారం చేసేవారు. అనారోగ్యంగా ఉన్నవారికి, వృద్ధులకి సేవ చేసేవారు.బాల్యం నుండే వారు సత్యాన్వేషణ ప్రారంభించారు. 1937వ సంవత్సరంలో జానకి దాది ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపింప బడిన బ్రహ్మ కుమారిస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయంలో ప్రవేశించారు. ప్రజాపిత బ్రహ్మ పూర్వనామం దాదా లేఖ్ రాజ్. వారు ప్రముఖ వజ్రాల వ్యాపారి. వారి 61వ సంవత్సరంలో స్వయగా పరమాత్ముని ద్వారా భవిష్యత్తు ప్రపంచం సాక్షాత్కారం పొందారు. ఒక సత్యమైన, స్వచ్ఛమైన బంగారు ప్రపంచాన్ని నిర్మించడం అనే ఈశ్వరీయ కార్యాన్ని తమ ధ్యేయంగా తమ యావదాస్తిని ఈ సంస్థకు సమర్పించారు. రాజ యోగా అభ్యాసం ద్వారా ఎలా నిద్రాణమైన సత్యమైన శక్తులను జాగృతి చేయవచ్చునో వారు గుర్తించారు. పరమాత్ముని స్మృతి ద్వారానే స్వయం సంస్కారాలను పరివర్తన చేసుకోవచ్చని తెలుసుకున్నారు. ఈ సమయం లోనే వారు స్త్రీ శశక్తీకరణ కోసం ఎంతో పాటుపడ్డారు. కొంత కాలం తరువాత దాది జానకి ఒక వైపు రాజయోగ అభ్యాసం ద్వారా అతీంద్రియ సుఖాన్ని, అద్భుతమైన శాంతిని ఆనందాన్ని అనుభవం చేస్తూ ఈ సంస్థలో సభ్యులందరూ కూడా శారీరక శ్రమ చేయవలసి వచ్చింది. అదే సమయంలో జానకి దాది ఆ సంస్థలోని సభ్యులకు సేవ చేయడానికి నియమితులైనారు. 1974 సంవత్సరంలో వారు ఈశ్వరీయ ఆదేశం అనుసారంగా విదేశాలలో ఈశ్వరీయసేవలను ఆరంభించడం కోసం భారత దేశాన్ని వదలి వెళ్లారు. లండన్ ముఖ్య సేవా కేంద్రంగా చేసుకున్నారు. ప్రేరణాదాయకమైనటువంటి వారి శిక్షణ ద్వారా వ్యక్తిగత అనుభవాల ద్వారా, ఈ అధ్యాత్మిక విశ్వ విద్యాలయం ముఖ్య శిక్షణ లను విదేశీయులు కూడా గుర్తించారు. ఈ విధంగా దాది గారి నేతృత్వంలో దాదాపు 120 దేశాల్లో సేవాకేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఈ ఈశ్వరీయ శిక్షణ వ్యక్తిగత జీవితంలోనే కాకుండా తమ దైనందిన ఉద్యోగ వ్యవహారాలలో కూడా ఎంతో ఉపయోగ పడుతుందని ఎంతోమంది గుర్తించారు. దాది జానకి చేతుల మీదుగా ఆధునిక భవన ఆరంభం... దాది జానకి నేడు బ్రహ్మ కుమారీల దక్షిణ భారత దేశ ముఖ్య రిట్రీట్ సెంటర్ అయిన శాంతి సరోవర్ గచ్చిబౌలిలో ఒక ప్రత్యేక సేవకు ఏర్పాటు చేయబడిన ఇన్నర్ స్పేస్ అనే ఆధునిక భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఆధునిక సమాజానికి, యువతకు ప్రత్యేకమైన రీతిలో తర్కబద్ధంగా, శాస్త్రీయంగా ఆంతరంగిక వివేకాన్ని స్వయంగా అనుభూతి చెందడానికి అనువైన రీతిలో ఏర్పాటైన ఈ నూతన సేవా కేంద్రం లో అధునాతన రీతిలో ధ్యాన మందిరం, భారత దేశ ప్రాచీన రాజ యోగ విశిష్టతను తెలియచేసే ప్రదర్శనా స్థానం, 140 మంది ఒకేసారి వీక్షించే ఆడియో విజువల్ రూమ్, ఆధ్యాత్మిక గ్రంథాలయం ప్రత్యేక ఆకర్షణలు. ప్రారంభోత్సవం తరువాత, నగరంలో బ్రహ్మకుమారీల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. బ్రహ్మకుమారీ కేంద్రాల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచాలకులు, హైదరాబాద్ నగర బ్రహ్మ కుమారీల ముఖ్య సంచాలకులు, పలువురు ప్రముఖులు, బ్రహ్మకుమారీల ముఖ్యకేంద్రమైన మౌంట్ అబు నుంచి రాజయోగి మృత్యుంజయ హంస బెన్ తదితర సభ్యులు ఉంటారు. -
గాయకుడ్ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకుని ఆశీర్వదించడానికే వచ్చానని ప్రముఖ సినీ నేపథ్యగాయిని గానకోకిల జానకి పేర్కొన్నారు. నగరంలోని పురమందిరం ఓపెన్ థియేటర్లో సోమవారం రాత్రి విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన పాటల రారాజ బాలు పుట్టిన రోజు పండగ ఆద్యంతం జ్ఞాపకాల పరంపరగా సాగింది. సినీ రచయిత వెన్నలకంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జానకి మాట్లాడుతూ తనకు సత్కారం చేస్తానంటే, ఈ వేడుకకు రాలేదని, కేవలం పుట్టిన బాలుడు బాలసుబ్రహ్యణ్యాన్ని ఆశీర్వదించడానికే వచ్చానన్నారు. బాలులో ఉన్న టాలెంట్, కలిసొచ్చిన అదృష్టం, తెలివితేటలు, మాటలతో కట్టిపడేసే నైజం అన్నింటినీ మించి గ్రాస్పింగ్వల్లే ఇంతపెద్ద గాయకుడయ్యాడరన్నారు. తన అభివృద్ధికి జానకమ్మే కారణం అని పలుమార్లు బాలు చెబుతుంటాడని, అయితే నెల్లూరు, గూడూరులో జరిగిన పాటల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో తానిచ్చిన ప్రోత్సాహపు మాటలకు తదాస్థు దేవతల ఆశీర్వాదం వల్ల బాలు పెద్ద గాయకుడై ఉంటారన్నారు. గాయనిగా తన ప్రస్థానం సినిమా నేపథ్య ప్రపంచంలో బాలు, జానకి పాటలు, సంఘటనలను ఆమె వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాయకుడిని కావాలని తాను ఎప్పడు అనుకోలేదన్నారు. తనకేమి తెలియదో తనకు బాగా తెలుసనీ, ఇంజినీరు కావాలని అనుకున్న లక్ష్యం జానకమ్మ మాటలతో మారిపోయి శృతిపాండిత్యంతో ప్రయత్నించానన్నారు. ఆ తరువాత ప్రస్థానం అందరికీ తెలిసిందేనన్నారు. జానకమ్మ మహా గాయనిఅని మిగిలిన వాళ్లు పాడలేని పాటలు పాడగల దమ్మున్న గాయని అన్నారు. సంగీతానికి అంతులేదనీ, ఎంతవరకు నేర్చుకున్నాం.. ఎంతవరకు సాధన చేశామనే దానిపైనే కళాకారుల స్థాయి ఆధారపడి ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్‌ను ఎవరికి వారు అనుసరించాలని పలు సూచనలు చేశారు. సంగీత, సాహిత్య విశ్లేషకులు వి.ఎ.కె.రంగారావు జానకి, బాలు పాటలు, నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. సినీ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ సంగీతం భగవంతుని భాష అని నెల్లూరు నుంచి గంగోత్రి ప్రవాహంలా సాగిన బాలు ప్రస్థానం, జానకమ్మల పాటలను విశ్లేషించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్ మాట్లాడుతూ సంగీతం పట్ల బాలుకున్న అంకితభావం, పెద్దలను గౌరవించాలనే బాలు తత్వం భావితరాలు అలవర్చుకోవాలన్నారు. ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ సంగీత, సాహిత్యంలో బాలు, జానకమ్మలాంటి గొప్పవారితో వేదికను పంచుకోవడం అదృష్టమన్నారు. లాయర్ పత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ 70ఎంఎం అధినేత హజరత్‌బాబు, వెంకటగిరి రాజా సాయిజ్ఞయాచేంద్ర, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, బాలు కుటుంబసభ్యులు, స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్కారం కాదు.. నమస్కారం తాను పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నవారిని సన్మానించడం ఆనవాయితీ అని అయితే జానకమ్మ అందుకు అంగీకరించకపోవడంతో కేవలం తన ఆశీర్వచనం తీసుకుని తనకు నమస్కరించడం కోసమే ఆమెను ఆహ్వానించామని బాలు పదేపదే స్పష్టంచేశారు. తల్లి శకుంతలమ్మ, కుటుంబసభ్యుల మధ్య బాలు జానకమ్మ వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆమెకు మురళీకృష్ణ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. జానకమ్మ వద్దని చెప్పిన రూ.లక్ష నగదును స్పర్శ ఆస్పత్రిలో ఆడియో థియేటర్ ఏర్పాటుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆకట్టుకున్న నృత్యం నూజివీడు ఐఐఐటీ కళాశాల యోగా విభాగ నిర్వాహకులు సత్యశ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన (ప్ర)యోగాత్మక నృత్యరూప ప్రదర్శన పలువుర్ని ఆలోచింపజేసింది. -
జానకీదేవికి బీజేపీ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాతృమూర్తి వారణాసి జానకీదేవి భౌతికకాయానికి పలువురు బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు...జానకీదేవి భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. కాగా జానకీదేవి బుధవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా బీజేపీ నేత రాంమాధవ్ ..పెద్ద కుమారుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్వస్థలం కాగా, మూడేళ్లుగా జానకీదేవి ఢిల్లీలో కుమారుడు రాంమాధవ్ వద్దే ఉంటున్నారు. రెండో కుమారుడు కిషోర్ అమెరికాలో ఇంజినీరు, కుమార్తె భారతి హైదరాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జానకీదేవి 20ఏళ్లుగా బీజేపీలో చురుకైన పాత్ర పోషించారు. మహిళా మోర్చా రాష్ట్ర విభాగంలో పలు పదవులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. -
బీజేపీ నేత రాంమాధవ్ నివాసంలో విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రి (ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు (గురువారం) హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. రాంమాధవ్‌కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రిమాండ్‌కు ప్రేమోన్మాది
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన బోను జానకి కేసులో నిందితుడిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలసకు చెందిన బోను జానకి కేబీహెచ్‌బీలోని డీమార్టులో సేల్స్ గర్ల్. అదే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు వికారాబాద్ జిల్లా నేర్లపల్లి అనంతప్ప అలియాస్ ఆనంద్‌తో 8 నెలల క్రితం పరిచయం ఏర్పడటంతో తనను ప్రేమించాలంటూ జానకిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె డీమార్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారు అతన్ని మందలించారు. జానకిని మరో బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా అతడి వేధింపులు ఆగలేదు. తన బావతో సెల్ఫోన్లో మాట్లాడుతూ తనకు దూరమవుతోందని భావించిన అనంతప్ప జానకిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఈ నెల 9న జానకి రూమ్‌కు వెళ్లి తనను పెళ్లి చేసు కోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అనంతప్ప కత్తితో జానకిని మూడు చోట్ల పొడిచి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. -
యువతి దారుణ హత్య
-
ప్రాణంతీసిన ప్రేమోన్మాదం
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాదం మరో యువతి ప్రాణాలు బలి తీసుకుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లేందుకు సెలవు పెట్టిన ఆమె.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. ఊరెళ్లేందుకు టికెట్లు తీసుకుని.. షాపింగ్ కూడా పూర్తి చేసింది.. ఎన్నో ఆశలతో ఇంటికి చేరుకున్న ఆమెను ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి మూసాపేట హబీబ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లావాసి బోను జానకి(24)గా, నిందితుడిని వికారాబాద్ జిల్లావాసి ఆనంద్ అలియాస్ అనంతప్ప(27)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ డీమార్ట్ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రేమించాలంటూ వేధింపులు.. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేస్తున్న రూపావతితో కలసి మూసాపేట హబీబ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన ఆనంద్ అలియాస్ అనంతప్ప(27) కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఆనంద్.. జానకితో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుగా తీసుకుని ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురాగా.. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో 15 రోజుల క్రితం డీమార్ట్ యాజమాన్యానికి, ఆనంద్ స్వగ్రామంలోని పెద్దలకు చెప్పటంతో అతడిని పిలిచి మందలించారు. ఇక నుంచి జానకితో మాట్లాడనని, మరిచిపోతానని ఆనంద్ చెప్పాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయటం ఇబ్బందిగా ఉంటుందని జానకిని కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని డీమార్ట్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా జానకికి వేధింపులు తప్పలేదు. ఆనంద్ సనత్‌నగర్‌లో విధులు ముగించుకుని.. కేపీహెచ్‌బీ డీమార్ట్ వద్దకు వచ్చి తనను ప్రేమించాలంటూ మళ్లీ వేధింపులు మొదలెట్టాడు. సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. సంక్రాంతి పండుగ కోసం బుధవారం సొంతూరు వెళ్లాలనుకున్న జానకి.. మంగళవారం నుంచి సెలవు తీసుకుని షాపింగ్ పూర్తి చేసి రూమ్‌కి చేరుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె గది దగ్గరకు వచ్చిన ఆనంద్.. గడియ తీసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కసితో జానకి గొంతు నులిమి.. రూమ్‌లోని కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. గది బయట గడియ వేసి పరారయ్యాడు. రూపావతి విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ జానకి కనిపించడంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రూపావతి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానకి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
జెండర్ వండర్
ఒకప్పుడు ఆమె పెనుగొండ శివ. ఇప్పుడు ఆపరేటర్ జానకి. ఒకప్పుడు ఆలయంలో తలదాచుకున్న అమ్మాయి. ఇప్పుడు నిలువ నీడలేని వాళ్లకు\ ఇళ్లను మంజూరు చేసే పనిలో ఉన్న ఉద్యోగిని. వివక్ష నుంచి ఉద్యోగం వరకూ.. ఇది జానకి లైఫ్ స్టోరీ.. లైవ్లీహుడ్ స్టోరీ! జానకికి ఇరవై ఆరేళ్లు. వైఎస్ఆర్ జిల్లా, చెన్నూరులో హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్. ఇల్లు లేని వాళ్ల జాబితా తయారు చేసి వాళ్లు సొంతిల్లు కట్టుకోవడానికి అవసరమైన డాటా సిద్ధం చేస్తుంటుంది. పుట్టినప్పుడు ఆమెకి అమ్మానాన్నలు పెట్టిన పేరు శివ. ఇప్పుడామె జానకి. అవును... ఆమెను పుట్టినప్పుడు అందరూ అబ్బాయి అనే అనుకున్నారు. అయితే తనలో ఉన్నది అబ్బాయి కాదు, అమ్మాయి అని ఆమెకు తెలుస్తూనే ఉండేది. ఇంట్లో మాత్రం, అమ్మాయిలా కాదు అబ్బాయిలా ఉండమని అనుక్షణం ఆదేశాలు వినిపిస్తూనే ఉండేవి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా పదిహేనేళ్ల పోరాటం. ఆ స్థితిలో ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగిందన్నది.. ఆమె మాటల్లోనే విందాం. ‘‘మాది కర్నూలు జిల్లా చాగలమర్రి. ఇంటర్ వరకు చాగలమర్రిలోనే చదువుకున్నాను. ర్యాంక్ స్టూడెంట్‌ని. ‘చదువు బాగా వస్తోంది, డిగ్రీ ఇంగ్లిష్ మీడియంలో చేస్తే భవిష్యత్తు బాగుంటుంద’ని మా అన్న ప్రొద్దుటూరులో చేర్పించాడు. ప్రొద్దుటూరు కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకున్నాను. ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకున్నాను కూడా. అప్పటికే నా జెండర్ మీద వస్తున్న సామాజిక ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. యూనివర్సిటీలో ర్యాగింగ్‌కు భయపడి బీఈడీ ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది. అధికారులకు నా పరిస్థితి చెప్పి ఇంట్లో చదువుకుని పరీక్షలు రాయడానికి అనుమతి తీసుకుని బీఈడీ పూర్తి చేశాను. అమ్మ భోరున ఏడ్చింది! నేను క్లాసులో అబ్బాయిలతో కలసి కూర్చునే వాడిని. కానీ అమ్మాయిలతోనే ఎక్కువగా స్నేహం చేసేవాడిని. ఎనిమిదో తరగతి నుంచి నాలో మార్పులు స్పష్టంగా తెలియడం మొదలైంది. ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించినా కుదరలేదు. ‘అలా నడవ వద్దు, అబ్బాయిలా ఉండు’ అని ఒత్తిడి ఉండేది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు చీరకట్టుకోవాలనే కోరిక బలంగా కలిగింది. అప్పుడు అమ్మకు చెప్పాను. అంతే... ఒక్కసారిగా ఏడ్చేసింది. అసలే ఆమె ఆస్థమా పేషెంట్. ఆమెకు ఏమవుతుందోనని భయమేసింది నాకు. ‘ఊరి వాళ్ల ముందు తలెత్తుకునేదెలా, ఆత్మహత్య చేసుకోవడమే దారి’ అంటూ కుమిలిపోయింది అమ్మ. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నాను. కానీ వయసుతోపాటు వచ్చే మార్పులు నన్ను నిలవనివ్వలేదు. ఫైనల్ ఇయర్ తర్వాత స్కాలర్షిప్ డబ్బుతో ఇల్లు వదిలి వెళ్లిపోయాను. డాక్టర్ నిర్ధారణ! ఇంటి నుంచి వెళ్లడం వెళ్లడం నేరుగా డాక్టర్ దగ్గరకెళ్లాను. పరీక్షించి నిజమేనన్నారు. ఇంకా వయసు పెరిగే కొద్దీ దేహం పూర్తిగా స్త్రీత్వం సంతరించుకుంటుందని చెప్పారు. అదే విషయం ఇంట్లో చెబితే మా అన్న నన్ను విపరీతంగా కొట్టారు. నిజానికి అన్నకు నేనంటే చాలా ప్రేమ. కానీ ఇలాంటి స్థితిని ఫేస్ చేయడానికి వాళ్లకు భయం అంతే. ఇల్లు వదిలి వచ్చాక కొన్నాళ్లు గుడిలో తలదాచుకున్నాను. లైఫ్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్లయింది. íపీజీ ఎంట్రన్స్ రాయడానికి కడప వెళ్లినప్పుడు నాలాంటి చాలా మంది కనిపించిన సంగతి గుర్తొచ్చి వాళ్లను కలిశాను. వాళ్లు నన్ను బాగా కలుపుకున్నారు. వాళ్లతో కలసి జీవించడానికి స్వాగతించారు. కానీ చదువు కొనసాగించాలనే కోరికను బయటపెడితే సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించి, సాధ్యం కాదన్నారు. వాళ్లతోనే ఉంటూ చెవులు, ముక్కు కుట్టించుకుని, చీర కట్టుకుంటూ, చక్కగా అలంకరించుకుని స్త్రీలాగానే జీవించాను. వేడుకల్లో డాన్సులు చేశాను. జానకి అని పేరు మార్చుకున్నాను. నాకు గాయని జానకి పేరు, ఆమె పాటలు చాలా ఇష్టం. నా ఫోన్లో స్క్రీన్ మీద కూడా ఆమె ఫొటో ఉంటుంది. నాకు ఆమె పేరునే పెట్టుకున్నాను. 2012 నుంచి ఈ ఉద్యోగం వచ్చే వరకు కడపలోనే ఉన్నాను. ఆధార్ మలుపుతిప్పింది! ఆధార్ కార్డు, ఓటర్ లిస్టుల్లో ఎన్రోల్మెంట్ కోసం కలెక్టర్ ఆఫీస్‌లో క్యాంప్ పెట్టి పిలిపించారు. అప్పుడు కలెక్టర్‌గారు మాతో చాలా సేపు మాట్లాడారు. మాకు ఎదురయ్యే కష్టాలను చెప్పాం. అప్పుడు ఏం చదువుకున్నావని అడిగి, ఉద్యోగానికి అప్లయ్ చెయ్యమన్నారు. డిసెంబర్ పదవ తేదీన ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చాలా బాగుంది. ఆఫీసర్లు, తోటి ఉద్యోగులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే సమాజం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు మా ఇళ్లలో స్థానం ఉంటుంది. సమాజం ఆమోదించనంత కాలం అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు కూడా మమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడానికి భయపడతారు. మాలాంటి వాళ్లను ఇంట్లో ఉండనిస్తే ఉద్యోగాలు, చేతనైన పనులు చేసుకుంటూ సామాజిక దాడుల బారిన పడకుండా గౌరవంగా జీవిస్తాం. అర్థం చేసుకోండి ప్లీజ్’’ అంటోంది జానకి. అమ్మ ఇంటికి రమ్మంది.. కానీ! మా అక్క అంగన్వాడీ టీచర్, అన్న బి.ఎ, బీఈడీ చేశాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. తమ్ముడు ఇటీవలే సి.ఆర్.పి.ఎఫ్ ఉద్యోగంలో చేరాడు. మా అమ్మ నాతో ఏదో ఒక రకంగా మాట్లాడుతుంటుంది. ఇంట్లో అందరి క్షేమ సమాచారం చెప్తుంది. మొదట్లో ఓ సారి నన్ను ఇంటికి వచ్చేయమన్నది. నన్ను చీరకట్టుకోనిస్తేనే వస్తానని చెప్పాను. దాంతో ఊర్లో బతకనివ్వరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గంపలు అల్లి కుటుంబాన్ని పోషించి, మమ్మల్ని చదివించి ఇంతటి వాళ్లను చేసింది మా అమ్మ. ఆమె సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నన్ను కూతురిగా స్వీకరించడానికి ఆమె సిద్ధమైతే అమ్మ దగ్గరే ఉంటాను. – జానకి, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ ఎంప్లాయీ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ -
పిక్‌పాకెటింగ్‌కు పాల్పడే మహిళ అరెస్ట్
పిక్‌పాకెటింగ్ పాల్పడుతున్న పాత నేరస్తురాలును మలక్‌పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన జానకి(37) మౌలాలిలో నివాసం ఉంటుంది. చౌటుప్పల్‌కు చెందిన జయమ్మ శనివారం దిల్సుఖ్నగర్ చందన బ్రదర్స్ చౌరస్తాలోని బస్టాప్ వద్ద నిల్చుండగా ఆమె బ్యాగును దొంగతనం చేసింది. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న పోలీసులు జానకి అదుపులోకి తీసుకున్నారు. ఆమె విచారించగా జయమ్మ బ్యాగులోని రూ.20 వేలు నగదు, జానకి నుంచి 14 తులాల బంగారం రీకవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.కాగా.. గతంలో విజయవాడ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లు, నగరంలోని ఆయా పీఎస్ పరిధిలో జానకిపై దొంగతనం కేసులు నమోదు అయ్యాయి. -
నెల్లూరు చల్లబడింది..
ఆందోళనకారులతో ఫలించిన అధికారుల చర్చలు నెల్లూరు ఒకటోనగర ఇన్స్పెక్టర్పై బదిలీవేటు ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి నివేదిక నెల్లూరు(క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత సడలింది. పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఓ వర్గానికి చెందిన ప్రజలతో ఆదివారం జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలీకృతమయ్యాయి. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు శాంతించారు. దీంతో రెండురోజులగా నెలకొన్న ఉద్రిక్తత సద్దుమణిగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వర్గానికి చెందిన ప్రజలు శనివారం రాత్రి ఆందోళనకు దిగిన విషయం విదితమే. దీంతో క్షమాపణ చెప్పేందుకు పోలీసుస్టేషన్‌కు వస్తున్న ఎస్పీ వాహనంపై ఓ వర్గానికి చెందిన యువకులు దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం ఎస్పీ గన్‌మన్ గాలిలో కాల్పులు జరిపి ఎస్పీని సంఘటన స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ ఆదివారం తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకుని సంఘటనకు దారితీసిన పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జానకితో మాట్లాడి ఉద్రిక్తత పరిస్థితులను తొలగించేందుకు తీసుకోవాల్చిన చర్యలపై చర్చించారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీకాంత్ జిల్లాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్పీపై చర్యలకు డిమాండ్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు ఆ వర్గానికి చెందిన వారు నెల్లూరు జెండావీధిలోని ఒక భవనంలో సమావేశమయ్యారు. దీంతో పోలీసు సిబ్బంది ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. ఆందోళనకారులు వందల సంఖ్యలో ఆ భవనం వద్దకు చేరుకుని ఎస్పీని సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఆందోళన చేస్తున్న వర్గానికి చెందిన ప్రతినిధులతో ఐజీ, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎస్పీ, జేసీ ఇంతియాజ్‌తో పాటు పలువురు అధికారులు చర్చలు జరిపారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్పీ, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలనీ, కేసులు ఎత్తివేయాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేశారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఒకటో నగర ఇన్స్పెక్టర్ కె.నరసింహరావును తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ఐజీ ప్రకటించారు. ఎస్పీపై చర్యలు తీసుకునే విషయం అధికారులు దాటవేయడంతో తిరిగి ఆ వర్గం వారు పోలీసు కవాతు మైదా నం బయట ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉందని భావించిన ఐజీ, కలెక్టర్లు ఆందోళనకారుల వద్దకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. ఘటన దురదృష్టకరం ఓ వర్గానికి చెందిన ప్రజలు అపార్థం చేసుకోవడం వల్లనే పరిస్థితి అదుపుతప్పిందని, ఇలాంటి ఘటన నెల్లూరులో చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఐజీ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ, డీఎస్పీలపై ప్రభుత్వానికి, డీజీపీకి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్య సద్దుమణిగిన తర్వాత ఐజీ, కలెక్టర్, నగర మేయర్ అజీజ్, ఆ వర్గ ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, నెల్లూరు కలెక్టర్ జానకి, మేయర్ అజీజ్ తదితరులు. -
అటు కలెక్టర్... ఇటు మందుబాబు
నెల్లూరు (గుడూరు ) : ఎవరొస్తే నా కేంటి... నా లోకంలో నేను విహరిస్తుంటాను అనే విధంగా ఓ మందుబాబు వేములపాళెంలో శనివారం ఇలా కనిపించారు. ఓ వైపు కలెక్టర్ జానకి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగానే మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఇలా రోడ్డుపై దొర్లుతున్నాడు. అదే విధిలో ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌తో పాటు గుడూరు సబ్ కలెక్టర్ గిరిషా అతని పక్కనుంచే వెళ్లారు. అధికారులు, జనం హడావుడిగా ఉన్న మందుబాబు మాత్రం తనకేం పట్టనట్లు మత్తులో ఇలా జోగుతున్నాడు. -
'నా భర్త వేరే యువతిని గర్భవతిని చేశాడు'
ఇండోర్: మామ, భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆశారాం బాపు కోడలు జానకి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇప్పటికే వేర్వేరు లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించింది. రాజస్థాన్ లోని ఖాజురాణా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత సెప్టెంబర్ 19నే ఆశారాం కోడలు ఫిర్యాదు చేయగా మంగళవారం ఆమె వాంగ్మూలం రికార్డు చేసేందుకు స్టేషన్ కు పిలిచారు. ఈ సందర్భంగా ఆమె తన భర్త నారాయణ హర్పలానీ ఆశ్రమంలోని మహిళా భక్తులతో సంబంధాలు పెట్టుకునేవాడని, చెడుగా ప్రవర్తించేవాడని ఓ యువతిని గర్భవతిని కూడా చేశాడని చెప్పింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, అయితే, తనకు విడాకులు ఇచ్చాకే ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పినట్లు తెలిపింది. ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెతో సంబంధాన్ని పెట్టుకొని తనను చీకట్లో మగ్గేలా చేశాడని అన్నారు. తన మామ కూడా వేధించాడని, తన తండ్రి దేవరాజ్ కృష్ణానిని మాటలతో మభ్యపెట్టి ఆస్తులు మొత్తం తన ఆశ్రమానికి రాయించుకున్నాడని చెప్పింది. తనను నారాయణ్ మే 22, 1997న వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా పోలీసులకు తమ పెళ్లినాటి ఫొటోలు, వీడియోలు, ఇతర పత్రాలు పోలీసులకు సమర్పించింది. -
'చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు'
వింజమూరు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): స్వార్థం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించబోమని నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఆమె జిల్లాలోని వింజమూరు సమీపంలో ఉన్న న్యూట్రస్ స్పెషాలిటీస్ అనే ఔషధ ఫ్యాక్టరీని సందర్శించారు. ఇటీవల గ్రామస్తుల దాడిలో కర్మాగారానికి కలిగిన నష్టాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. గామస్తుల విన్నపం మేరకు నెల క్రితం కర్మాగారం విడుదల చేసే వ్యర్థాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందిందని ఈ సందర్భంగా తెలిపారు. తమ అనారోగ్యానికి ఫ్యాక్టరీ వ్యర్థాలే కారణమంటూ గ్రామస్తులు ఫ్యాక్టరీపై ఇటీవల దాడికి దిగటం దురదృష్టకరమన్నారు. గ్రామానికి చెందిన కొందరు నాయకులు స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పారని చెప్పారు. దాడి కేసులో ఇప్పటికే 10 మంది అరెస్టు.. 70 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. అనంతరం గ్రామంలోని వారికి రేషన్, పింఛన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించామని, అయితే వాటిని పునరుద్ధరించే విషయాన్ని పరిశీలించనున్నట్లు గ్రామస్తులకు కలెక్టర్ జానకి హామీ ఇచ్చారు. -
పనిచేసేచోట వేధిస్తే పనిష్మెంటే...!
కేస్ స్టడీ జానకి ఒక పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్‌లో నిజాయితీ గల అధికారిగా, హుందాగా ఉండే మహిళగా జానకికి మంచి పేరుంది. ఆఫీస్ వ్యవహారాలలో ఎంత నిక్కచ్చిగా ఉంటుందో, తోటి ఉద్యోగులకు సాయం చేయడంలో అంత ఉదారంగా వ్యవహరిస్తుంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా, వెంటనే స్పందించే ఏకైక వ్యక్తిగా మంచి పేరుంది. మహిళా ఉద్యోగులూ, పురుష ఉద్యోగులూ అందరూ గౌరవించే, అభిమానించే ఆఫీసర్ జానకి. సబార్డినేట్స్‌తో కలుపుగోలుగా ఉంటూ, ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న సమయంలో, కొత్తగా వచ్చిన తన పై ఆఫీసర్‌తో సమస్య మొదలైంది జానకికి. ఛార్జ్ తీసుకున్న రోజు నుంచే అతనికి జానకికై కన్ను పడింది. అందంగా, హుందాగా ఉండే జానకిని ఎలాగైనా గదీసుకోవాలనుకున్నాడు. ఆయన వయసు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంది. అయినా చెడుబుద్ధి మాత్రం ఇంకా పోలేదు. మహిళా ఉద్యోగులంటే చులకన భావం. వారంతా సులువుగా లొంగిపోతారన్న దురభిప్రాయం. దాంతో అవసరం ఉన్నా, లేకున్నా జానకిని తన ఛాంబర్‌కి పిలిపించుకుని ఆమె చీరల సెలక్షన్ బాగుంటుందని ఒకసారి, ‘మీ భర్త విదేశాల్లో ఉన్నారుగా, మీకు కంపెనీ ఎలా?’ అంటూ ద్వంద్వార్థ సంభాషణలు చేయడం మొదలు పెట్టాడు. అతని వ్యవహారం పసిగట్టిన జానకి అంటీముట్టనట్టుగా వ్యవహరించసాగింది. ఎంతో అవసరం ఉంటే తప్ప అతని ఛాంబర్‌కు వెళ్లడం లేదు. ఫైళ్లన్నీ అటెండర్‌తో పంపసాగింది. దాంతో అతనికి పంతం పెరిగింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని అదనపు పని అప్పగించి, ఆఫీస్ టైమ్ దాటాక కూడా ఆఫీస్ పని చేసేలా వేధించసాగాడు. ఇవన్నీ జానకిని ఎంతో కృంగదీశాయి. అయినా ఎవరికీ చెప్పుకోలేదు. భర్త విదేశాలలో ఉన్నారు. తోటి ఉద్యోగులకు చెప్పాలంటే అతని వయసు దృష్ట్యా నమ్మరేమో అని! అతని వెకిలి ప్రవర్తన, తనను తాకాలని చేసే ప్రయత్నాలు, ద్వంద్వార్థాల డైలాగులు, అనవసరపు పొగడ్తలు భరించలేకపోయింది. తమ కార్యాలయంలో ‘పని చేసే చోట లైంగిక వేధింపుల చట్టం’ గురించి తన ఆధ్వర్యంలోనే రెండుమూడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసింది. ఆ చట్టం ప్రకారం ‘ఫిర్యాదుల కమిటీ’ కూడా ఏర్పడేలాగా కృషి చేసింది. ఈ కొత్త మేనేజర్‌కి చట్టం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇంత బరితెగించి ప్రవర్తిస్తున్నాడని తీవ్రమైన మనోవ్యధకు గురైంది. తోటి మహిళా ఉద్యోగులు ఇది గమనించి, జానకిపై ఎంతో ఒత్తిడి తెస్తే అసలు విషయం తెలిపింది. వారు అవాక్కయ్యారు. వారిలో ఇంకొకరి పరిస్థితి కూడా జానకిలాగే ఉంది. ఆమెను కూడా కొత్త మేనేజర్ ఇలాగే వేధిస్తున్నాడట. లొంగిపోతే ప్రమోషన్‌కు సిఫారసు చేస్తానని, లేకుంటే మారుమూల ప్రాంతానికి బదిలీ ఉత్వర్వులు ఇప్పిస్తాననీ బెదిరింపులకూ దిగాడట. ఇక లాభం లేదనుకుని జానకి, ఆమె కలిసి ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు దానిని ‘ఫిర్యాదుల కమిటీ’ కి పంపించారు. వారు దీనిని క్షుణ్ణంగా విచారించి, తోటి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా అడిగి, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ‘లైంగిక వేధింపులు’ జరిగాయని నిర్థారణకు వచ్చారు. వారిని వేధింపులకు గురి చేసిన ఉన్నతాధికారిని పిలిచి విచారించి, ‘ప్రవర్తన మార్చుకుంటారా లేక క్రిమినల్ కేసు పెట్టమంటారా?’ అని అడిగారు. దెబ్బకు దిగి వచ్చిన మేనేజర్ తనకు పెళ్లి కావలసిన పిల్లలున్నారనీ, కేసు పెట్టవద్దనీ జానకి వాళ్లకి రాతపూర్వకంగా క్షమాపణ రాసి ఇచ్చి, తనే మారుమూల ప్రదేశానికి బదిలీ చేయించుకుని వెళ్లాడు. ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ష్యామిలీ కౌన్సెలర్ -
గానకోకిలకు...జీవిత సాఫల్య పురస్కారం!
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి గీతాలు ఆలపించి, శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గాయని ఎస్. జానకి. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో ఆమె అందుకోని అవార్డులు లేవు. తాజాగా, జానకిని మరో పురస్కారం వరించింది. ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో భాగంగా 2014వ సంవత్సరానికి గాను ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు జ్యూరీ చైర్మన్, నిర్మాత డి. సురేశ్‌బాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లో జరిగే భారీ వేడుకలో ఈ అవార్డులు అందజేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోనూ ప్రతి భాషలో 14 విభాగాల్లో ఉత్తమ సినీ సంగీత కళాకారులకు అవార్డులిస్తారు. ‘‘దక్షిణాదిలో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఆరో ఏట అడుగుపెట్టింది. తెలుగు వరకు 2014లో విడుదలైన 197 సినిమాల్లో పాటలున్న 176 చిత్రాల్లోని 947 గీతాలను పరిశీలించాం’’ అని నట, రచయిత తనికెళ్ల భరణి చెప్పారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులైన దర్శకుడు చంద్రసిద్ధార్థ్, సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్, కల్యాణీమాలిక్, రచయిత అబ్బూరి రవి, గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, గాయని సునీత, ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
స్టార్‌స్టార్ సూపర్‌స్టార్ - జానకి
-
మార్చి 10లోగా నిర్ణయించండి!
ముత్తుకూరు(నేలటూరు): నేలటూరు పంచాయతీని ఏ ప్రాంతానికి తరలించాలన్న అంశాన్ని మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకుని చెప్పాలని కలెక్టర్ జానకి కోరారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల మధ్య జీవనం సాగించలేమంటూ కొద్ది మాసాలుగా ఈ పంచాయతీ వాసులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ జానకి, జేపీ ఇంతియాజ్, నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డిలు నాలుగు చోట్ల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారు. నేలటూరు పట్టపుపాళెం.. పట్టపుపాళెంలో 386 కుటుంబాలున్నాయని, కొత్తగా పెళ్లైనవారితో కలిపి 460 కుటుంబాలున్నాయని జిల్లా కలెక్టర్ ఇక్కడ జరిగిన సభలో చెప్పారు. తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు గోవిందుపట్టపుపాళెంకు ఎంతమంది తరలివె ళతారు, నెల్లూరు సమీపంలోని ధనలక్ష్మీపురానికి ఎందరు వెళతారనేది మార్చి 10వ తేదీలోగా నిర్ణయించుకొని చెప్పాలన్నారు. దీనిని బట్టి భూములు సేకరించాల్సి ఉంటుందన్నారు. నేలటూరు దళితవాడ.. నేలటూరు దళితవాడ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడ 199 కుటుంబాలున్నాయన్నారు. పునరావాసానికి 17 ఎకరాలు అవసరమన్నారు. ధనలక్ష్మీపురం, వావిలేటిపాడు, మాదరాజుగూడూరు ప్రాంతాల్లో ఎక్కడకు తరలివెళతారో నిర్ణయించాలని కోరారు. నేలటూరు గ్రామం.. నేలటూరు గ్రామంలో 263 కుటుంబాలున్నాయని ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి చె ప్పారు. పునరావాసానికి 29.63 ఎకరాలు అవసరమన్నారు. మాదరాజుగూడూరుకు వెళతారా.., మరేదైనా ప్రాంతానికి వెళతారా నిర్ణయించి చెబితే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 650 ఎకరాలకు పరిహారం.. నేలటూరు గ్రామాన్ని తరలించడంతో పాటు పంచాయతీలోని రైతులకు సంబంధించి 650 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సివుందని కలెక్టర్ ఈ సందర్భంగా చెప్పారు. జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, సర్పంచ్ ఈపూరు శేషారెడ్డి, స్థానికులు యానాటి శ్రీనివాసులురెడ్డి, ఈపూరు గిరిధర్‌రెడ్డి, పెడకాల శీనయ్య ఈ సమావేశాల్లో మాట్లాడుతూ మూడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రతి కుటుంబంలోనూ ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. భూములకు పరిహా రం పంపిణీ జరగాలన్నారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలపై విచారణ జరిపిస్తామన్నారు. జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని, స్థానికులకు 50 శాతం ప్రాధాన్యమిస్తారని హామీ ఇచ్చా రు. పట్టపుపాళెంలో తాగునీరు, మరుగుదొడ్లు, ప్యాకేజీ సమస్యల పరిష్కరించేందకు కృషి చేస్తామన్నారు. -
లైఫ్‌నిచ్చింది సిటీనే
‘1940లో ఒక గ్రామం’ సినిమా అరంగేట్రంతోనే టాలీవుడ్ అభిమానులను మెప్పించి నంది అవార్డును దక్కించుకుంది. ‘విరోధి’తో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటింది. అలియాస్ జానకిగా అందరి నోళ్లలో నానిన శ్రీ (అలియాస్ శ్రీరమ్య) ఇటీవల సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో శారీలో తళుక్కుమంది. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో నాటి, నేటి జ్ఞాపకాలను, తన కెరీర్ విశేషాలను ‘సిటీ ప్లస్’తో ఇలా చెప్పుకొచ్చింది... మాది విజయవాడ. నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నానల్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో టెన్త్ వరకు చదివా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం. చదువు అంతగా అబ్బేది కాదు. మూడేళ్ల నుంచే క్లాసికల్ డ్యాన్స్‌పై మోజు. వెంటనే బెంగళూరు పద్మ వద్ద శిక్షణ తీసుకున్నా. ఐదేళ్లకే నాట్యమందిర్ అవార్డు వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్‌ను చూసి మంజూలా నాయుడు పిలిచారు. రుతురాగాలు సీరియల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశమిచ్చారు. ఆ తర్వాత కస్తూరి, చక్రవాకం, చక్రతీర్థం, శాంతినివాసం తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందా. ఈ క్రమంలోనే ‘1940లో ఒక గ్రామం’ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. తర్వాత శ్రీకాంత్‌తో ‘విరోధి’లో చేశా. ‘అలియాస్ జానకి’ మూవీ కూడా చేశా. తమిళంలో ‘యమున’లో నటించా. మంచి కథ కోసం వేచి చూస్తున్నా. తారామతి చాలా ఇష్టం... గోల్కొండ, తారామతి బారాదరి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడికి ఎన్నోసార్లు వెళ్లా. టైమ్ దొరికితే జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ చాట్భండార్లో వాలిపోవల్సిందే. బేగంపేటలోని నీడ్స్ దాబాలో డిఫరెంట్ స్పైసీ వంటకాల్ని టేస్ట్ చేస్తా. ఓరిస్కు రెగ్యులర్‌గా వెళ్తుంటా. హోలీ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రంగుల్లో మునిగి తేలడమే. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. నానల్‌నగర్‌లో బాలాజీ స్వీట్‌షాప్‌లో అజ్మీరీ కలాకంద్, రోడ్ల మీద గప్‌చుప్ లాగిస్తుంటే భలే మజా. బాలీవుడ్ సినిమాల్లో చాన్స్‌ల కోసం ముంబైకి షిఫ్టయ్యా. సిటీలోనే ఫ్యామిలీ ఉండటంతో పండుగలు, బర్త్‌డేలకు వచ్చిపోతున్నా. ఏదిఏమైనా నాకు లైఫ్‌నిచ్చింది సిటీనే! నా చిన్నప్పటి నగరాన్ని మళ్లీ చూడాలనిపిస్తోంది. - వాంకె శ్రీనివాస్ -
నో అనకుండా తినేయండి!
ఫుడ్ n బ్యూటీ ‘కోడిపులుసు-గారెలు’ కాంబినేషన్‌ను ఆరగించాలంటే చాలా మందికి భయం. లావవుతామని, చికెన్ రూపంలో శరీరంలోకి కొవ్వు నిల్వలు చేరిపోతాయేమోనని వీటి కి దూరంగా ఉంటారు. అలాంటి భయాలేమీ పెట్టుకోనక్కర్లేదు. తెలుగువారి సంప్రదాయబద్ధమైన ఈ ఆహారాన్ని కొన్ని టిప్స్ పాటించి వండుకుంటే చాలు, నో అనకుండా తినేయొచ్చు! - డా॥జానకి,న్యూట్రిషనిస్ట్ కోడిపులుసు తయారీకి... కావాల్సినవి: చికెన్ స్కిన్లెస్-250 గ్రాములు ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4 యాలకులు- 3; లవంగాలు- 4 ధనియాల పొడి- రెండు టీ చెంచాలు కారం- ఒకటి లేదా రెండు చెంచాలు పసుపు- 1/2 చెంచా నూనె - 3 చెంచాలు చింతపండు రసం- పావు కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు చెంచాలు దాల్చిన చెక్క; ఉప్పు- తగినంత విధానం: పాత్రలో ముందుగా నూనెను వేడి చేయాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఫ్రై చేశాక, అల్లం వెల్లుల్లి పేస్టు జోడించాలి. ఫ్రై అయ్యాక తరిగిన పచ్చిమిర్చి వేయాలి. తర్వాత పసుపు, ధనియాలపొడి, కారంపొడి వేయాలి. ఇప్పుడు చికెన్ వేసి అంతటినీ కలపాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చివర్లో చింతపండు రసం పోసి 5 నిమిషాల్లో దించాలి. గారెల తయారీకి... కావాల్సినవి: మినప్పప్పు- పావు కిలో ఉల్లిపాయలు- 2; పచ్చిమిర్చి- 4 జీరా- 2 చెంచాలు; అల్లం- 1 చెంచా కరివేపాకు - ఒక రెమ్మ; నూనె, ఉప్పు. విధానం: మినప్పప్పును రెండు గంటల పాటు నానబెట్టి, రుబ్బు కోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, అల్లం, ఉప్పు... పప్పుతో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గారెలుగా చేసుకుని, నూనెలో వేయించాలి. చలికాలంలో మంచివి చికెన్ పులుసు, గారెలు శీతాకాలంలో తగిన శక్తినీ, శరీరానికి వేడినీ ఇస్తాయి. మాంసంలోని ప్రొటీన్లు విలువైనవి. మినప్పప్పులో ఫైబర్(పీచు) ఎక్కువుంటుంది కాబట్టి, చికెన్‌తో కలిపి తినడం జీర్ణానికి మంచిది. టిప్: మినప్పప్పు గ్రైండింగ్‌లో తక్కువ నీటిని ఉపయోగిస్తే, వేయించేప్పుడు, ఒక వాయి గారెలు ఐదు గ్రాముల కన్నా తక్కువ నూనెను పీల్చుకుంటాయి! పోషక విలువలు: 100 గ్రాముల చికెన్‌లో 26 గ్రా. ప్రోటీన్స్, 6 గ్రా. ఫ్యాట్, 190 కిలో క్యాలరీల శక్తి; గారెల్లో వంద గ్రాములకు 24 గ్రా. ప్రోటీన్స్, 5 గ్రా. ఫ్యాట్, 350 కిలో క్యాలరీల శక్తి ఉంటాయి. రిపోర్టింగ్: బీదాల జీవన్‌రెడ్డి ఫొటో: జి.రాజేష్ -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. జానకి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మీ-సేవ కేంద్రాల ద్వారా ఈ నెల 5 నుంచి ఇసుక విక్రయాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేబిల్లులు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాల్లో రీచ్‌లలో ఇసుక రవాణా చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. రీచ్‌ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నిత్యం ఇసుక రీచ్‌లను పరిశీలించేలా సంబంధిత తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతక ముందు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మణం, పుట్టంరాజువారికండ్రిగ అభివృద్ధి తదితర కార్యక్రమాలపై వివిధ మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ జి.రేఖారాణి, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ ఎం.గౌతమి, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పీఆర్‌కండ్రిగను ఆదర్శంగా తీర్చిదిద్దండి క్రికెట్ దేవుడు, రాజ్యసభ సభ్యుడు సచిన్టెండూల్కర్ దత్తత తీసుకున్న పుట్టంరాజు వారి కండ్రిగను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జానకి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్ డేకు 9.30కే హాజరు కావాలి కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌డేకు అధికారులందరూ ఉదయం 9.30 గంటలకే హాజరుకావాలని కలెక్టర్ ఎం.జానకి సూచించారు. సోమవారం గ్రీవెన్స్ డే హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు వస్తే గత వారం గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఎన్ని పరిష్కరించారో అవి ఏ స్థితిలో ఉన్నాయే తదితర వివరాలు ప్రతి వారం అందజేయాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయల చుట్టూ ప్రజలను తిప్పించుకోకుండా వారి సమస్య పరిష్కారం అవుతుందా కాదా.. తదితర వివరాలు వారికి తెలియజేయలన్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తాత్సారం
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆధ్యాత్మిక నగరంగా పేరు పొందిన తిరుపతిలో పర్యావరణానికి హానికలిగించే ప్లాస్టిక్ వాడకం యథేచ్ఛగా సాగుతోంది. రోడ్లపక్కనే ఎక్కడ పడితే అక్కడ వాడిపడేసిన ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్‌తో ఇవీ ప్రమాదాలు.. ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు తీసుకోవడం వలన అందులో ‘టాక్సిన్’ అనే విషపదార్థం కలుస్తుంది. దీంతో స్త్రీలలో రొమ్ము కేన్సర్, పిల్లల్లో బుద్ధిమాంద్యం, జ్ఞాపక శక్తి తగ్గడం, యువకులలో ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ప్లాస్టిక్ కవర్లను వాడి పడేస్తే 100 సంవత్సరాలైనా భూమిలో కరిగిపోవు. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి రీసైక్లింగ్‌కు అనువుగా ఉండకపోవడంతో పర్యావరణానికి ప్ర మాదకరంగా మారుతున్నాయి. తిరుపతికి యాత్రికులు, శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరిలో చాలామంది టిఫిన్‌కోసం హోటళ్లు, టిఫిన్ బండ్లు, పానీపూరి బండ్లను ఆశ్రయిస్తుంటారు. వీరికి ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్లలో ఆహార పదార్థాలను విక్రయిస్తుం డటంతో వాటిని తిని రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశించినా.. పర్యావరణానికి ముప్పుగా మారిన 40 మైక్రాన్ల మందం కంటే తక్కువగా ఉ న్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అప్పటి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జానకి ఆపై కమిషనర్‌గా బాధ్యత లు స్వీకరించిన ప్రసాద్ క్షేత్రస్థాయిలో కదలిక తీసుకొచ్చి నగరంలో ఏకధాటిగా ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలపై దాడు లు చేసి, జరిమానాలు విధించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి పెరగడం తో ఆయన మిన్నకుండిపోయారు. అనంతరం కమిషనర్‌గా వచ్చిన మురళీ ప్లాస్టిక్ నిషేధం ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం కమిషనర్‌గా పనిచేస్తున్న సకలారెడ్డి బాధ్యతలు తీసుకున్న మొదట్లో ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపుతామని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పది రోజుల క్రితం మార్కెట్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిం చడం మినహా, నిషేధానికి ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విక్రయాలపై చర్యలు శూన్యం కార్పొరేషన్ పరిధిలో సుమారు రెండు వేలకు పైగా దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటిలో ప్లాస్టిక్ కవర్ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. 50కి పైగా హోల్‌సేల్ దుకాణాలలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చెన్నై, బెంగళూరు నుంచి 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులు భారీగా తెప్పించుకుంటు న్నారు. వీటిని నగరంలోని ఇసుకవీధి, నెహ్రూవీధి, కొర్లగుంట, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీరికి అధికార పార్టీ నాయకుల అండ ఉండటంతో కార్పొరేషన్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది. ఒక వేళ దాడులు చేసి నిషేధిత ప్లాస్టిక్ కవర్లను టన్నుల కొద్దీ పట్టుకున్నా కేవలం నామమాత్రపు జరిమానా వేసి వదిలేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోవడం లేదు ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జూట్‌బ్యాగులను, గుడ్డ సంచులను వా డేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుడ్డ సంచులను తయారు చేసేందుకు స్వయంశక్తి మహిళా సంఘాలు ముందుకొస్తున్నా వారిని ప్రోత్సహించడం లేదని తెలిసింది. ఇకనైనా తిరుపతిలో పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
కాలుజారి కిందపడ్డ టీటీడీ ఈవో గోపాలన్ సతీమణి
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సేవ సందర్భంగా టీటీడీ ఈవో గోపాల్ సతీమణి జానకి గాయపడ్డారు. మంగళవారం తిరుమంజనం సేవలో ఈవో గోపాల్ దంపతులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు రథంపై తిరువీధుల్లో ఊరేగనున్నారు.