![Lakhs of chicken die,bird flu suspected](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/chicken.jpg.webp?itok=fxZmkrJf)
సాక్షి,హైదరాబాద్ : ముక్క ముట్టందే ముద్ద దిగడం లేదా? అయితే తస్మాత్ జాగ్రత్త. అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కోళ్లకు అంతు చిక్కని వైరస్ ప్రభలింది. ఫలితంగా వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. కోళ్లకు సోకుతున్న అంతుచిక్కిన వైరస్ పట్ల అప్రత్తంగా ఉండాలని రాష్ట్రాల్ని అలెర్ట్ చేసింది.
ఈ తరుణంలో కేంద్రం ఆదేశాలతో తెలంగాణ పశు సంవర్థక శాఖ అప్రమత్తమైంది. పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనారోగ్యంతో వైరస్ సోకిన కోళ్ళను దూరంగా పూడ్చిపెట్టలని సూచించింది. వైరస్ సోకిన కోళ్ళ తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
మరోవైపు, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ గ్రామంలో ఆదివారం అంతుచిక్కని వ్యాధితో వేలాది కోళ్లు మృతి చెందాయి. ఇప్పటికే తిర్మలాపూర్, బీర్కూర్ మండలంలోని చించోలి, కిస్టాపూర్ ఫారాల్లో 6వేలకు పైగా బాయిలర్ కోళ్లు మృతి చెందడంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment