expressions
-
ఎంత సక్కగున్నావే.. రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాతో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మన జీవన విధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. అందులో భాగంగానే శానిటైజర్ల వాడకం, మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం పాటించడం లాంటివి దినచర్యల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ప్రత్యేకంగా మాస్క్ అనేది తప్పనిసరిగా మారిందనే చెప్పాలి. ఏది మరచిపోయిన పర్లేదు కాని మాస్క్ మాత్రం మరిచిపోవద్దు. ఇక తారల విషయానికొస్తే వారి ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల నటి రష్మిక ఓ ప్రదేశానికి వెళ్లారు. కారు దిగి అలా నడుచుకుంటూ వెళ్లిన ఈ ముద్దు గుమ్మ కొన్ని సెకన్ల తర్వాత మాస్క్ పెట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే వెనక్కి వెళ్లి మాస్క్ పెట్టేసుకుంది. ప్రధానంగా మాస్క్ లేదని రష్మిక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కన్నడ, హిందీ భాషలలోను సినిమాలు చేస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్క్రాప్‌బుక్‌లో ఎన్నెన్నో భావాలు
‘మిస్ యూ!’ మిస్సైన ఫీల్ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్ యూ!’ దేవుడా రొటీన్. చంపేయ్ పోనీ. ‘కంగ్రాట్స్!’ ఏ బడి సార్ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్‌లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్‌ని టచ్ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్ మిస్ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్‌ని ఆమె చక్కటి స్క్రాప్‌బుక్‌లో పెట్టి ఇస్తారు. ఆ బుక్‌ని ప్రెజెంట్ చెయ్యండి చాలు. ఎన్నెన్నో భావాలు..ఏవేవో రాగాలు..! ఆత్మీయులకు మరిచిపోలేని కానుక ఇవ్వాలంటే మనం యామిని చేతుల్లో రూపుదిద్దుకునే అరుదైన కళను ఎంచుకోవాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందమైన కథగా కళ్లకు కట్టే ఆ కానుక మన కళ్ల ముందు ఎప్పటికీ నిలిచి ఉండే ఓ సజీవ దీపిక. సూక్ష్మ చిత్రాల రూపకల్పనతో అందమైన కానుకలు తయారు చేస్తూ తన కళతో అబ్బురపరుస్తుంది యామిని పేర్నపాటి. హైదరాబాద్‌కు చెందిన యామిని ఫ్యాషన్ డిజైనింగ్‌ని వృత్తిగా మార్చుకోవాలని ఆశపడింది. కానీ, తల్లిదండ్రుల ఇష్టం మేరకు బిటెక్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవన సన్నివేశ చిత్రాలను జీవం ఒలికించేలా రూపొందిస్తూ కస్టమైజ్డ్ గిఫ్ట్ మేకింగ్‌లో అడుగుపెట్టి ఉపాధి పొందుతోంది. ఆ వివరాలను ఇలా కథలా కళ్లకు కట్టింది... ఆన్లైన్ నైపుణ్యాలు.. ‘‘ఐదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో నేషనల్ ఎంటర్ప్రెన్యూర్ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాను. అప్పుడే సొంతంగా ఉపాధి పొందడం పట్ల ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేదాన్ని. డ్రెస్ డిజైనింగ్‌లోనే కాదు క్విల్లింగ్ జ్యువెలరీ తయారీలోనూ ప్రశంసలు పొందాను. ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేయాలనుకున్నాను. కానీ, ‘కళ ఒక అభిరుచి. అది తిండి పెట్టదు’ అన్నారు పెద్దలు. అందుకే, ఇంజనీరింగ్ వైపు వెళ్లాను. కానీ, నా అభిరుచిని వదులుకోలేదు. ఆన్లైన్ సాయంతోనే పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్రియేటివ్ స్టూడియోస్’ పేరుతో పేజీని నిర్వహించాను. అయితే, తమ్ముడు చదువుకు ఫీజు చెల్లించడం కోసం నాన్న కష్టపడుతుండటం చూసి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో చేరిపోయాను. కానీ, కళ లేని జీవితం అసంపూర్ణమనే భావన రోజూ బాధపెడుతుండేది. ప్రేయసికి బహుమతి నా సహోద్యోగి ఒకరు తన ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి మంచి గిఫ్ట్ సూచించమని అడిగాడు. కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్స్‌కి డిజైన్ చేసి ఇచ్చిన స్క్రాప్ బుక్స్ గుర్తుకువచ్చాయి. నేనే స్వయంగా ఒకటి రూపొందించి ఇస్తే.. అని ఆలోచన వచ్చింది. ‘మీ బంధం ప్రత్యేకత చెప్పమ’ని అడిగాను. అతను చెప్పిన ప్రేమకథను ఆధారం చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్‌ను తయారుచేసి ఇచ్చాను. ఆ కళాకృతికి అబ్బురపడి నాకు కొంతమొత్తాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అతని స్నేహితురాలికి బాగా నచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఎక్కడ సంతృప్తి ఉందో.. అదే పని చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అర్ధమైంది. అన్నాళ్లూ వదిలేసిన నా కళకు కొత్తగా జీవం పోయాలనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో we_craft16 పేరుతో కొత్త పేజీని రూపొందించాను. ఏడాదిన్నరగా ఈ పేజీని విజయవంతంగా నిర్వహిస్తున్నాను. మొదట రెండు మూడు ఆర్డర్లే! ఇప్పుడు నాకు నెలలో 30 నుంచి 40వరకు ఆర్డర్లు అందుతున్నాయి. కానీ, మొదటి రెండు నెలలు మూడు, నాలుగు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. చాలా నిరాశగా అనిపించేది. ఉద్యోగం చేస్తూనే స్క్రాప్ బుక్ డిజైన్స్ చేసేదాన్ని. ఓ వైపు ఆఫీసు పని భారం, మరొవైపు స్క్రాప్ బుక్ డిజైన్లు. కొన్ని రాత్రులు అస్సలు నిద్రపోయేదాన్నే కాదు. ముందు ఆర్డర్లు విరివిగా రావడం కోసం కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. గిఫ్ట్ బాక్స్ తెరిచి చూసినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం అందులోని సూక్ష్మచిత్రాలతో ఇట్టే అర్ధమైపోవాలి. అందుకోసం చాలా శోధించాను. చాలా కృషి చేశాను. దీంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రత్యేకమైన శైలి కస్టమర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాను. వారి మధ్య ఉన్న అందమైన సన్నివేశాన్ని తెలుసుకుంటాను. దానికి తగ్గట్టు క్రాఫ్టింగ్ చేస్తాను. ‘ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడుగుతుంటారు. ఇది నాకు నేనుగా సృష్టించుకున్న కళ. అలాగని, నా వరకే పరిమితం అవ్వాలనుకోను. మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ నా ఆలోచనల శైలిని అప్‌గ్రేడ్ చేస్తుంటాను కాబట్టి, ఎవరూ దీనిని కాపీ చేయలేరు అని గట్టిగా చెప్పగలను. ఐటి కంపెనీ నాకు చెల్లించే దానికంటే ఎక్కువ సంపాదించగలను అనే నమ్మకం పెరిగింది. నా అభిరుచితోపాటు నా వృత్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నాను’’ అని యామిని ఆనందంగా వివరించింది. ఉద్యోగం చేసుకుంటూనే నచ్చిన అభిరుచిలో ఉపాధి పొందుతున్న యామిని ఇప్పుడు కళాత్మకంగా రాణిస్తోంది. – నిర్మలారెడ్డి -
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
-
భావాలను నేరుగా వ్యక్తీకరించాలి
హైదరాబాద్ : ఆధునిక సమాజంలో చాలామంది తమ భావాలను నేరుగా వ్యక్తీకరించడం మరచి... టైప్ చేయడం, బొమ్మలతో వ్యక్తం చేయడం చేస్తున్నారని, ఇది సరికాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మహాత్రియ రా పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో), హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్స్’పేరుతో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ సభ్యులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్రియా రా మాట్లాడుతూ... భావ వ్యక్తీకరణ నేరుగా హావభావాలతో ఆచరణలో చూపించాలన్నారు. అప్పుడే అనుబంధాలు నాలుగు కాలాల పాటు ఉంటాయని తెలిపారు. కుటుంబం కోసం సమయం వెచ్చించాలని, కుటుంబసభ్యుల మధ్య నిందలు కాకుండా పొగడ్తలు మాత్రమే ఉండాలని చెప్పారు. దైవం మన ఇంట్లోనే ఉన్నారని, ఇంట్లో వారిని సంతోషానికి గురి చేయాలని చెప్పారు. వృత్తిలో కస్టమర్ మెప్పు కోసం ఏమైనా చేస్తామని.. అదే ఇంట్లోవారి కోసం కూడా చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలోని బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. కుటుంబ వ్యవస్థ పటిష్టతకు సంబంధ బాంధవ్యాలే పునాది అన్నారు. పిల్లలను స్పర్శ ద్వారా ప్రేమపూర్వకంగా దగ్గరికి తీసుకోవాలని తెలిపారు. ఇవి పాటిస్తే రాబోయే రోజుల్లో పుస్తకాలు చదివి సంబంధ బాంధవ్యాలు పెంచుకొనే దౌర్భాగ్య పరిస్థితి పట్టకుండా ఉంటుందన్నారు. ఎంతటి టెక్నాలజీ అభివృద్ధి చెందిన చేతిరాత మరవొద్దని, అది బ్రెయిన్ రైటింగ్ అని తెలిపారు. రాతను బట్టి అతని మనస్తత్వం చెప్పవచ్చని తెలిపారు. ఎఫ్ఐసీసీఐ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ ప్రియాంక గనెరివాల్ అరోరా మాట్లాడుతూ... ఆరు లక్షల రూపాయలు వెచ్చించి 1,000 మంది విద్యార్థినులకు హ్యాపీ ఉమెన్స్ కిట్స్‌ను త్వరలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో(ర) మనిషి ...ఛార్లెస్ !
సాక్షి, హైదరాబాద్ : అందరి మాదిరిగానే ఛార్లెస్ చిరుమందహాసంతో పాటు ముఖం చిట్లించడం, ఆశ్చర్యపోవడం వంటి ఇతర వ్యక్తీకరణలు చేయగలడు. ఛార్లెస్ ఓ మరమనిషి (రోబో). కొత్త పరిశోధనలకు మరో ముందడుగులో భాగంగా మెదళ్లను చదవడంతో పాటు హావభావాలను వ్యక్తపరిచే ‘ఛార్లెస్’ సిద్దమయ్యాడు. వివిధ సందర్భాల్లో మనుషులు చేసే వ్యక్తీకరణలను చూసి వాటిని అనుకరించగలడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఓ పరిశోధనలో భాగంగా దీనిని రూపొందించింది. విభిన్నమైన ఈ రోబోను మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు అక్కడి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదుపరి పరిశోధనలు నిర్వహిస్తోంది. మనుషుల లాగానే భావోద్వేగాలు వ్యక్తపరిచే రోబోలకు ఇది మరింత శక్తియుక్తులను అందిస్తుందని భావిస్తున్నారు. ముఖంలో భావాలు వ్యక్తిపరిచే రోబో... కెమెరాతో అనుసంథానించిన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వ్యవస్థ, ఇతర పరికరాల ద్వారా మనుషుల ముఖాలను రికార్డ్ చేస్తారు. ఈ ఫుటేజిని కంప్యూటర్ విశ్లేషిస్తుంది. ముఖంలోని కండరాలు, కనుబొమలు, దవడ, నోరు, ఇతర అవయవాలను తీరును కొలిచి ఆ వివరాలను ఛార్లెస్‌కు పంపిస్తుంది. ఈ ప్రక్రియ 2,3 సెకండ్లలోనే ముగుస్తుంది. వాటిని ఆ రోబో స్వీకరించాక తాను సొంతంగా హావభావాలను వ్యక్తపరుస్తుంది.‘సామాజిక సంబంధాల్లో భాగంగా మనుషులు వ్యక్తపరిచే సంకేతాలను తెలుసుకునే సామర్థ్యాన్ని కంప్యూటర్లకు కల్పించాలనేది మా ఆలోచన. ఇందులో మనుషుల ముఖకవళికలు, కంఠస్వరం, శరీర భంగిమ, సంజ్ఞలను ఇవి అర్థం చేసుకునేలా రూపొందిస్తున్నాం’ అని ఛార్లెస్ సష్టికర్త ప్రొ. పీటర్ రాబిన్సన్ పేర్కొన్నారు.మెరుగైన పద్ధతుల్లో అమర్చిన కత్రిమ అవయవాల కారణంగా ఛార్లెస్ మనిషిని పోలినట్టుగానే కనిపిస్తున్నా వ్యక్తపరిచే హావభావాలు మాత్రం ఇంకా అసహజంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో కత్రిమ మేథతో కూడిన హ్యుమనాయిడ్ ‘సోఫియా’ను (ప్రపంచంలోనే పౌరసత్వం లభించిన తొలి రోబో)రూపొందించిన రోబోటిస్ట్ డేవిడ్ హాన్సన్ సహకారంతో ‘చార్లెస్’ను రాబిన్సన్ రూపొందించారు. భావోద్వేగ మరమనుషులు.. మనుషుల ముఖకవళికల్లో వచ్చే మార్పులు చేర్పులు, భావనలను గ్రహించి ..అందుకు తగినట్టుగా (ప్రతిస్పందనగా) తమవైన సలహాలు, సూచనలు ఇచ్చే రోబోలను తయారు చేసేందుకు అనేక చోట్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల లాస్‌వేగాస్‌లోని నెవాడాలో జరిగిన ‘వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన’ (సీఈఎస్)లో భావోద్వేగ రోబోతో సహా వివిధ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. రోబోలు కూడా భావాలను వ్యక్తికరించే విధంగా ‘భావోద్వేగ చిప్’ తయారుచేస్తున్నట్టు న్యూయార్క్‌కు చెందిన ఎమోషేప్ సంస్థ వ్యవస్థాపకుడు పాట్రిక్ లెవి–రోసెంతల్ వెల్లడించారు. జపాన్‌లో ఓదార్పు రోబోలు.. జపాన్‌లో వద్ధుల సంరక్షణ చర్యలు కొరవడుతున్న పరిస్థితుల్లో అందుకు రోబోల సేవలను ఉపయోగించే దిశగా ప్రయోగాలు చేస్తున్నాం. ఒకవేళ మీరు కళ్లనీళ్లు పెట్టుకుంటే మిమ్మల్ని ఈ రోబో ఓదారుస్తుంది. మీకు స్నేహితులెవరూ లేకపోతే ఇది మిత్రుడిగా వ్యవహరిస్తుంది. అంతర్ముఖులుగా ఉన్న వారు రోబోలతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు’ అని తమ రోబోల ప్రత్యేకతలను మూర్ ఇన్సైట్స్ అండ్ స్ట్రాటజీ సంస్థ టెక్నాలజీ అనలిస్ట్ పాట్రిక్ మూర్హెడ్ వివరించారు. అవసరం పడిన.పుడు వద్ధులకు ఆరోగ్య సలహాలు అందించే విధంగా కూడా అప్లికేషన్లు తయారు చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
క్యాజల్ పోజుల్!
కొంటెగా కన్ను కొట్టాలా? చిరు మందహాసం ఎలా ఉంటుందో చూపించాలా? చేతులతో లవ్ సింబల్ పెట్టాలా? నాలుకతో వెక్కిరించాలా? కొంచెం పొగరుగా ఫేస్ పెట్టాలా?... ఇలా ఏ పోజైనా సరే నేను రెడీ అన్నారు కాజల్ అగర్వాల్. అంతే.. ఫొటోగ్రాఫర్ తన కెమెరాని క్లిక్‌మనిపించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నట్లు బోలెడన్ని ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేశారు. క్యాజల్ పోజుల్ కదూ! -
అంత కలర్ కూడా కాదు కదా...!
అక్కకి పెళ్లి చూపులు... ఇల్లంతా తిరుగుతూ హడావిడి చేయాల్సిన చెల్లెలు గదిలో దాక్కుంటుంది. అంత కర్మేంటి? అంటే.. ‘అందం’గా ఉన్నందుకే. ‘అక్క కన్నా అందంగా ఉన్నావు కాబట్టి, వచ్చే అబ్బాయి నిన్ను చేసుకుంటాననే ప్రమాదం ఉంది. అందుకే దాక్కో’ అంటారు ఆ అమ్మాయి అమ్మానాన్న. ఏంటీ.. ‘అతడు’ సినిమాలో సీన్ గుర్తొస్తోంది కదూ. యస్... చెబుతున్నది దాని గురించే. అదే సీన్లో త్రిషను ఉద్దేశించి మహేశ్‌బాబు, ‘‘వాళ్లందరూ చెప్పడం వల్ల నీకలా అనిపిస్తుంది కానీ, నిజానికి నువ్వు అంత బాగుండవ’’నే టైప్‌లో ఆటపట్టిస్తాడు. ఆ సందర్భంలో గమ్మత్తై డైలాగులతో మహేశ్ తెగ ఆటపట్టిస్తున్నప్పుడు ఉక్రోషంగా త్రిష ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. త్రిష ఎంత మంచి నటో చెప్పడానికి ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అంత మంచి నటి కాబట్టే, పధ్నాలుగేళ్లయినా నటిగా ఆమె ‘స్టేల్’ కాలేదు. నిజానికి ఓ రెండు, మూడేళ్ల క్రితం త్రిష కెరీర్ కొంచెం పడిపోతున్నట్లు అనిపించింది. యువ కథా నాయికలు చాలామంది వచ్చేశారు కాబట్టి, పధ్నాలుగేళ్లుగా చేస్తున్న త్రిష ఇక సర్దుకోవాల్సిందే అని కొంతమంది అనుకున్నారు కూడా. కానీ, అలా జరగలేదు. జస్ట్ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చేమో కానీ, కెరీర్ డౌన్‌ఫాల్ మాత్రం కాలేదు. పైగా గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాలు చేసి, ఆశ్చర్యపరిచారు. ఇన్నేళ్లయినా త్రిష ఇంకా ఫామ్‌లో ఉండగలగడానికి కారణం ఏంటి? అంటే.. ‘మంచి నటి కాబట్టి’ అనొచ్చు. నటన ఒక్కటే ఉంటే సరిపోదు. మీద పడుతున్న వయసును కనబడనివ్వక పోవడం పెద్ద ప్లస్. ఇటీవల విడుదలైన ‘కళావతి’లో బీచ్ సాంగ్ చూసినవాళ్లు త్రిషకు థర్టీ ఇయర్స్ అంటే నమ్మరు. ఫిజిక్ అంత బాగుంటుంది. తమిళ చిత్రం ‘మౌనమ్ పేసియదే’, తెలుగు చిత్రం ‘నీ మనసు నాకు తెలుసు’ ద్వారా పరిచయమైనప్పుడు త్రిష ఎంత సన్నగా ఉండేవారో ఇప్పటికీ దాదాపు అలానే ఉన్నారు. చెప్పాలంటే మరింత మెరుపుతో సినిమా సినిమాకీ ఇంకా ఆకర్షణీయంగా కనపడుతున్నారే తప్ప, వయసు ప్రభావం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా త్రిష చేతిలో తక్కువ సినిమాలేం లేవు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘నాయకి’తో పాటు ధనుష్ సరసన ‘కొడి’ చేస్తున్నారు. ఇంకా, యువహీరో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా అంగీకరించారు. మొత్తం మీద బిజీ బిజీగానే ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో సినిమాల పరంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసేశారు. విజయవంతంగా సెంచరీవైపు అడుగులు వేస్తున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే... ‘అతడు’ సినిమాలో మహేశ్ ఆటపట్టిస్తూ, ‘కళ్లు కూడా అంత పెద్దవి కావు... ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది.. అంత కలర్ కూడా కాదు కదా’ అనే డైలాగ్ త్రిషకు సరిగ్గా సరిపోతుంది. నిజమే. ఆమె అంత కలర్ కాదు. కళ్లు కూడా సోసోగా ఉంటాయి. ముక్కు తీరూ అంతే. మరి.. ఎందుకు త్రిష హవా తగ్గడం లేదు? అనడిగితే.. ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’లోని ‘ఏండే.. ఓ పాట పాడండే..’ డైలాగ్‌లా, ‘ఏండే.. ఇక్కడ త్రిష అండే... కత్తి లాంటి బాడీ, నటనలో వాడి అలానే ఉన్నయండే’ అని చెప్పొచ్చు. ఇప్పట్లో ఈ చెన్నై చందమామకు తిరుగు లేదంటే అతిశయోక్తి కాదు. -
బాల దిగ్గజాలు
పట్టుమని పదేళ్లు కూడా నిండని పిల్లలు.. రంగస్థలంపై రసరమ్యంగా నటించారు. ఏదో చిన్నాచితకా వేశాలు కాదండోయ్.. ఏకంగా రాయల వైభవాన్ని కళ్లకు కట్టారు. ప్రబంధకాలం నాటి అష్టదిగ్గజాలుగా ఒదిగిపోయిన బాల దిగ్గజాలు తమ నటనతో ఔరా! అనిపించుకున్నారు. కృష్ణరాయల కీర్తి, మహామంత్రి తిమ్మరుసు ధీయుక్తిని.. వికటకవి తెనాలి రామలింగడి చాతుర్యాన్ని ప్రదర్శించి నటనలో తమకు తామే సాటని నిరూపించుకున్నారు ఆ బాలలు. ముద్దు ముద్దు మాటలు.. అనుకరణ తొంగిచూడని అభినయం.. ఈ చిన్నారుల సొంతం. అందుకే మహామహులకైనా తికమకపెట్టే పాత్రలు ఈ బుడతల దగ్గరకు వచ్చేసరికి నవరసాల్లో నాట్యమాడాయి. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య భువనవిజయాన్ని మరోసారి చూసి తరించాయి. ‘గ్లోబల్ ఎడ్జ్ స్కూల్’ కలైడోస్కోప్ 2014-15 వార్షిక ఉత్సవాలను ‘ఎక్స్ప్రెషన్స్’ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించింది. శ్రీకృష్ణదేవరాయలు పాలనలోని కొన్ని ఘట్టాల ఆధారంగా చిన్నారులు ప్రదర్శించిన నాటకం అందరి మన్ననలు అందుకుంది. భువన విజయం.. అష్ట దిగ్గజాలు కొలువుదీరిన రాయల ఆస్థానం భువనవిజయంగా చారిత్రక ప్రశక్తి పొందింది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భువనవిజయం కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తెలుగు, సంస్కృత భాషా పండితులు అష్టదిగ్గజాల పాత్రల్లో అలరిస్తారు. అలాంటి ఇతివృత్తాన్ని ఎంచుకున్న ఒకటో తరగతి విద్యార్థులు చారిత్రక పాత్రల్లో జీవించారు. రాయలుగా కార్తీక్, తిమ్మరుసుగా సాయిధ్రువ్, తెనాలి రామకృష్ణుడుగా గీతేష్రెడ్డి, మిగిలిన కవులుగా మౌర్య, వరుణ్‌తేజ, సూర్యతేజ, సాయి శ్రీహిత్, వీణహంసిని, జయదేవ్‌లు, ఇతర పాత్రల్లో అల్లా రన్వీ శ్రీ, శశాంక్ నటించారు. రాయలు, రామకృష్ణ కవి మధ్య జరిగిన సరదా సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అవకాశం ఇస్తే మహా నటులకు తామేం తీసిపోమని నిరూపించారు. తెర వెనుక.. ఒకప్పుడు స్కూల్స్‌లో కల్చరల్ ఈవెంట్స్ అంటే.. ఒకట్రెండు రోజులు ప్రాక్టీస్ చేసి తమ ప్రతిభను ప్రదర్శించేవారు. అయితే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సరికొత్త ఈవెంట్లు డిజైన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. పౌరాణిక, చారిత్రక నాటకాలను వారితో వేయించి.. చరిత్ర మూలాలను పిల్లలకు అర్థమయ్యేలా చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ‘పౌరాణిక, చారిత్రక నాటకాలు కనుమరుగవుతున్నాయి. చరిత్ర, సాహిత్యం పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే ఈ నాటకం పిల్లలతో వేయించాను. నెల రోజులు ప్రాక్టీస్ చేయించాను. ఈ పిల్లలు ఇంత అద్భుతంగా నటిస్తారని అనుకోలేదు’ అని పిల్లలతో దగ్గరుండి నాటకం వేయించిన తెలుగు ఉపాధ్యాయురాలు గాయత్రీ శ్రీరామ్ తెలిపారు. పసి మనసుల్లో.. తమ అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న చిన్నారులు.. పెద్దలు చూపిన దారిలో ముందుకెళ్తామని చెబుతున్నారు. పాలనతో మేధావులకు పెద్ద పీఠ వేస్తానని రాయల పాత్ర పోషించిన కార్తీక్ చెబుతున్నాడు. తెనాలి రామకృష్ణుడిలా తానూ జీనియస్ అని నిరూపించుకుంటానని తెలిపాడు గీతేష్ రెడ్డి. అంతే కాదు మరిన్ని పౌరాణిక నాటకాలు వేస్తామని చెబుతున్న చిన్నారులకు జేజేలు చెబుదాం. ..:: కోన సుధాకర్‌రెడ్డి