చీమలపాడు ఘటనలో 3కి చేరిన మృతుల సంఖ్య | Fire Accident At BRS Atmiya Sammelanam Vyra Khammam | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశ్రుతి.. మూడుకి చేరిన మృతుల సంఖ్య.. కేటీఆర్‌ ఆవేదన

Published Wed, Apr 12 2023 12:29 PM | Last Updated on Wed, Apr 12 2023 2:41 PM

Fire Accident At BRS Atmiya Sammelanam Vyra Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకి చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ సంఖ్య పెరగొచ్చని సమాచారం.

వివరాలు.. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు భారీగా బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న గుడిసెపై తారాజువ్వ ఎగిరిపడటంతో మంటలు అలుముకున్నాయి.

బాణాసంచా ధాటికి గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు. పేలుడు ధాటికి విధులు నిర్వహిస్తున్న సీఐతో సహా పలువురి కాళ్లు, చేతులు  తెగిపడ్డాయి. ఊహించని ఘటనతో ఆ ప్రాంతమంతా హాహాకారాలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్పందించిన కేటీఆర్‌
వైరా నియోజకవర్గం కారేపల్లి అగ్నిప్రమాదంపైమంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులను ఆదేశించారు. ఈ మేరకు వారితో ఫోన్‌లో సంభాషించారు.

చదవండి: మమ్మీ.. డాడీ ఐయామ్‌ సారీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement