
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఇండియన్ ఐడల్ రన్నరప్ కారుణ్య మాతృమూర్తి కన్నుమూశారు. మీర్‌పేట కార్పోరేషన్ బాలాపూర్ చౌరస్తా సమీపంలోని త్రివేణినగర్‌లో కారుణ్య తల్లి జానకి (70), తండ్రి మధు నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ బీడీఎల్ విశ్రాంత ఉద్యోగులు. జానకి గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సైదాబాద్ శ్మశాన వాటికలో జానకి అంత్యక్రియలు నిర్వహించారు. జానకి మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment