vyra
-
చీమలపాడు ఘటనలో 3కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకి చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ సంఖ్య పెరగొచ్చని సమాచారం. వివరాలు.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు భారీగా బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ ఎగిరిపడటంతో మంటలు అలుముకున్నాయి. బాణాసంచా ధాటికి గుడిసెలోని గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పేలుడు ధాటికి విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఊహించని ఘటనతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్పందించిన కేటీఆర్ వైరా నియోజకవర్గం కారేపల్లి అగ్నిప్రమాదంపైమంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను ఆదేశించారు. ఈ మేరకు వారితో ఫోన్లో సంభాషించారు. చదవండి: మమ్మీ.. డాడీ ఐయామ్ సారీ.. -
వైరాలో వింత చేపల వర్షం.. మునుపెన్నడూ చూడలేదే!
సాక్షి, ఖమ్మం: : వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్, శాంతినగర్ శివాలయం రోడ్డు, పినపాకల్లో శుక్రవారం వింత చేపల వర్షం కురిసింది. అయితే, భారీ వర్షానికి రోడ్లు, డ్రెయినేజీలు పొంగి పొర్లడంతో రిజర్వాయర్ నుంచి చేపలు ఎదురెక్కి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కాగా, ఈ చేపలు మునుపెన్నడూ చూడని విధంగా ఉండడంతో ఆసక్తిగా పరిశీలించారు. చదవండి: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి -
కొండెక్కిన చికెన్ ధరలు.. షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను..
సాక్షి, ఖమ్మం: గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగలు రాత్రి సమయంలో కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చికెన్ దుకాణం ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి దొంగిలించుకుపోయిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. వైరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో యజమాని బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కాగా గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. చదవండి: వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి! -
వైరా గురుకులంలో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థులకు కరోనా
సాక్షి, ఖమ్మం: వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని టీఎస్ గురుకుల బాలికల పాఠశాలలో రెండ్రోజుల వ్యవధిలో 29 మంది విద్యార్థినులు కోవిడ్ బారినపడ్డారు. మొదట గత నెల 30న 8వ తరగతి విద్యార్థిని శుభకార్యం నిమిత్తం ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 15న దగ్గు, జలుబుతో బాధపడుతూనే పాఠశాలకు వచ్చింది. కరోనా పరీక్ష చేయించుకుని రావాలని ప్రిన్సిపాల్ బాలికను ఇంటికి పంపించారు. అక్కడ పరీక్ష చేయగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆమె పక్కన కూర్చునే మరో విద్యార్థినికి సైతం లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు బాలికకు వైరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణైంది. చదవండి: టీఆర్ఎస్ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్.. దీంతో వైరా ఆస్పత్రి వైద్యురాలు సుచరిత ఆధ్వర్యంలో శనివారం గురుకుల పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు చేయగా 13 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరినీ ఇంటికి పంపించారు. ఆదివారం మళ్లీ పరీక్షలు చేయగా మరో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. జిల్లా అధికారులకు సమాచారం అందించి మున్సిపల్ సిబ్బందితో పాఠశాలను శానిటైజ్ చేయించారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజేశ్ పాఠశాలను పరిశీలించారు. మరో 15 మంది బాలికలకు అనుమానిత లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి శాంపిల్స్‌ను ఖమ్మం పంపారు. చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు.. -
జర ఆగితే ఏమైంది.. 5 నిమిషాలు ఆగలేక పోయారా..?
సాక్షి, ఖమ్మం: కారేపల్లిలో టీఆర్ఎస్ మండల నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ మధ్య వేదికపై ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. జెడ్పీటీసీ కలగజేసుకుని ‘నేను రాకముందే పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే గారూ ఓ ఐదు నిమిషాలు ఆగలేక పోయారా..?’ అన్నారు. ‘మీరే అరగంట ముందు ఉండి ఏర్పాట్లు చూసుకోవాలి కదా? మీకోసం ఎమ్మెల్యే వేచి చూడాలా?’ అని శాసనసభ్యులు బుదులిచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా కాస్త సంవాదం జరిగింది. దీంతో అక్కడి నాయకులు కలగజేసుకుని సముదాయించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు శకుంతల, వైఎస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ మల్లెల నాగేశ్వరరావు, సర్పంచ్ ఆదెర్ల స్రవంతి, మాజీ ఎంపీపీ పద్మావతి, నాయకులు అజ్మీర వీరన్న, ఇమ్మడి తిరుపతిరావు, ఎంపీటీసీలు ఉమాశంకర్, మూడ్ జ్యోతి పాల్గొన్నారు. -
వైరాలో ముసుగుదొంగ
సాక్షి, వైరా(ఖమ్మం): వైరా ఆంధ్రాబ్యాంక్‌లో చోరీ చేసేందుకు ఓ దొంగ బుధవారం అర్ధరాత్రి విఫలయత్నం చేశాడు. అలారం మోగడంతో పలాయనం చిత్తగించాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు..రోజూలాగే బుధవారం కూడా వైరా పాత బస్టాండ్ సెంటర్లోని ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది విధుల అనంతరం బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు. రాత్రి 11.33 గంటల సమయంలో బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో పక్కనే ఉన్న మెడికల్ షాపు యాజమాని మిథున్ చక్రవర్తి 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. శబ్దాలు ఎక్కువ కావడంతో మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో ఏసీపీ, సీఐ, ఎస్ఐ బ్యాంక్ వద్దకు చేరుకుని పరిశీలించారు. చోరీకి యత్నం జరిగినట్లు గుర్తించారు. బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారూ వచ్చారు. బ్యాంకు పక్కనే సందులో ఉన్న గేటుకు తాళం లేకపోవడంతో ముసుగు ధరించిన ఓ దొంగ బ్యాంకు వెనుకవైపు వెళ్లి.. కిటికీ గ్రిల్స్‌ను పగలగొట్టి లోపలకు ప్రవేశించాడు. చేతికి, ముఖానికి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్లిన దొంగ ముందుగా క్యాష్ కౌంటర్లోకి, అటు తర్వాత స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. మళ్లీ 5 నిమిషాల తరువాత స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లి పరిశీలన చేశాడు. ఈ క్రమంలో ముందుగా తన వెంట తెచ్చుకున్న గడ్డపార, సుత్తి, ఇనుపరాడ్లతో స్ట్రాంగ్ రూంను పగులగొట్టే యత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాంక్‌లోని అలారం మోగింది. దీంతో బ్యాంకు వెనుక నుంచి కూరగాయల మార్కెట్ రోడ్డు మీదుగా మధిర రోడ్డు వరకు వెళ్లాడు. పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించగా.. చోరీ యత్నం పూర్తిగా రికార్డై ఉంది. కాగా చోరీ చేయడానికి ముందే గేటు సమీపంలో బల్బును తొలగించినట్లు, బయట ఉన్న సీసీ కెమెరాను పగలగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ యత్నం జరిగిన ఆంధ్రాబ్యాంక్ పగలు రెక్కీ.. ఆంధ్రాబ్యాంక్ ఎదుట ముగ్గురు వ్యక్తులు బుధవారం మధ్నాహ్నం రెక్కీ నిర్వహించినట్లు సమీపంలోని దుకాణదారులు పేర్కొంటున్నారు. బ్యాంకులో అలారం మోగకపోతే భారీ చోరీ జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలన వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ వసంతకుమార్‌ల సమాచారం మేరకు ఖమ్మం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందం బ్యాంకుకు చేరుకుని పరిశీలించాయి. పోలీసులకు కొన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రత ఏదీ? వైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీన వైరా ఎస్బీఐ టౌన్ బ్రాంచిలో మెట్లపై నుంచి పైకి వెళ్లి షట్టర్ పగులగొట్టి మరీ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు. ఏకంగా సీసీ పుటేజీలో హార్డ్ డిస్క్‌లను, సీసీ కెమెరాలను తొలగించి మరీ చోరీకి యత్నం చేశాడు. ఇక్కడి బ్యాంకులో కనీసం సెక్యూరిటీ కూడా లేడు. షట్టర్ పగులగొడితే బ్యాంకులోకి వెళ్లాడంటే బ్యాంకు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల క్రితం కారేపల్లి డీసీసీబీ బ్యాంకులో కూడా భారీ యంత్రాలను వినియోగించి బ్యాంకులోకి చొరబడి చోరీ యత్నం చేశారు. అక్కడా కూడా భద్రత చర్యలు ఏమీ తీసుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు బుధవారం అర్ధరాత్రి ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిపిన ప్రదేశంలో కనీసం ఉన్న గేటుకు కూడా తాళం వేయలేదు. గ్రిల్స్ పగులగొట్టి దొంగ సులువుగా బ్యాంకులోకి ప్రవేశించాడు. కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేడు. ఏటీఎంల వద్ద కూడా భద్రత ఉండడంలేదు. విచారణ చేస్తున్నాం ఎస్బీఐలో చోరీకి యత్నించింది ప్రొఫెషనల్ దొంగగా గుర్తించాం. విచారణ చేపడుతున్నాం. సీసీ పుటేజీలు కూడా సేకరించాం. బ్యాంకుల వద్ద బ్యాంకర్లు కనీసం జాగ్రత్తలు పాటించాలి. సెక్యూరిటీ గార్డ్స్‌ను రాత్రివేళ్లల్లో నియమించి భద్రత చర్యలు తీసుకోవాలి. జె.వసంత్‌కుమార్, సీఐ, వైరావైరా: ఖమ్మం జిల్లాలో బ్యాంకులనే టార్గెట్ చేస్తూ చోరీలకు యత్నిస్తున్నారు. వైరా, కారేపల్లి మండలాల్లో ఆంధ్రాబ్యాంక్, డీసీసీబీ, ఎస్బీఐ బ్రాంచిలో చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఖాతాదారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఖాతాదారులు దాచుకున్న బంగారం, నగదుకు భద్రత ఉందా..? అనే సందేహం వ్యక్తమవుతోంది. కాగా పోలీసులకు ఈ చోరీ యత్నాలు సవాల్‌గా మారుతున్నాయి. -
10 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
వైర (ఖమ్మం) : అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న పది టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అందులో సుమారు 10 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు రెవెన్యూ అధికారులకు వాటిని అప్పగించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి అదనపు సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
వైరాలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
ఖమ్మం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైరా చేరుకున్నారు. ఖమ్మంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనభేరీ పాల్గొనేందుకు జగన్ వెళుతున్నారు. మార్గమధ్యలో వైరాలో ఆగారు. జగన్ రాక సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. వైరాలో రోడ్డు వెంబట ఇరువైపుల జనం బారులు తీరారు. కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాతం పలికారు.