
హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన బోను జానకి కేసులో నిందితుడిని గురువారం కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలసకు చెందిన బోను జానకి కేబీహెచ్‌బీలోని డీమార్టులో సేల్స్ గర్ల్. అదే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు వికారాబాద్ జిల్లా నేర్లపల్లి అనంతప్ప అలియాస్ ఆనంద్‌తో 8 నెలల క్రితం పరిచయం ఏర్పడటంతో తనను ప్రేమించాలంటూ జానకిని వేధించడం మొదలు పెట్టాడు.
దీంతో ఆమె డీమార్టు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. వారు అతన్ని మందలించారు. జానకిని మరో బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా అతడి వేధింపులు ఆగలేదు. తన బావతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ తనకు దూరమవుతోందని భావించిన అనంతప్ప జానకిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఈ నెల 9న జానకి రూమ్‌కు వెళ్లి తనను పెళ్లి చేసు కోవాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అనంతప్ప కత్తితో జానకిని మూడు చోట్ల పొడిచి, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment