మనిషిలా హావభావాలను వ్యక్తీకరించగల రోబో చార్లెస్
సాక్షి, హైదరాబాద్ : అందరి మాదిరిగానే ఛార్లెస్ చిరుమందహాసంతో పాటు ముఖం చిట్లించడం, ఆశ్చర్యపోవడం వంటి ఇతర వ్యక్తీకరణలు చేయగలడు. ఛార్లెస్ ఓ మరమనిషి (రోబో). కొత్త పరిశోధనలకు మరో ముందడుగులో భాగంగా మెదళ్లను చదవడంతో పాటు హావభావాలను వ్యక్తపరిచే ‘ఛార్లెస్’ సిద్దమయ్యాడు. వివిధ సందర్భాల్లో మనుషులు చేసే వ్యక్తీకరణలను చూసి వాటిని అనుకరించగలడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఓ పరిశోధనలో భాగంగా దీనిని రూపొందించింది. విభిన్నమైన ఈ రోబోను మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు అక్కడి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదుపరి పరిశోధనలు నిర్వహిస్తోంది. మనుషుల లాగానే భావోద్వేగాలు వ్యక్తపరిచే రోబోలకు ఇది మరింత శక్తియుక్తులను అందిస్తుందని భావిస్తున్నారు.
ముఖంలో భావాలు వ్యక్తిపరిచే రోబో...
కెమెరాతో అనుసంథానించిన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వ్యవస్థ, ఇతర పరికరాల ద్వారా మనుషుల ముఖాలను రికార్డ్ చేస్తారు. ఈ ఫుటేజిని కంప్యూటర్ విశ్లేషిస్తుంది. ముఖంలోని కండరాలు, కనుబొమలు, దవడ, నోరు, ఇతర అవయవాలను తీరును కొలిచి ఆ వివరాలను ఛార్లెస్‌కు పంపిస్తుంది. ఈ ప్రక్రియ 2,3 సెకండ్లలోనే ముగుస్తుంది. వాటిని ఆ రోబో స్వీకరించాక తాను సొంతంగా హావభావాలను వ్యక్తపరుస్తుంది.‘సామాజిక సంబంధాల్లో భాగంగా మనుషులు వ్యక్తపరిచే సంకేతాలను తెలుసుకునే సామర్థ్యాన్ని కంప్యూటర్లకు కల్పించాలనేది మా ఆలోచన. ఇందులో మనుషుల ముఖకవళికలు, కంఠస్వరం, శరీర భంగిమ, సంజ్ఞలను ఇవి అర్థం చేసుకునేలా రూపొందిస్తున్నాం’ అని ఛార్లెస్ సష్టికర్త ప్రొ. పీటర్ రాబిన్‌సన్ పేర్కొన్నారు.మెరుగైన పద్ధతుల్లో అమర్చిన కత్రిమ అవయవాల కారణంగా ఛార్లెస్ మనిషిని పోలినట్టుగానే కనిపిస్తున్నా వ్యక్తపరిచే హావభావాలు మాత్రం ఇంకా అసహజంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. గతంలో కత్రిమ మేథతో కూడిన హ్యుమనాయిడ్ ‘సోఫియా’ను (ప్రపంచంలోనే పౌరసత్వం లభించిన తొలి రోబో)రూపొందించిన రోబోటిస్ట్ డేవిడ్ హాన్సన్ సహకారంతో ‘చార్లెస్’ను రాబిన్‌సన్ రూపొందించారు.
భావోద్వేగ మరమనుషులు..
మనుషుల ముఖకవళికల్లో వచ్చే మార్పులు చేర్పులు, భావనలను గ్రహించి ..అందుకు తగినట్టుగా (ప్రతిస్పందనగా) తమవైన సలహాలు, సూచనలు ఇచ్చే రోబోలను తయారు చేసేందుకు అనేక చోట్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల లాస్‌వేగాస్‌లోని నెవాడాలో జరిగిన ‘వినియోగదారుల ఎలక్ట్రానిక్ ప్రదర్శన’ (సీఈఎస్)లో భావోద్వేగ రోబోతో సహా వివిధ నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. రోబోలు కూడా భావాలను వ్యక్తికరించే విధంగా ‘భావోద్వేగ చిప్’ తయారుచేస్తున్నట్టు న్యూయార్క్‌కు చెందిన ఎమోషేప్ సంస్థ వ్యవస్థాపకుడు పాట్రిక్ లెవి–రోసెంతల్ వెల్లడించారు.
జపాన్‌లో ఓదార్పు రోబోలు..
జపాన్‌లో వద్ధుల సంరక్షణ చర్యలు కొరవడుతున్న పరిస్థితుల్లో అందుకు రోబోల సేవలను ఉపయోగించే దిశగా ప్రయోగాలు చేస్తున్నాం. ఒకవేళ మీరు కళ్లనీళ్లు పెట్టుకుంటే మిమ్మల్ని ఈ రోబో ఓదారుస్తుంది. మీకు స్నేహితులెవరూ లేకపోతే ఇది మిత్రుడిగా వ్యవహరిస్తుంది. అంతర్ముఖులుగా ఉన్న వారు రోబోలతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు’ అని తమ రోబోల ప్రత్యేకతలను మూర్ ఇన్‌సైట్స్ అండ్ స్ట్రాటజీ సంస్థ టెక్నాలజీ అనలిస్ట్ పాట్రిక్ మూర్‌హెడ్ వివరించారు. అవసరం పడిన.పుడు వద్ధులకు ఆరోగ్య సలహాలు అందించే విధంగా కూడా అప్లికేషన్లు తయారు చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment