chicken price
-
చికెన్ ధరపై ‘శ్రావణం’ ఎఫెక్ట్.. కిలో రూ.158
నల్లగొండ టౌన్ : రెండు నెలలుగా కొండెక్కిని చికెన్ ధర కాస్తా తగ్గుముఖం పట్టింది. గత నెలలో కిలో చికెన్ రూ.280 వరకు పలికింది. సామాన్యులు చికెన్ రేటు చూసి తినలేక దూరంగా ఉన్నారు. శుభకార్యాలు, ఇతర పంక్షన్లు, అత్యవసరం అయితే తప్ప చికెన్ తీసుకోలేదు. ఇలా 45 రోజులపాటు చికెన్ రేటు చుక్కలు చూపించింది. కానీ, ఈ నెల మొదటి వారం నుంచి చికెన్ ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఈ నెల 5న కిలో రూ.180 ఉన్న చికెన్ ధర, 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి పడిపోయింది. 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం ముఖ్యంగా ఈ మాసంలో పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలకు ఎక్కువగా ఉంటాయి. మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి తేనివ్వరు. దీంతో చికెన్ వినియోగం తగ్గి ధరలు కూడా తగ్గాయి. మరోవైపు రేటు తగ్గడంతో కొందరు మాంసం ప్రియులు సంతోషంగా చికెన్ తీసుకుంటున్నారు.రేటు మళ్లీ పెరుగుతుందిప్రస్తుతం శ్రావణమాసం కావడం, ఇతర పూజలు ఉన్నందున చికెన్ ధర రూ.150కి తగ్గింది. గత నెలలో రూ.280 వరకు ఉంది. ఈ నెలలో వివాహాలు, శుభాకార్యాలు ఉన్నందున చికెన్ ధర పెరిగే అవకాశం ఉంది. – శ్రీశైలం, చికెన్ సెంటర్ యజమాని -
దిగొచ్చిన చికెన్ ధరలు.. కిలో 155 రూపాయలు
నల్లగొండ టౌన్: చికెన్ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ స్కిన్‌తో రూ.155 ధర పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర (స్కిన్‌తో) రూ.270 నుంచి రూ.285పైగా పలికింది. అప్పుడు సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడం, అయ్యప్పమాలలు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తున్న నేపథ్యంలో చికెన్ వాడకం సగానికి సగం పడిపోయింది. దీంతో చికెన్ ధర కూడా తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే కోళ్ల ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడంతో కోళ్ల పెంపకందారులు నష్టాలపాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ పార్టీల నేతలు విందులు చేసే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందన్న చికెన్ సెంటర్ నిర్వాహకులు భావిస్తున్నారు. చికెన్ ధర ఇలా.. (కిలో రూ.లలో..) నెలక్రితం ప్రస్తుతం విత్ స్కిన్ 285 155 స్కిన్ లెస్ 310 180 కార్తీక మాసం కావడంతో ధర తగ్గింది ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో మహిళలు చాలా వరకు చికెన్ ముట్టరు. దీంతో చికెన్ కొనేవారు సగానికి సగం తగ్గడంతో చికెన్ రేటు కూడా పడిపోయింది. నెల క్రితం కిలో రూ.285 వరకు ఉన్న చికెన్ నేడు రూ.155 మాత్రమే అమ్ముతున్నాము. ఎన్నికలు ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. –నాగయ్య, చికెన్‌సెంటర్ యజమాని, నల్లగొండ -
రేటు.. సిండికేటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విశాఖలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220, విజయనగరం జిల్లాలో కిలో రూ.220.. కానీ మన జిల్లాలో మాత్రం కిలో రూ.275కు విక్రయిస్తున్నారు. పక్కపక్క జిల్లాల్లో ఇంత వ్యత్యాసం చూసి కొనుగోలుదారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కోవిడ్ కాలం నుంచి దాదాపు ఇదే పరిస్థితి. పత్రికల్లో రేట్లు ప్రచురితమవుతున్నా.. బహిరంగంగానే ఈ మోసం జరుగుతోంది. జిల్లాలో సిండికేట్ దందా నడుస్తుందేమోనన్న అనుమానాలు కూడా జనాల్లో కలుగుతున్నా యి. జిల్లాలో మాంసం ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పటి నుంచి గుడ్లు, పాలు, మాంసం తినడం ఎక్కువైంది. దీనికి తోడు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటల్ భోజనాలు విపరీతంగా పెరిగాయి. వీటిని అదనుగా తీసుకుని సంబంధిత వ్యాపారులు సిండికేటై ధరలు పెంచుకుంటూ పోతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రమంతా ధరలు ఏ రోజుకారోజు మారుతున్నా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ధరలు తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం శ్రీకాకుళం బాయిలర్ అసోసియేషన్ ఏ ధర నిర్ణయిస్తే ఆ ధరకే రిటైల్ వ్యాపారులు అమ్మకాలు చేయడమే. పర్యవేక్షణ లేకపోవడం వల్లేనా.. చికెన్, గుడ్లు ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్ శాఖ అఽధికారులకు లేకపోవడంతో పరిస్థితి హద్దు మీరుతోంది. జిల్లాలోని రణస్ధలం, కోష్ట, పాలకొండ, కొల్లివలస,రాజాం, కోటబొమ్మాళి, గార, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. అందుబాటులో భారీగా కోళ్లు దొరుకుతున్నా ఇక్కడెందుకు మిగతా జిల్లాలతో పోలిస్తే చికెన్ ధరలు భారీగా ఉంటున్నాయని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుత ధర ప్రకారం జిల్లాలో రోజుకు రూ.4కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కో కిలోకు మిగతా జిల్లాలతో పోలిస్తే రూ. 50కు పైగా తేడా ఉండటంతో ఇక్కడ కొనుగోలు దారులు ఎంత అదనపు భారం మోస్తున్నారో లెక్క కట్టుకోవచ్చు. ఇదే విషయమై జిల్లా బాయిలర్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న వెంకటేష్ అనే వ్యక్తిని ‘సాక్షి’ సంప్రదించగా ‘మాకున్న ఇబ్బందు లు మాకు ఉన్నాయి. మిగతా జిల్లాల పరిస్థితి వేరు. ఇక్కడ వేరు. అందుకనే ధర తేడా ఉంటుంది. పేపర్ రేటుకు, వాస్తవ ధరకు తేడా ఉంటుంది. బల్క్‌లో కొనుగోలు చేస్తే ఆ రేటు ఇంకా తగ్గుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. వ్యాపారాలు చేయలేకపోతున్నాం పక్క జిల్లాల్లో లేని ధరలు శ్రీకాకుళంలోనే ఉంటున్నా యి. కరోనా తర్వాత అమాంతంగా రూ.70కి పైగా పెంచేశారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు రోజుకి 400 కేజీలు అమ్మకాలు చేసేవాళ్లం. ధరలు పెరిగిపోవడంతో రోజుకి 200కేజీలు అమ్మడం కూడా కష్టమైపోతోంది. ఎందుకిలా ధరలు ఎక్కువగా ఉన్నా యని ప్రశ్నిస్తే వ్యాపారానికి కావాల్సిన చికెన్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. – వై.రాజు, చికెన్ వ్యాపారి, బలగ నియంత్రణ మా చేతుల్లో లేదు చికెన్, గుడ్లు ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు. వ్యాధుల నియంత్రణకు ముంద స్తు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత నివారణ చర్యలు మాత్రమే మేం చేపడతాం. ధరలు పెంచడం, నియంత్రించడంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. విశాఖ, విజయనగరంల్లో ఏవిధంగా ధరలున్నాయో శ్రీకాకుళంలో కూడా అలాగే ఉండాలి. పౌల్ట్రీవ్యాపారులు సిండికేటుగా మారి ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేసి నియంత్రణకు చర్యలు చేపడితే బాగుంటుంది. – డాక్టర్ పొట్నూరు సూర్యం, ఇన్చార్జ్ జేడీ, పశుసంవర్ధకశాఖ, శ్రీకాకుళం. ధరలు పెంచుకుంటూ పోతున్నారు చికెన్ ధరలను ఇష్టం వచ్చి నట్లు పెంచుకుంటూ పోతున్నారు. కరోనాకు ముందు కిలో రూ.100కే దొరికేది. ఇప్పుడు మాత్రం రూ.275 ఉండటం దారుణం. ఆదివారం చికెన్ తిందామంటే ఒక్కోసారి రూ.300 మార్కు దాటిపోతోంది. – ఆర్.యుగంధర్, కొనుగోలుదారుడు, గూనపాలెం, శ్రీకాకుళం. దాబాలు నడపలేకపోతున్నాం దాదాపుగా చికెన్ ఫుడ్ ఐటమ్స్ కోసం దాబాలకు అధికంగా వస్తుంటారు. కానీ చికెన్ ధరలు విశాఖ, విజయనగరం కంటే ఎక్కువగా ఉండడంతో నష్టాల బారిన పడుతున్నాం. కిలో రూ.275కు కొనుగోలు చేసి దాబాలు నడపాలంటే కష్టం. అలాగని రేటు పెంచితే కస్టమర్లు రారు. ఇటీవల కాలంలో దాదాపుగా శ్రీకాకుళం సిద్దిపేటరోడ్డులో నాలుగు దాబాలు మూసేశారు. ధరల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలి. – పి.నవీన్, కేన్స్ స్పైసీదాబా, సిద్ధిపేట రోడ్డు, శ్రీకాకుళం. -
Chicken Price: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర కిలో 320
మండపేట : మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడే చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. రిటైల్ దుకాణాల వద్ద రూ.320 పలుకుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. కోడిపిల్లల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొత్తబ్యాచ్లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తగ్గడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సుమారు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆలమూరు, రాజానగరం, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే శ్రావణమాసం, వినాయక చవితి వేడుకలు, అయ్యప్ప దీక్షలు, కార్తికమాసంలో చికెన్ వినియోగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పండగల సమయాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని కొంతమేర తగ్గిస్తుంటారు. రూ.12 నుంచి రూ.50కు పెరిగిన కోడిపిల్ల ధర నెలన్నర రోజుల క్రితం రూ.12 ఉన్న కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.50కి చేరుకుంది. శ్రావణమాసంలో వినియోగం తగ్గుతుందని పలు హేచరీల్లోని బాయిలర్ కోళ్ల గుడ్లు ఉత్పత్తికి వినియోగించే పెరేంట్స్ కోళ్ల (బొంత కోళ్లు)ను షాపులకు అమ్మేశారు. గుడ్ల కొరతతో హేచరీల్లో కోడి పిల్లల ఉత్పత్తి తగ్గి వాటి ధర అమాంతం పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోడి మేత ధరలు, ఇతర నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో గిట్టుబాటు కాదని అధిక శాతం మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. స్థానికంగా లభ్యత తగ్గడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆయా కారణాలతో శ్రావణమాసంలో వినియోగం తగ్గినా ధర దిగి రాలేదంటున్నారు. శ్రావణమాసం మొదట్లో రూ.250 ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ధర, నెలాఖరు నాటికి రూ.350కు చేరింది. వినాయక చవితి నవరాత్ర ఉత్సవాల నేపథ్యంలో వినియోగం మరింత తగ్గనుండటంతో అక్కడక్కడా పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను మార్కెట్లోకి తెస్తున్నారు. ఫలితంగా నాలుగు రోజులుగా ధర స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. రిటైల్ దుకాణాల వద్ద స్కిన్లెస్ కిలో రూ.320, లైవ్ రూ.145 వరకు అమ్తుతున్నారు. కోడిపిల్ల ధర బాగా పెరిగిపోయింది కోడిపిల్ల ధర నెలన్నర రోజుల్లో రూ.12 నుంచి రూ.50కు పెరిగిపోయింది. ఆన్ సీజన్, కోడిపిల్ల ధరలకు జడిసి గిట్టుబాటు కాదని చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపించింది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర ఎక్కువగా ఉంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, మండపేట -
వామ్మో!.. కోడికూరను మించిపోయిన టమాటా ధరలు..
కూరగాయల ధరలు కుతకుతమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో.. దూరప్రాంతాల నుంచి రవాణా సౌకర్యానికి అంతరాయమేర్పడి దిగుమతి తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు, వరదలు ఉండగా సరుకులు రావడం లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న సరుకును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. రూ.500తో మార్కెట్‌కు కెళ్తే వారానికి సరిపడా రావడం లేదు. దిగిరాని ధరలు వంటకాల్లో టమాటాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఏ వంట చేయాలన్నా టమాటా తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ధరల పెరుగుదల సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టమాటా ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకు పెరిగిపోతూ వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి వరకు 100 నుంచి 150 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! టమాటా @200 కిలో టమాటా రూ.100 ఉండగానే జనాలు కొనేందుకు తంటాలు పడగా.. ఏకంగా రూ.200కు చేరగా ఇక కొనలేమంటూ వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.200పైనే పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమాటా వాడకాన్ని తగ్గించారు. అంతేగాక రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. టమాటా కంటే చికెన్ బెటర్ టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొన్నిచోట్ల టమాట కంటే చికెన్ ధరలు తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కేజీ చికెన్ ధర రూ.200(స్కిన్). రూ. 220(స్కిన్ లెస్)గా ఉంది.. రూ. 200 పెట్టి టమాటాలు కొనే బదులు చికెన్ కొనడమే బెటర్ అని చాలా మంది అంటున్నారు. నిత్యావసరాల ధరలకూ రెక్కలు.. రాష్ట్రంలో ఇటీవల వారంపాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రావాణా వ్యవస్థ కుదేలైంది. దీంతో ధరలు మరింత పెరిగాయి. కూరగాయల ధరలతోపాటు నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చాయి. రెక్కడితేగాని డొక్కాడని కూలీలు పొద్దంతా పని చేసి వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వర్షాల కారణంగా వారంరోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చదవండి: ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు! -
మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర
మండపేట: మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో స్కిన్లెస్ కిలో రూ.400కు చేరింది. నాలుగు నెలలుగా సరైన ధర లేక నష్టపోవడం, పెరిగిన నిర్వహణ వ్యయం, అధిక ఎండలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయడానికి కోళ్ల రైతులు వెనుకంజ వేస్తున్నారు. కోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో ధర పెరిగిపోతోంది. మాంసాహార ప్రియులు చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు మూడు లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. పెరిగిన ఖర్చులు అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎండలకు జడిసి వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు వెనకాడతారు. దీనికితోడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు స్కిన్లెస్ చికెన్ కిలో రూ. 200కు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మేత ధరలు గిట్టుబాటయ్యేలా లేకపోవడం కొత్త బ్యాచ్‌లు వేయకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. మొక్కజొన్న కిలో రూ.20 ఉండగా, సోయా రూ.50, అన్ని మేతలు మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.43 వరకు ఉంది. కోడిపిల్ల ధర రూ.26 నుంచి రూ.30 వరకు ఉంది. కోడిమేత, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకు వ్యయమవుతోందంటున్నారు. ఆయా కారణాలతో రెండు నెలలుగా అధికశాతం మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. సొంతంగా నిర్వహణ చేయలేక కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి ఇచ్చేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల లభ్యత లేకపోవడం, అధికశాతం ఫామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.400 వరకు అమ్మకాలు చేస్తుండగా, లేయర్ కోడి రూ.130 వరకు ఉంది. సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు పెరిగాక కోళ్లను మార్కెట్‌కు తరలిస్తుంటారు. కాగా 1.5 కిలో నుంచి 1.8 కిలో బరువున్న కోళ్లను అమ్మకాలు చేసేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరు వరకు ధర తగ్గకపోవచ్చని వ్యాపార వర్గాలంటున్నాయి. నష్టాలకు జడిసి జనవరి నుంచి ఏప్రిల్ వరకు గిట్టుబాటు ధర లేక కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఎండలకు జడిసి చాలామంది కొత్త బ్యాచ్‌లు వేయక ధర పెరిగిపోతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
తగ్గిన జీడి.. పెరిగిన కోడి
కాశీబుగ్గ/శ్రీకాకుళం: మార్కెట్లో జీడిపప్పు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ మార్కెట్లో సంక్షోభంతో జీడిపప్పు అమ్మకాలు వారం రోజులుగా గణనీయంగా పడిపోవడంతో పరిశ్రమదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలాస, ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సుమారు 400 జీడి పరిశ్రమలు ఉనఆనియ. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పు వాడకం తగ్గడంతో పాటు, మండుతున్న ఎండలు ధరల పతనానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రకం జీడి(గుడ్డు) ధర వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.150 వరకు తగ్గింది. వివిధ రకాల జీడిపప్పు, బద్ద, గుండ సుమారు రూ.75 వరకు తగ్గింది. ధరల తగ్గుముఖంపై పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్, పలాస ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం మాట్లాడుతూ ఏటా పెరిగే సమయంలో ఈసారి ధరలు తగ్గిపోయాయని చెప్పారు. కొండెక్కిన కోడి మాంసాహర ధరలు మాత్రలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే చికెన్ ధర రూ.80, గుడ్డు ధర రూపాయి, చేపలు ధర రకాలను పట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. వేసవి కాలంలో ఇలా ధరలు పెరగటం సాధారణమే అయినా ఈ ఏడాది పెరుగుదల విపరీతంగా ఉంది. వేసవిలో వ్యాధులు సోకుతాయన్న కారణంగా పౌల్ట్రీ యజమానులు సీజన్లో తక్కువగా కోళ్లను పెంచుతారు. ఫలితంగా ధర పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో కిలో నుంచి కిలోన్నర కోళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వాస్తవంగా పౌల్ట్రీ యజమానులు కోడి బరువు రెండు కిలోలు దాటిన తరువాత మాత్రమే విక్రయిస్తుంటారు. ఇప్పుడు కోళ్లకు డిమాండ్ పెరగటంతో కిలో కోళ్లనే విక్రయిస్తున్నారు. వీటి రుచి కూడా తగ్గుతోందని మాంసాహార ప్రియులు చెపుతున్నారు. -
Chicken Price : కొండెక్కిన కోడి.. కిలో ధర రూ.400
తూర్పు గోదావరి: బ్రాయిలర్ కోడి ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో మాంసాహార ప్రియులు ధరలు చూసి బెంబేలెత్తి పోతున్నారు. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారులకు పెరిగిన ధర మింగుడుపడటం లేదు. సాధారణంగా ప్రతి రోజూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 400 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల సరఫరా జరగుతుంది. కోళ్ల ఉత్పత్తి మందగించడంతో ఏర్పడిన కొరత దృష్ట్యా వారం రోజుల నుంచి తుని, రాజమహేంద్రవరం తణుకులోనున్న కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, రైతుల నుంచి కేవలం 250 టన్నుల వరకూ మాత్రమే సరఫరా జరగుతోంది. వేసవి ప్రభావం దృష్ట్యా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో పాటు ఎండ తీవ్రతను తట్టుకోలేక అనునిత్యం వేలాది కోళ్లు మృత్యువాత పడటం ఈ ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మూడు నెలల నుంచి చికెన్ ధరలు రూ.100 లోపే ఉండటంతో నష్టాలు తట్టుకోలేని రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతోపాటు వేసవి ప్రభావాన్ని ముందే ఊహించిన కొంతమంది కోళ్ల పెంపకాన్ని తగ్గించడంతో ఉత్పత్తి మందగించింది. కంపెనీల నుంచి స్థానిక హోల్‌సేల్ వ్యాపారులకు సరఫరా దారులు రూ.150 ధర నిర్ణయించగా, రిటైర్లకు రూ.165 వరకూ విక్రయిస్తున్నారు. చికెన్ ధర పెరిగినా తగ్గని విక్రయాలు బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.170 కాగా చికెన్ కేజీ రూ.300, బోన్‌లెస్ రూ. 400 వరకూ విక్రయిస్తున్నారు. కోళ్ల కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకూ మరో నెల రోజుల వరకూ ఇంచుమించు ఇదే ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం చికెన్ ధర ఆశాజనకంగా ఉండటంతో స్థానిక రైతులు వారం రోజుల నుంచి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లలో కేజీన్నర దాటిన వాటిని విక్రయించే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆ బ్రాయిలర్ కోళ్ల సరఫరా అంతంగా మాత్రంగానే ఉండటంతో చికెన్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. చికెన్ ధరలు పెరుగుతున్నా విక్రయాలు మాత్రం తగ్గడం లేదు. స్థానికంగా ఎండల నుంచి ఉపశమనాన్ని పొందే విధంగా చర్యలు తీసుకుని కోళ్ల పెంపకం సాగిస్తున్న చిన్నకారు రైతులకు మాత్రం ఈ ధర అమాంతం లాభాలు తెచ్చి పెడుతోంది. ఉష్ణోగ్రతల ప్రభావంతోనే చికెన్ ధర పెరిగింది వేసవి దృష్ట్యా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వేడిమిని తట్టుకోలేక కోళ్ల ఫారాల్లో రోజూ సరాసరి వందలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. పెరిగిన ధరలలోను రైతులు నష్టాలను చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలు జూన్ నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది. – బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల -
కొండెక్కిన కోడి ధరలు.. ఇంత ధరా? ఏం కొంటాం.. ఏం తింటాం!
