సాక్షి, ఖమ్మం: గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగలు రాత్రి సమయంలో కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చికెన్ దుకాణం ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి దొంగిలించుకుపోయిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. వైరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.
ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్‌లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో యజమాని బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు కాగా గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు తెలిపారు.
చదవండి: వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
Comments
Please login to add a commentAdd a comment