'బిగ్‌బాస్ షోకి రమ్మని పిలిచారు.. కోట్లు ఇస్తామన్నారు, అక్కర్లేదని తిరస్కరించాను. నేను పాటించే సాంప్రదాయాలకు, విలువలకు అది అనువైన ప్రదేశం కానే కాదు.. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అక్కడికి వెళ్లను. నాకు డబ్బు కన్నా విలువలే ముఖ్యం..' ఆధ్యాత్మికవేత్త, బాబా అనిరుద్ధాచార్య గతంలో అన్న మాటలివి.
బాబాపై ట్రోలింగ్
బిగ్‌బాస్ షో అంటేనే గిట్టని ఆయన ఇటీవల హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ గ్రాండ్ లాంచ్‌లో మెరిశారు. అయితే కంటెస్టెంట్‌గా కాదు, కేవలం అతిథిగానే! అయినా సరే ఆ రియాలిటీ షోకి ఎందుకు వెళ్లావంటూ జనాలు విమర్శించారు. దీంతో బాబా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపారు.
ఊపిరి ఉన్నంతవరకు అదే చేస్తా..
నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి. సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేసేందుకు, దాన్ని విస్తరించాలన్న ఉద్దేశంతోనే వెళ్లానే తప్ప ఆ షోలో పాల్గొనాలని కాదు. దయచేసి నన్ను మన్నించండి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. నేను బతికున్నంతవరకు సనాతన ధర్మం గొప్పదనం గురించి మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment