సాక్షి, న్యూఢిల్లీ : యోగా, ఆథ్యాత్మిక గురువుగా చెప్పుకునే స్వామి ఆనంద్ గిరిని ఇద్దరు మహిళా శిష్యులను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు సిడ్నీలో అరెస్ట్ చేశారు. రూటీ హిల్‌లో 2016లో ఓ ప్రార్ధనా సమావేశానికి హాజరైన ఆనంద్ గిరి ఓ మహిళను వేధించారని, 2018 నవంబర్‌లో మరో ఘటనలో 34 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆస్ర్టేలియాలో ఆరు వారాల పర్యటనలో ఉన్న స్వామి ఆనంద్ గిరిని మే 5న సిడ్నీలో అరెస్ట్ చేశారు. ఆనంద్ బెయిల్ అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు కస్టడీకి తరలించింది. జూన్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని బడే హనుమాన్ ఆలయంలో నిందితుడు మహంత్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆనంద్ ఫేస్‌బుక్ పేజ్‌లో ఆయన పలువురు ప్రముఖ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో కలిసి ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లతో కలిసి ఉన్న ఫోటోలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment