ప్రధాని మోదీతో భయ్యూజీ మహారాజ్
ఇండోర్ : ఆధ్యాత్మిక భోదనలు చేసే గురు భయ్యూజీ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో బాగా పాపులర్ అయినా, ఈయన గురించి ఇతర రాష్ట్రాల వారికి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక, శాంతి బోధనలు చేసే గురువే ఆత్మహత్యకు పాల్పడంతో ఆయన మరణ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గురు భయ్యూజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. భయ్యూజీ అసలు పేరు ఉదయ్ సింగ్ దేశ్‌ముఖ్. 1968లో మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లా శుజల్‌పూర్‌లో జమిందార్ వంశంలో జన్మించారు.
మొదట ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసిన భయ్యూజీ, తర్వాత మోడల్‌గా మారారు. ప్రముఖ వస్త్రాల బ్రాండ్ సియారామ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేశారు. భయ్యూజీకి, మాధవితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. 2015లో భార్య మాధవి చనిపోగా, 2017లో డాక్టర్ ఆయుషి శర్మను రెండో వివాహం చేసుకున్నారు. 1999లో ‘సద్గురు దత్తా ధార్మిక్ పర్మార్థిక్’ అనే ట్రస్ట్‌ను నెలకొల్పారు. ఇండోర్‌లోని భయ్యూజీ ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, రాజ్ థాక్రే, లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలు సందర్శించారు.
ఈయన జీవన విధానం చాలా విలాసవంతంగా ఉండేది. మెర్సిడిస్ ఎస్‌యూవీ కార్లు, రోలెక్స్ చేతి గడియారాలు, గుర్రపు స్వారీలు, రిసార్ట్స్‌లో బసచేయడాలు అన్ని లగ్జరీగానే ఉండేవి. అవ్వడానికి ఆధ్యాత్మిక గురువైనప్పటికి రాజకీయంగా కూడా చాలా ప్రభావశాలిగా ఉండేవారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌కు భయ్యూజీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రేతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భయ్యూజీ సన్నిహితంగా మెలిగే వారన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment