సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా ఇన్‌స్పెక్టర్(సీఐ) లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ జానకి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పీర్జాదిగూడలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటేషన్ సెక్షన్‌లో జానకి ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుంచి సీఐ జానకి లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ జానకీ. దీంతో, సదరు బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు చెప్పాడు. ఈ క్రమంలో 20వేలు ఇస్తుండగా జానకిని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఆఫీసులో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు
Comments
Please login to add a commentAdd a comment