Telangana: Chicken Price Hikes In Hyderabad - Sakshi
Sakshi News home page

Hyderabad: మాంసం ప్రియులకు షాక్‌.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్‌ ఎంతంటే?

May 15 2023 9:30 AM | Updated on May 15 2023 2:31 PM

KG Chicken Price Hikes In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చికెన్‌ ధర కొండెక్కింది. ఆదివారం కిలో కోడి మాంసం రూ.250కి చేరింది. ఎండలు మండుతుండటం, వేడి గాలుల తీవ్రతతో ఫారాల్లోని కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో చికెన్‌ ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌గా కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.250 వరకు విక్రయిస్తుండగా.. స్కిన్‌తో ఉన్న చికెన్‌ రూ.220 వరకు అమ్ముతున్నారు.

గత వారం రోజుల్లో కిలో చికెన్‌ ధర రూ. 50 నుంచి రూ.60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్‌ పెరగడమే చికెన్‌ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. వచ్చే ఆదివారం నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవులు, ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతుండటంతో చికెన్‌ వినియోగం బాగా పెరిగి ధరలు మండుతున్నాయి. 
చదవండి: ‘కొరియన్‌’ ట్రెండ్‌కు హైదరాబాద్‌ యూత్‌ ఫిదా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement