
ఎమ్మెల్యే గారూ ఓ ఐదు నిమిషాలు ఆగలేక పోయారా..?
సాక్షి, ఖమ్మం: కారేపల్లిలో టీఆర్‌ఎస్ మండల నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ మధ్య వేదికపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. జెడ్పీటీసీ కలగజేసుకుని ‘నేను రాకముందే పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే గారూ ఓ ఐదు నిమిషాలు ఆగలేక పోయారా..?’ అన్నారు. ‘మీరే అరగంట ముందు ఉండి ఏర్పాట్లు చూసుకోవాలి కదా? మీకోసం ఎమ్మెల్యే వేచి చూడాలా?’ అని శాసనసభ్యులు బుదులిచ్చారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాస్త సంవాదం జరిగింది. దీంతో అక్కడి నాయకులు కలగజేసుకుని సముదాయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, వైఎస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మాజీ ఎంపీపీ పద్మావతి, నాయకులు అజ్మీర వీరన్న, ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీలు ఉమాశంకర్, మూడ్ జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment