మోదీ, ఆశారాం మధుర ఙ్ఞాపకం.. పోస్టు వైరల్‌! | ICC Tweets Video Of PM Modi and Asaram Gets Trolled On Twitter | Sakshi
Sakshi News home page

మోదీ, ఆశారాంలపై ఐసీసీ ట్వీట్‌..!

Published Wed, Apr 25 2018 6:59 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ICC Tweets Video Of PM Modi and Asaram Gets Trolled On Twitter - Sakshi

ఐసీసీ అధికారిక ట్విటర్‌లో ఉన్న పోస్ట్‌

16 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును దోషిగా తేలుస్తూ జోధ్‌పూర్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఆశారాం బాపు, ప్రధాని నరేంద్ర మోదీలు కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమం వీడియోను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) అధికారిక ట్విటర్‌లో దర్శనమిచ్చింది. ‘నారాయణ్‌.. నారాయణ్‌ ’ అనే కామెంట్‌తో ఈ వీడియోను పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా.. ‘నరేంద్ర మోదీ, ఆశారాం బాపులకు సంబంధించిన కొన్ని మధుర ఙ్ఞాపకాలు’ అని ట్వీట్‌ చేస్తూ.. వారు కలిసి ఉన్న ఓ పాత వీడియోను పోస్ట్‌ చేశాడు. అయితే ఈ పోస్ట్‌ను ఐసీసీకి చెందిన వ్యక్తి ఒకరు ‘నారాయణ్‌.. నారాయణ్‌’  అంటూ కామెంట్‌ చేస్తూ రీట్వీట్‌ చేశారు. వెంటనే తేరుకున్న ఐసీసీ టీమ్‌ పోస్ట్‌ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ను తొలగించింది. కానీ అప్పటికే నెటిజన్లు ఈ పోస్ట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసి కామెం‍ట్లు పెడుతుండటంతో, ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

అయితే ఈ ట్వీట్‌పై విమర్శలు రావడంతో ఐసీసీ క్షమాపణలు తెలిపింది. తమ అధికారిక ట్విటర్‌లో ఈ పోస్ట్‌ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని, దీనిపై విచారణ మొదలుపెట్టామని వివరణ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement