![Son Of Asaram Convicted In Rape Case Of Two Sisters - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/26/sai.jpg.webp?itok=cyXx-zIR)
అహ్మదాబాద్ : లైంగిక దాడి కేసులో ఆశారాం బాపూ కుమారుడు నారాయణ్ సాయిని సూరత్ సెషన్స్ కోర్టు శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సూరత్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై నారాయణ్ సాయి లైంగిక దాడికి పాల్పడినట్టు సెషన్స్ కోర్టు ధ్రువీకరించింది. ఇదే కేసులో గంగా,జమున, హనుమాన్‌లను కూడా కోర్టు దోషులుగా పేర్కొనగా, మోనికా అనే మహిళను నిర్ధోషిగా నిర్ధారించింది.
2013లో నమోదైన ఈ కేసులో ఆరేళ్ల తర్వాత నారాయణ్ సాయిపై అభియోగాలు రుజువయ్యాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దోషులకు ఈనెల 30న శిక్ష ఖరారు చేస్తారు. కాగా, ఆశారాం బాపూ సైతం మహిళలపై లైంగిక దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment