ఆధునిక సమాజంలో చాలామంది తమ భావాలను నేరుగా వ్యక్తీకరించడం మరచి... టైప్ చేయడం, బొమ్మలతో వ్యక్తం చేయడం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహాత్రియ రా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్’పేరుతో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.