సాక్షి, అమరావతి : బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారిత కోసం జానకి విశేష కృషి అందించారని, ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు.
కాగా, దాదీ జానకి 1916 జనవరి 1వ తేదీన పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో జన్మించారు. 21 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. నిరంతరం కృషితో బ్రహ్మకుమారీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఉదర, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆమె రాజస్తాన్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. రాజయోగిని జానకి ఎంతో శ్రద్ధతో సమాజానికి సేవ చేశారని, మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని మోదీ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment