Chicken Prices Rising
-
చికెన్..చాలా రేటు గురూ!
శ్రీకాకుళం/(పీఎన్ కాలనీ): సిండికేట్ల చేతిలో పడి చికెన్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, ఆయిల్, నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించే అధికారం కలెక్టర్, మార్కెటింగ్‌శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది. చికెన్ ధరలు మాత్రం హోల్‌సేల్ చికెన్ వ్యాపారులు, వారి సిండికేట్ వారే రేట్లు ‘ఫిక్స్’ చేస్తారు. విశాఖపట్నం, విజయనగరంలో ఒక రేటు ఉంటే శ్రీకాకుళంలో మాత్రమే ఈ రెండు జిల్లాలకంటే రూ.20 ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఫారాలకు జిల్లాలోనే ఫీడ్ దొరుకుతుంది, కోళ్ల ఫారాలు సైతం జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాకు సరిపడా సరుకు లేకుంటే విశాఖ, అనకాపల్లి నుంచి తీసుకువస్తారు. కానీ ధరలు మాత్రం విశాఖ, విజయనగరం కంటే ఎక్కువే ఉంటున్నాయి. ఈ సిండికేట్‌లో త్రిమూర్తుల్లా ముగ్గురు వ్యక్తులు ఈ వ్యవహారమంతా నడిపిస్తోన్నట్లు చికెన్ షాపుల యజమానులు గుసగుసలాడుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా స్కిన్లెస్ సుమారు రూ.260కి పైగా ధర పలుకుతోంది. విశాఖపట్నం, విజయనగరంలో రూ.240కి అమ్ముతున్నారు. ఇవి పత్రికల్లో వచ్చే ధరలు. చికెన్‌షాపుల యజమానుల వారి వ్యాపారాన్ని బట్టి ధర తగ్గించి అమ్మేవారు కొందరు, మరికొంతమంది దానికంటే ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ/ప్రవేటు హాస్టల్స్, హోటల్స్, దాబాల నిర్వాహకులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా తర్వాత ఆదివారం ఇంకెంత ధర పెంచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఒడిశా నుంచి కొని.. జిల్లాలోని పలువురు వ్యాపారులు ఒడిశా నుంచి కోళ్లను తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. జిల్లాలో కంటే ఒడిశాలో ధర కిలోకు రూ.40వరకు తక్కువగానే ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో వ్యాపారులు, సిండికేటుగాళ్లు ఎక్కువ ధరకు అమ్ముతు న్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల కంటే తక్కు వ ధరకు ఇవ్వాల్సింది పోయి తిరిగి దూర ప్రాంతాల నుంచి తెస్తున్నామనే నెపంతో ధరలు అధికంగా పెంచేసి రెట్టింపు లాభాల్ని ఆర్జిస్తున్నారు. ధరల నియంత్రణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు నియంత్రించాల్సిందే చికెన్ ధరల నియంత్ర ణ అధికారుల చేతుల్లో ఉంటే బాగుంటుంది. హోల్‌సేల్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. – ప్రకాష్, చికెన్షాపు, రైతుబజారు రోడ్డు, శ్రీకాకుళం. వ్యాపారాలు చేయలేకపోతున్నాం చికెన్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. చికెన్, గుడ్లు ధరలు పెంచడంతో దాబాకి వచ్చేవారికి అధిక ధరలకు ఆహారాన్ని అమ్మలేకపోతున్నాం నష్టాన్ని భరించలేకపోతున్నాం. – ఎం.నాగభూషణ్, శ్రీలక్షి్మదుర్గా దాబా, బలగరోడ్ ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు చికెన్, గుడ్ల ధరల నియంత్రణ మా చేతుల్లో ఉండదు. వాటి సంరక్షణ, పోషణకు సంబంధించిన ప్రోత్సాహమంతా పశు సంవర్ధక శాఖ నుంచి ఉంటుంది. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేస్తే నియంత్రణ సాధ్యమ య్యే అవకాశం ఉంటుంది. – రావిపల్లి మురళీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు -
చికెన్ ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు మాంసంప్రియులకు చుక్కలను చూపుతున్నాయి. ఎండల ధాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గగా, డిమాండ్ పెరిగి ధరపై ప్రభావం చూపుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ రూ.230, స్కిన్ చికెన్ రూ.200 ధర పలకగా ప్రస్తుతం మార్కెట్లో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రూ.330కు, స్కిన్‌తో రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది. ఇంకా పెరిగే అవకాశం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చికెన్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎండల తీవ్రతకు మాంసం ఉత్పత్తి పడిపోవడంతో కిలో రూ.330 వరకు చేరిన చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న కోళ్లు వడగాలులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. పౌల్ట్రీ రైతులు సైతం ఏప్రిల్, మే నెలల్లో వీటి ఉత్పత్తికి వెనుకంజ వేస్తూ వచ్చారు.. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా వేసవిలో కోళ్లు 6 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. ఈ సారి వడగాలుల తీవ్రత తారాస్థాయికి చేరడంతో 16 శాతానికి పైగా మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. వేసవిలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. ఈ పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు నష్టాలబాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. గతంలో లైవ్ చికెన్ ధర కిలో రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి పడిపోయింది సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధర తగ్గుముఖం పడుతుంది. ఈ సారి ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం దిగుబడి తగ్గింది. మరోవైపు కోళ్ల ఫారాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కోళ్ల ఉత్పత్తి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధర పలుకుతోంది. దీంతో గతంతో పోల్చితే 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. – గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
రికార్డు స్థాయిలో చికెన్ ధర@ 550
వికారాబాద్: చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు సరైన రేట్లు లేకపోవడంతో మార్కెట్ కుదేలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఫారాలు మూసేశారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటాయి. స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.320 వరకు పలుకుతోంది. బోన్ లెస్ కావాలంటే రూ.550 చెల్లించాల్సిందే. లైవ్ బర్డ్ కిలోకు రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇవే అత్యధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో శుభకార్యాలతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ వైపు అడుగులు జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే పౌల్ట్రీ రంగం వైపు దృష్టిసారిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం ద్వారా ఏటా 6 బ్యాచ్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోళ్ల పెంపకం లాభదాయకంగా కొనసాగుతూ వచ్చింది. జిల్లాలోని బొంరాస్‌పేట్‌లో– 4, దోమ 16, యాలాల 18, వికారాబాద్ 7, పూడూరు 12, పరిగి 12, మోమిన్‌పేట్ 6, మర్పల్లి 9, కుల్కచర్ల 5, కొడంగల్, ధారూరులో ఒక్కోటి చొప్పున పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఎండల ప్రభావంతోనే.. కరోనా తర్వాత ప్రజలు మాంసాహార వాడకాన్ని పెంచారు. ఇందులోనూ చికెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం ప్రస్తుతం కోడిమాసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఎదుగుదలకు ఎక్కువ సమయం పడుతోంది. ఎలాగైనా వీటిని బతికించుకునేందుకు రైతులు, వ్యాపారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఫారాల వద్ద కూలర్లు, రెయిన్ డ్రిప్, స్ప్రీంక్లర్లు ఏర్పాటు చేసి చల్లదనం అందిస్తున్నారు. దాణా, మందుల ధరలు రెట్టింపు కోళ్లకు దాణాగా ఉపయోగించే మొక్కజొన్న, సోయా, తవుడు ధరలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్లు, మందుల ధరలు కూడా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండల వేడిమికి నిత్యం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. తినడం తగ్గించాం గతంలో వారంలో రెండు రోజులు చికెన్‌ను తినే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన ధరలతో రెండు వారాలకు ఒకసారి మాత్రమే తీసుకెళ్తున్నాం. మార్కెట్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చికెన్ బదులు చేపలు తెచ్చుకుంటున్నాం. – గుడిసె బాబు, బొంపల్లి ఆశించిన లాభాలు లేవు గతంలో చికెన్ ధరలు పడిపోవడంతో ఆశించిన స్థా యిలో లాభాలు రాలే దు. దీంతో కొంతమంది ఫారా ల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు. పదిహేను రోజు లుగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయట పడుతున్నాం. – యాదగిరిరెడ్డి, చికెన్ సెంటర్ నిర్వాహకుడు -
Chicken Price : కొండెక్కిన కోడి.. కిలో ధర రూ.400
తూర్పు గోదావరి: బ్రాయిలర్ కోడి ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ధరలు చూసి బెంబేలెత్తి పోతున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారులకు పెరిగిన ధర మింగుడుపడటం లేదు. సాధారణంగా ప్రతి రోజూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 400 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల సరఫరా జరగుతుంది. కోళ్ల ఉత్పత్తి మందగించడంతో ఏర్పడిన కొరత దృష్ట్యా వారం రోజుల నుంచి తుని, రాజమహేంద్రవరం తణుకులోనున్న కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, రైతుల నుంచి కేవలం 250 టన్నుల వరకూ మాత్రమే సరఫరా జరగుతోంది. వేసవి ప్రభావం దృష్ట్యా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో పాటు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనునిత్యం వేలాది కోళ్లు మృత్యువాత పడటం ఈ ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మూడు నెలల నుంచి చికెన్ ధరలు రూ.100 లోపే ఉండటంతో నష్టాలు తట్టుకోలేని రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతోపాటు వేసవి ప్రభావాన్ని ముందే ఊహించిన కొంతమంది కోళ్ల పెంపకాన్ని తగ్గించడంతో ఉత్పత్తి మందగించింది. కంపెనీల నుంచి స్థానిక హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా దారులు రూ.150 ధర నిర్ణయించగా, రిటైర్లకు రూ.165 వరకూ విక్రయిస్తున్నారు. చికెన్ ధర పెరిగినా తగ్గని విక్రయాలు బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.170 కాగా చికెన్ కేజీ రూ.300, బోన్‌లెస్ రూ. 400 వరకూ విక్రయిస్తున్నారు. కోళ్ల కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకూ మరో నెల రోజుల వరకూ ఇంచుమించు ఇదే ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర ఆశాజనకంగా ఉండటంతో స్థానిక రైతులు వారం రోజుల నుంచి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లలో కేజీన్నర దాటిన వాటిని విక్రయించే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆ బ్రాయిలర్ కోళ్ల సరఫరా అంతంగా మాత్రంగానే ఉండటంతో చికెన్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. చికెన్ ధరలు పెరుగుతున్నా విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. స్థానికంగా ఎండల నుంచి ఉపశమనాన్ని పొందే విధంగా చర్యలు తీసుకుని కోళ్ల పెంపకం సాగిస్తున్న చిన్నకారు రైతులకు మాత్రం ఈ ధర అమాంతం లాభాలు తెచ్చి పెడుతోంది. ఉష్ణోగ్రతల ప్రభావంతోనే చికెన్ ధర పెరిగింది వేసవి దృష్ట్యా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వేడిమిని తట్టుకోలేక కోళ్ల ఫారాల్లో రోజూ సరాసరి వందలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. పెరిగిన ధరలలోను రైతులు నష్టాలను చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలు జూన్ నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది. – బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల -
మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్ ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర కొండెక్కింది. ఆదివారం కిలో కోడి మాంసం రూ.250కి చేరింది. ఎండలు మండుతుండటం, వేడి గాలుల తీవ్రతతో ఫారాల్లోని కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తులు పడిపోయాయి. దీంతో చికెన్ ధరలు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌గా కిలో స్కిన్లెస్ చికెన్ రూ.250 వరకు విక్రయిస్తుండగా.. స్కిన్‌తో ఉన్న చికెన్ రూ.220 వరకు అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 50 నుంచి రూ.60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. వచ్చే ఆదివారం నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వేసవి సెలవులు, ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతుండటంతో చికెన్ వినియోగం బాగా పెరిగి ధరలు మండుతున్నాయి. చదవండి: ‘కొరియన్’ ట్రెండ్‌కు హైదరాబాద్ యూత్ ఫిదా -
నాన్ వెజ్ ప్రియులకు షాక్..పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?
మండపేట(కోనసీమ జిల్లా): శ్రావణ మాసంలోను చికెన్ ధర దిగి రావడం లేదు. రూ.300కు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. పెరిగిన మేత ధరలతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణతో పాటు జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ? రోజూ 3.2 లక్షల కిలోల వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సాధారణంగా 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆయా జిల్లాల్లోని రాజానగరం, ఆలమూరు, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తికమాసం పూజల నేపథ్యంలో శ్రావణమాసం నుంచి కార్తికమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి డిసెంబరు వరకు అన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కోళ్లకు ఆహారంగా అందించే మొక్కజొన్న, సోయా తదితర మేత ధరలు కొద్ది నెలలుగా దిగిరావడం లేదు. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50కి పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడికి రూ.110 వరకు ఖర్చవుతుందంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది కోళ్ల రైతులు కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాగా కంపెనీలు ఇస్తున్న కమీషన్ సరిపోవడం లేదంటూ ఇటీవల సమ్మె చేయడం కొత్త బ్యాచ్‌లపై కొంత ప్రభావం పడిందంటున్నారు. స్థానికంగా కోళ్ల పెంపకం తగ్గడంతో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, తెలంగాణలోని ఖమ్మం, ఆశ్వారావుపేట, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో శ్రావణమాసమైనప్పటికి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుధవారం స్కిన్లెస్ కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.160 వరకు పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. మేత ధరలు తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు అన్ సీజన్, మేత ధరలకు భయపడి చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్ సెంచరీ దాటింది స్కిన్లెస్ చికెన్ కేజీ ధర. ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్‌లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్.. రెస్టారెంట్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు. -
కొండెక్కిన చికెన్ ధరలు.. షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను..
సాక్షి, ఖమ్మం: గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగలు రాత్రి సమయంలో కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చికెన్ దుకాణం ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి దొంగిలించుకుపోయిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. వైరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో యజమాని బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కాగా గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. చదవండి: వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి! -
కొండెక్కిన కోడి ధర.. నెల రోజుల్లో స్కిన్లెస్ చికెన్ రేట్ అంత పెరిగిందా!
కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్‌తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది. వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్‌సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి. ధరలు పైపైకి జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్లెస్తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది. నష్టాలే కారణం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కోడి ధరకు రెక్కలు.. అమాంతం పెరిగిన ధర.. అమ్మో అంత రేటా?
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: లైఫ్ ఈజ్ రయ్రయ్) డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి. -బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
కొండెక్కిన చికెన్ ధరలు.. రెండు నెలలైనా తగ్గని ధర.. గుడ్డుతోనే సరి!
సాక్షి, నారాయణఖేడ్: ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చికెన్ ముక్క లేకుండా ముగియదు. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యుడికి ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. రెండు నెలలుగా చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300లకు కిందకు దిగనంటోంది. గత నెల శ్రావణమాసంలో చికెన్ ధరలు తగ్గుతాయని ఆశించినా, కిలో రూ.260 రికార్డు ధర పలికింది. పెళ్లిళ్ల సీజన్‌తో ఈ ధర మరింత పైకి ఎగబాకింది. అనంతరం ధరలు తగ్గుతాయని ఆశించినా తగ్గడంలేదు. సాధారణ సమయంలో రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. మటన్ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది. తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్ వేసవి నుంచి చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా మాంసాహారం తినాలన్న ప్రచారంతో చాలా మంది డ్రైప్రూట్స్‌తో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డుతోనే సరి.. చాలామంది మాంసం ధరలు పెరగడంతో గుడ్డుతోనే సరిపెడుతున్నారు. ఓ వారం మాంసం కొనుగోలు చేస్తే మరో వారం గడ్డుతో కానిచ్చేస్తున్నారు. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. గుడ్లు ఒకటి రూ.4నుంచి రూ.4.50కు విక్రయించే వారు వీటి ధరలు కూడా పెరిగి రూ.6కు తగ్గనంటోంది. -
కొండెక్కిన కోడి: కొక్కరొకో.. దిగిరాను పో..!
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం ధర కొండెక్కింది. కొన్నాళ్ల నుంచి ధర పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.300కు చేరువలో ఉంది. డిమాండ్‌కు తగినంతగా సరఫరా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కోవిడ్ నేపథ్యంలో చికెన్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో మాంసం ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం అమరావతి పౌల్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ మార్కెట్లో స్కిన్లెస్ కిలో మాంసం ధరను రూ.296గా నిర్దేశించింది. అయితే విజయవాడతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది వ్యాపారులు కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. అయినప్పటికీ వినియోగం అంతగా తగ్గలేదని వ్యాపా రులు చెబుతున్నారు. జిల్లాల్లో సాధారణ రోజుల్లో రోజుకు లక్షా 25 వేల బ్రాయిలర్ కోళ్లు (దాదాపు 2.50 లక్షల కిలోలు), ఆదివారాల్లో రెట్టింపు.. అంటే రెండున్నర లక్షల కోళ్ల విక్రయాలు జరుగుతాయి. ప్రస్తుతం జిల్లాలో చికెన్ వినియోగం రోజుకు రెండు లక్షల కిలోల వరకు ఉంటోంది. ఇలా ఎందుకంటే..! కోళ్ల ఉత్పత్తి, విక్రయాలను దృష్టిలో ఉంచుకుని హ్యాచరీల నిర్వాహకులు ఏటా మే/జూన్ నెలల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ సమయాల్లో వీరు పౌల్ట్రీలకు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెలన్నర రోజుల క్రితం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హ్యాచరీల నిర్వాహకులు క్రాప్ హాలిడే అమలు చేశారు. దీంతో ఫారాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడం తగ్గిపోయింది. దాదాపు నాలుగు వారాల నుంచి మళ్లీ కొత్త బ్యాచ్‌లు వేయడం మొదలు పెట్టారు. వీటిలో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువు ఎదిగే వరకు ఫారాల్లో పెంచుతారు. ఇందుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు. ఇలా కొద్ది రోజుల నుంచి డిమాండ్‌కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేక చికెన్ ధర పెరగడానికి కారణమవుతోందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. నెలలో రూ.78 పెరుగుదల.. గత నెల 18న కిలో చికెన్ ధర రూ.218 ఉంది. అలా జులై ఒకటి నాటికి రూ.230కి పెరిగింది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ సోమవారానికి రూ.296కి చేరుకుంది. అంటే గడచిన నెల రోజుల్లో కిలోపై రూ.78లు, 19 రోజుల్లో కిలోకు రూ.66 పెరిగిందన్న మాట. ప్రస్తుత పరిస్థితుల్లో కిలో రూ.300కి పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మే 15న చికెన్ కిలో రూ.312కి చేరుకుని ఆల్‌టైం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే! రెండు వారాల్లో తగ్గుముఖం కోడి మాంసం ధర మరో రెండు వారాల్లో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఫారాల్లో పెరుగుతున్న బ్రాయిలర్ కోళ్లు అప్పటికి రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకోనున్నాయి. దీంతో అవసరమైన మేరకు కోళ్ల లభ్యత పెరిగి చికెన్ రేటు తగ్గనుంది. అంటే కిలో రూ.250 లోపు దిగివచ్చి చికెన్ ప్రియులకు ఒకింత అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. -
కోడి కొండెక్కింది
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): చికెన్ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. పెరుగుతున్న ధరలతో కిలో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేసే పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో ప్రస్తుతం చికెన్ ధరలు పెరుగుతుండటం నాన్‌వెజ్ ప్రియులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ కిలో రూ.600 పలుకుతున్నా ధర నిలకడగా ఉంటోంది. కానీ చికెన్ ధరలో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. బాయిలన్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. లైవ్ ధర రూ.150 నమోదు చేసింది. ఫారం కోడి ధర కిలో రూ.170, శొంఠ్యాం కోడి కిలో ధర రూ.250 పలుకుతోంది. దీంతో ఈ ధరలకు సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. 4 రెట్ల పెంపు ఏప్రిల్‌లో లాక్డౌన్ ప్రారంభంలో చికెన్ ధర బాగా దిగజారింది. బాయిలర్ ధర కేవలం కిలో రూ.60 ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వినియోగదారులు చికెన్ వైపు మొగ్గు చూపకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ప్రారంభమైన రెండు వారాల వరకు చికెన్ ధర సాధారణ స్థాయిలోనే కొనసాగింది. రూ.60 నుంచి రూ.80, రూ.120 , రూ.160 గా ధరల్లో క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది. ఆ సమయంలో మటన్ ధర అమాంతం కిలో రూ.800కు పెరిగినా చికెన్ మాత్రం నిలకడగానే పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు సైతం ఉత్పతిన్తి భారీగా తగ్గించాయి. దీంతో కిలో రూ.160, రూ.180 మధ్య కుదురుకుంటుందని వినియోగదారులు భావించారు. అయితే మే నెల 15 నుంచి పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. 15 తరువాత రోజుకో విధంగా ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా చికెన్ ధర రూ.200 మార్కును దాటింది. రోజు రోజుకూ ధరలో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో రూ.250 చేరుకొని ఆల్‌టైం రికార్డును నెలకొలి్పంది. దీంతో ధరలపై సామాన్య వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్లే.. కరోనా కారణంగా మాంసాహారంపై వినియోగదారులు దృష్టి సారించకపోవడంతో చికెన్ ధర రూ.60కి పడిపోయింది. ఆ సమయంలో పౌల్ట్రీలు తీవ్రంగా నష్టపోయి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున తగ్గించుకున్నాయి. అన్ని పౌల్ట్రీలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి. వినియోగం తగ్గడం, ఎండలు ముదరడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించాయి. దీంతో ఉత్పత్తి భారీగా తగ్గి ధరలు రోజు రోజుకు పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. పౌల్ట్రీల్లో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునే వరకు ధరలు తగ్గకపోవచ్చు. – సుబ్బారావు, పౌల్ట్రీ, చికెన్ వ్యాపారి -
చికెన్ @ రూ.270
సాక్షి, సిటీబ్యూరో: ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియులకు కోడి కూర వండందే ముద్ద దిగదు. చికెన్ బిర్యాని, చికెన్ కూర ఉంటే చాలు లొట్టలేసుకుని రెండు ముద్దలు ఎక్కువగా ఆరగించేస్తారు. కానీ ఇప్పుడు ధరలు పెరుగుతుండడంతో కోడి కూర తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి కాలంలో కంటే ఎక్కువగా జూన్ నెలలో మార్కెట్లో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అని అంటున్నారు. రెండు వారాల క్రితం కిలో 170 రూపాయలు ఉన్న చికెన్ ధర..ఇపుడు 270 రూపాయలుగా ఉంది. సాధారణంగా మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. కిలో మటన్ ధరకు రెండు నుంచి మూడు కిలోల చికెన్ వస్తుంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో బహిరంగ మార్కెట్లో చికెన్ కిలో ధర రూ. 270 దాటింది. డిమాండ్ ఎక్కువ..సరఫరా తక్కువ సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. అదివారం రోజు 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. అయితే ఈసారి డిమాండ్‌కు సరిపడా కోళ్ల పెంపకం జరగలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే డిమాండ్ పెరిగి...సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
‘ముక్క’దిగట్లే
సాక్షి సిటీబ్యూరో: సిటీలో చికెన్, మటన్ రేట్లు మండిపోతున్నాయి. ఎండలకు పోటీపడుతూ రోజురోజుకు మాంసాహారులకు ఇవి ప్రియంగా మారుతున్నాయి. రంజాన్ నెల రాకతో ప్రస్తుతం మార్కెట్లో మాంసానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జంటనగరాల్లో చికెన్ కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్లే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఫామ్‌లలో బర్డ్స్ (కోళ్లు) లేకపోవడంతో ధరలు పెంచేస్తున్నారు. సాధారణ రోజుల్లో జంట నగరాల్లో రోజుకు దాదాపు 600 నుంచి 750 టన్నులకు పైగానే చికెన్ వినియోగం అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఇక ఆదివారం, పండగ రోజుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు రంజాన్ నెలలో ముస్లింలు ఎక్కువగా నాన్ వెజ్ ఆరగిస్తారు. హోటళ్లలో హలీంతో పాటు, ఇతర నాన్‌వెజ్ వంటకాలు కూడా ఎక్కువగా తయారు చేస్తారు. కానీ ప్రస్తుతం వేసవిలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వేడిని తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వేల వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటి నుంచే ప్రతి రోజూ నగరంలోని చికెన్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొద్దిమొత్తంలో కోళ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు వ్యాపారులు తెలిపారు. జంటనగరాల్లో దాదాపు 10 వేలకు పైగా చికెన్ వ్యాపారులు ఉన్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో వ్యాపారి రోజుకు 700 నుంచి 1500 కేజీల చికెన్ అమ్మకాలు చేస్తున్నారు. ఇక రంజాన్ మాసంలో రోజుకు 2 వేల కేజీల వరకు విక్రయాలు జరుగుతాయి. అయితే కోళ్ల సరఫరా తగ్గిపోవడంతో అమ్మకాలు కూడా తగ్గినట్టు రాంనగర్‌లోని హోల్‌సేల్ చికెన్వ్యాపారి లింగరాజు వెల్ల్లడించారు. నెల రోజుల క్రితం కిలో చికెన్ ధర స్కిన్లెస్ కిలోకు 160 రూపాయలు ధర పలికింది. ప్రస్తుతం కిలో రూ.220 నుంచి 250 వరకు పలుకుతోంది. ఇక స్కిన్‌తో కలిపి అమ్మే చికెన్ కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.180 రూపాయలకు అమ్ముతున్నారు. లైవ్‌బర్డ్ (కోడి) అయితేకిలో రూ. 130 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.160 రూపాయలు పలుకుతోంది. వేసవి ఎండలు తగ్గుముఖం పట్టే వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. మటన్దీ అదే దారి చికెన్ రేట్లు చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు మటన్ మాటెత్తడానికి జంకుతున్నారు. మటన్‌ధర కూడా భారీగా పెరిగింది. రెండు నెలల క్రితం వరకూ కిలో మటన్ ధర రూ.550 ఉండగా, ప్రస్తుతం 600 నుంచి 650 రూపాయలకు పెరిగింది. దీంతో మటన్ కొనుగోలు చేయలేని చాలామంది చికెన్‌తో సరిపెట్టుకుంటున్నారు. -
చికెన్ @రూ.200
సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువమంది వారాంతపు సెలవురోజుల్లో చికెన్ తెచ్చుకుని కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా భోంచేస్తుంటారు. బంధువులో, స్నేహితులో వస్తే చికెన్ తీసుకొచ్చి భోజనం పెట్టి పంపిస్తుంటారు. అయితే ఇప్పుడు కేజీ చికెన్ ధరలు అమాంతం పెరగడంతో ఆ సరదాలు, సంతోషాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మూడు నెలల్లో కేజీ రూ.110 నుంచి రూ.200లకు చేరుకుంది. దీంతో ప్రతివారం చికెన్ తెచ్చుకునేవారు మధ్యమధ్యలో మానేస్తున్నారు. మరికొందరు కేజీ తెచ్చుకునేకాడ అరకేజీ తెచ్చుకుని సరిపెట్టుకుంటున్నారు. మరికొందరు ప్రత్యామ్నాయంగా చేపలు తెచ్చుకుంటున్నారు. ధర్మవరం టౌన్: నియోజకవర్గంలోని ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో 300కు పైగా చికెన్« దుకాణాలున్నాయి. సగటున ఒక్కో దుకాణంలో రోజూ వంద నుంచి 500 కేజీల వరకు చికెన్ విక్రయించేవారు. అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దీనికితోడు రవాణా ఖర్చులు, దాణా, కోళ్లఫారం నిర్వహణ వ్యయం పెరుగుతూ వస్తోంది. ఫలితంగా కోళ్ల పెంపకం చేపట్టిన బడా కంపెనీలు నష్టపోయాయి. ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో ఆ నష్టాలను పూడ్చుకునేందుకు వారంతా సిండికేట్‌గా ఏర్పడి కోళ్ల ధరలను పెంచేస్తున్నారని, అందుకుగానూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రంగంలోకి కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేయడం చిన్నచిన్న కోళ్లఫారాలు నిర్వహించడం కష్టమైపోయింది. దీంతో బడా కంపెనీలు నిర్ణయించినదే రేటుగా మారింది. ఈ నెల మొదటివారంలో కేజీ రూ.130లుగా ఉండే చికెన్ ధర ప్రస్తుతం కొండెక్కి రూ.200లకు చేరుకోవడంతో పేదప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ధర్మవరంలో చేనేత కార్మికులు సరసమైన ధరలకు లభించే చికెన్‌పై ఎక్కువ మక్కువ చూపేవారు. కానీ ఇప్పుడు అది కూడా అందుబాటు ధరల్లో లభించడం లేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కోళ్లఫారం నిర్వాహకులకు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారానైనా ధరలను నియంత్రించాలని మాంసాహార ప్రియులు కోరుతున్నారు. -
ధర కొక్కొరొకో
షాకిస్తున్న చికెన్ ధరలు కిలో రూ. 200 నుంచి రూ. 220 ఉత్పత్తి తగ్గడమే కారణం తణుకు, తణుకు అర్బన్: మార్కెట్లో బ్రాయిలర్ కోడి చరిత్ర సృష్టిస్తోంది. ధర చుక్కలను తాకుతోంది. నాలుగు రోజుల క్రితం వరకు చికెన్ స్కిన్‌తో రూ. 140, స్కిన్లెస్ రూ. 160 సాగిన అమ్మకాలు ప్రస్తుతం స్కిన్లెస్ రూ. 200 లకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వేసవిలో ధర తగ్గే చికెన్ ఈసారి కూడా వేసవి మొదట్లో స్కిన్‌తో రూ. 80, స్కిన్లెస్ రూ. 98 అమ్మకాలు జరిగాయి. వేసవి వడగాడ్పులు తీవ్రంగా ఉండడంతో కోళ్లు చనిపోయి సరుకు తగ్గిపోయింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వచ్చిన బర్డ్‌ఫ్లూ కారణంగా కూడా తక్కువ ధర పలికింది. అనూహ్యంగా సరుకు ఉత్పత్తిలేక వేసవి మధ్యలోనే ఈ సంవత్సరం ధర పెరిగింది. కానీ ముగింపు దశలో మాత్రం కొనుగోలుకు తగ్గ సరుకు లేకపోవడంతో అధిక ధరలకు కొనుగోలు చేసి అమ్మాల్సిన పరిస్థితులు వచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కోడి లైవ్ ధర రూ. 110 నుంచి రూ. 120 వరకు పలుకుతుంది. కొన్ని దుకాణాల్లో స్కిన్లెస్ రూ. 200లకు అమ్ముతుండగా మరికొన్ని దుకాణాల్లో రూ.220 లకు అమ్ముతున్నారు. రెండు కేజీల్లోపే ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న కోళ్లు 1800 గ్రాముల నుంచి రెండు కేజీల్లోపు మాత్రమే ఉంటున్నాయి. వేసవిలో వడగాడ్పుల తాకిడికి కోళ్లు చనిపోవడం, ఇతర రాష్ట్రాల్లో వచ్చిన బర్డ్‌ఫ్లూ వ్యాధి కారణంగా సేల్స్ తగ్గడం సరుకు ఉత్పత్తి పడిపోవడం వంటి కారణాలతో ఇటీవలే కొత్తగా వేసిన కోళ్లు కావడంతో బరువు తక్కువగానే ఉంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్థానికంగా కోళ్లు దొరక్కపోవడంతో ఏలూరులోని కొన్ని కంపెనీల నుంచి సరుకు దిగుమతి చేసుకుంటున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. దిగాలు పడ్డ చికెన్ ప్రియులు రెండు రోజులుగా చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసాహార ప్రియులు దిగాలు పడ్డారు. నాణ్యమైన మటన్ రూ. కేజీ రూ. 600 పలుకుతుండడంతో వేసవి మొదటి నుంచి ఎక్కువ మంది చికెన్ కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. కానీ చికెన్ ధర లు సైతం ప్రస్తుతం కొండెక్కడంతో దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. చికెన్ ధరలు రెండు రోజులుగా పెరగడంతో హోటల్స్‌లో సైతం మోతాదు తగ్గించి వడ్డిస్తున్నారని మాంసాహారులు అంటున్నారు.