ఎన్టీఆర్: కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో కోడి మాంసం ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పెరగటంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరను చూసి జేబులు పట్టుకుంటున్నారు. సహజంగానే వేసవిలో కోడి మాంసం ధరలు అధికంగా ఉంటాయి. ఈ సీజన్లో కోళ్లకు సోకే వ్యాధులతో కోళ్లు మృతి చెందటం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. దీని వలన ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ దఫా అనూహ్యంగా పెరిగిన కోడి రేట్లతో నాన్ వెజిటేరియన్లు ఏమి కొంటాము.. ఏమి తింటామని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో కిలో బాయిలర్ రూ.200 నుంచి రూ.210 వరకు ధర పలికింది. ఫారమ్ కోడి రూ.150 నుంచి రూ.170 వరకు ధర ఉంది. అలాంటిది ఈ వారం బాయిలెర్ మాంసం కిలో ధర రూ.280 నుంచి రూ.285 పలుకుతుంది. ఫారం కోడి కిలో మాంసం రూ.200 దాటింది. స్థానికంగా లభ్యత లేకనే... ఈ సీజన్లో సాధ్యమైనంత వరకు కోళ్లు తక్కువగా పెంచుతారు. కోతకు సిద్ధం కాగానే విక్రయిస్తుంటారు. ప్రసుత్తం జిల్లా వ్యాప్తంగా కిలో నుంచి కిలోంపావు కోళ్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయని దుకాణ దారులు చెబుతున్నారు. వినియోగదారులు చిన్న కోళ్లు కొనటానికి ఆసక్తి చూపక పోవంటతో అధిక బరువు ఉన్న కోళ్లను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, పశ్చిమగోదావరి, భీమవరం ప్రాంతాల నుంచి కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కోడి మాంసం ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. గుడ్డుదీ అదే దారి... కోడి మాంసంతో పాటు కోడి గుడ్డు ధర కూడా అదే రూట్లో పెరుగుతోంది. పది రోజుల క్రితం రూ.4 లోపు పలికిన గుడ్డు ధర ఈ వారం రూ.5 కు చేరింది. అట్ట కోడిగుడ్డు ధర రూ.120 పలకగా ధర ప్రస్తుతం రూ.150కు చేరింది. కోడి మాంసం, కోడి గుడ్లు ధరలు పెరగటంతో మాంసం ప్రియులు పెదవి విరుస్తున్నారు. -
పాక్‌లో కొండెక్కిన ధరలు.. చుక్కలు చూపిస్తున్న పాలు, పెట్రోల్, డీజిల్
ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్లో నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు భారీ ఎత్తున పెరిగాయి. లీటర్ పాల ధర 210 రూపాయలకు పెరిగింది. పాడి ఉత్పత్తులతోపాటు వంటనూనె, గ్యాస్, గోధుమలు వంటి నిత్యావసర సరకుల ధరలన్నీ కనీవినీ ఎరగనంతగా పెరిగి జనానికి చుక్కలు చూపుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పాక్ ప్రజలు అల్లాడిపోతున్నారు. చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు పాక్‌లో పెట్రోల్ ధరలు కూడా చారిత్రలో తొలిసారి గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 22 రూపాయలు పెంచడంతో ప్రస్తుతం ధర రూ. 272కు చేరింది. అంతేగాక డీజిల్‌పై 17.20 రూపాయలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.280కి పెరిగింది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగంపేర్కొంది. కాగా ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న పౌరులపై మరింత భారాన్ని మోపింది. రికార్డు స్థాయిలో చికెన్ ధరలు పాకిస్తాన్లో కిలో కోడి మాంసం ఏకంగా 780 రూపాయలైంది! బోన్‌లెస్ అయితే రూ.1,100కు చేరుకుంది. కిలో కోడి ధర రూ. 490లుగా ఉంది. దేశ చరిత్రలోనే చికెన్ ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. కొన్నాళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి శ్రీలంకను తలపిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ మారక నిల్వలు 1998 ఏడాది తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. చదవండి: హిండెన్‌బర్గ్ ఆరోపణలు.. ‘అదానీ’పై మరో కేసు -
ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో చికెన్ ధర ఆకాశన్నంటింది. కరాచీ సహా ఇతర నగరాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ రేటు రికార్డు స్థాయిలో పెరగడానికి పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే ప్రాధన కారణమని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కోళ్ల ఫీడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని చెప్పింది. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720గా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండి, సహా ఇతర నగరాల్లో ఈ ధర రూ.700-705గా ఉంది. పాకిస్తాన్లో రెండో పాపులర్ సిటీ అయిన లాహోర్‌లో కేజీ చికెన్‌ను రూ.550-600 మధ్య విక్రయిస్తున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా చికెన్‌ను తినలేకపోతున్నామని చెబుతున్నారు. విచారణ కోళ్లకు అందించే ఫీడ్‌కు కొరత ఎందుకు ఏర్పడిందనే విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. చికెన్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. దాని సరఫరా గొలుసుకు ఏవైనా అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పాక్ మీడియా పేర్కొంది. చదవండి: టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు.. -
ఇష్టారాజ్యంగా చికెన్ విక్రయాలు ఊరికో ధర..!
‘కోతిరాంపూర్‌కు చెందిన మల్లేశం బంధువులొచ్చారని చికెన్ కొందామని మార్కెట్‌కు వెళ్లాడు. పేపర్ ధర ప్రకారం జనరల్ కిలో కోడి ధర రూ.94 ఉండగా రూ.130కి విక్రయించారు. స్కిన్లెస్ కిలో రూ.155 కాగా రూ.200లు వసూలు చేశారు. కిలో కోడికి రూ.30కి పైగా వసూలు చేస్తుండగా చికెన్‌కు రూ.40కి పైగా అదనంగా తీసుకుంటున్నారు. పేపర్ రేట్లో తక్కువ ఉందంటే గిట్టుబాటు కాదని చికెన్ సెంటర్ యజమాని సమాధానం చెప్పారు. నగరంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ అదనం. ఇది ఒక్క రాజు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా చికెన్ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి.’ కరీంనగర్ అర్బన్: కోడి కూర.. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. చుట్టాలు వచ్చిన.. శుభకార్యమైనా.. విషాధమైనా ముక్కలు ఉడకాలి సందే.. జిల్లాలో నిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్ విక్రయమవుతుండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. కాగా చికెన్ ధరలు భారీగా పడిపోగా చికెన్ సెంటర్లలో దోపిడీ మాత్రం ఆగడం లేదు. పేరుకు పేపర్ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.5.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20కోట్లు దోచుకుంటున్నారు. ఈలెక్కన నెలకు రూ.36కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారు లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చికెన్ సెంటర్లు.. దళారులకే లాభం కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అ«ధికారం లేదు. హెచరీస్, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్, చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకడిది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా చికెన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. కోళ్లను 45–50 రోజుల పాటు పెంచిన రైతుకు మిగిలేది అరకొర కాగా ట్రేడర్లు, చికెన్ సెంటర్లు మాత్రం దండిగా దోచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారం రైతులు, వినియోగదారులపైనే భారం పడుతోంది. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు జిల్లాలో కోళ్ల ఫారంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో ల క్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం య జమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆ దాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు. కోళ్ల ఫారం యజమానుల పరిస్థితి దారుణం ట్రేడర్లు, చికెన్ సెంటర్ నిర్వాహకులు, హెచరీస్‌లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే య జమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 5వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హె æచరీస్లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 45–50 రోజులకు పెంచి వాటి ని సంరక్షించాలి. దాణాలో వాడే ముడి పదార్థాలపై ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈలోపే ఏదైనా వైరస్ వచ్చినా.. మరణించినా రైతుపైనే భారం. ఇవన్ని తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. చేసేది లేక మైనస్లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి ఆశించిన ప్రయోజనం లేదని ప్రభుత్వ నియంత్రణలో చేర్చాలని ఫారం యజమానులు కోరుతున్నారు. పౌల్ట్రీ మీట్ ఫెడరేషనే మార్గం ► కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ► ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. ► దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. ► ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్ ఫెడరేషన్ ఉండేది. ► కాలక్రమేణ ఫెడరేషన్ కనుమరుగైంది. ► నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన. పౌల్ట్రీ రంగాన్ని బతికించాలి కోళ్ల ఫారంతో పదేళ్లుగా ఉపాధి పొందుతున్న. ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువయ్యాయి. కంటికి రెప్పలా పిల్లలను కాపాడితే విక్రయించే సమయానికి ట్రేడర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఒకసారి కోళ్లు వేసిన వారు మళ్లీ వేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. – మహేందర్‌రెడ్డి, పౌల్ట్రీ ఫాం రైతు, మానకొండూరు మేమేం చేయలేం కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవు.– డా.బండారి నరేందర్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి -
జూన్ 1 నుంచి కోళ్ల ఎగుమతులు బంద్.. చికెన్ కోసం జనం క్యూ!
సింగపూర్: మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భగ్గుమనేలా ఉన్నాయి. ఈనేపథ్యంలో జనం చికెన్ కోసం సూపర్మార్కెట్లు, మాంసం దుకాణాలకు పోటెత్తారు. రేపటి నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఇదే అదనుగా మాంస ప్రియులు పెద్ద మొత్తాల్లో కోడి మాంసాన్ని కొనుగోలు చేశారు. దీంతో చాలా మాంసం కొట్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. జూన్ 1 నుంచి మలేసియా చికెన్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ఈ పరిస్థితి తలెత్తిత్తింది. స్వదేశంలో కోడి మాంసం డిమాండ్, సరఫరా చైన్‌ను స్థిరీకరించేందుకు మలేసియా ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు 3.6 మిలియన్ కోళ్ల ఎగుమతిని నిలుపుదల చేస్తున్నామని గతవారం ప్రధాని ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్ తెలిపారు. దేశంలో చికెన్ సరఫరా పెంచి ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చదవండి👉 కారులో వెళ్తున్న ప్రధాని మోదీ.. యువతి చేతిలో ఆ ఫోటో చూడగానే.. ఒక్కసారిగా మలేసియా పౌల్ట్రీపైనే సింగపూర్ చికెన్ వ్యాపారం మూడోవంతు ఆధారపడి ఉంది. ఇక మలేసియా నిర్ణయంతో సింగపూర్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 30 శాతం వరకు రేట్లు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో జనం మాంసం దుకాణాలకు క్యూ కట్టారు. మరోవైపు కోడి మాంసం సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని సింగపూర్ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. చికెన్ ప్రత్యామ్నాయ మాంసంవైపునకు కూడా మళ్లాలని ప్రజలకు సూచించింది. చదవండి👉ఒక్క అడుగు అటువైపు వేసిఉంటే నుజ్జునుజ్జు అయ్యేవాడే.. భయంగొలిపే వీడియో! -
చికెన్ ధర రూ.300 దాటినా అదే తీరు.. ఇలా అయితే కష్టమే! బ్రాయిలర్ లాక్డౌన్?
ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కార్పొరేట్ కంపెనీలపై కోళ్ల పెంపకం రైతులు కన్నెర్ర చేస్తున్నారు. గ్రోయింగ్ చార్జీలు పెంచాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. కంపెనీలతో అమీతుమీ తేల్చుకునేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని నిలుపుదల చేసి, లాక్డౌన్ చేపట్టాలని ఈనెల 18న కామవరపుకోటలో జరిగిన సమావేశంలో రైతులు నిర్ణయించారు. ఏలూ రు జిల్లా ద్వారకాతిరుమల మండల రైతులు మా త్రం ఆ రోజు నుంచే లాక్డౌన్ చేపట్టి, కంపెనీలపై యుద్ధం ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను రూపొందించేందుకు బ్రాయిలర్ రైతుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జిల్లా అన్నవరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. చదవండి👉🏼 రైతు బజార్లో టమాట పంపిణీ ప్రారంభం మార్కెట్‌పై పట్టు సాధించి.. గతంలో రైతులు సొంత ఖర్చుతో స్వయంగా కోళ్లను పెంచి, మార్కెట్లో హోల్‌సేల్‌గా అమ్ముకునేవారు. క్రమంగా ఈ వ్యాపారంలోకి కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించాయి. కోడి పిల్లలను, దాణాను, మందులను రైతులకు అందించి, వాటిని పెంచినందుకు కిలోకు రూ.4.50 గ్రోయింగ్ చార్జీగా చెల్లిస్తున్నాయి. మొదట్లో రైతు చెప్పిన ధరకు కోళ్లను కొని మార్కెటింగ్ చేసిన వ్యాపారులు, క్రమంగా మార్కెట్‌పై పట్టు సాధించి హేచరీలు, దాణా కంపెనీలతో కలిసిపోయాయి. కొన్ని హేచరీలు ఏకంగా కంపెనీలుగా మారాయి. వారి వద్ద కోడి పిల్లలు, దాణాను తీసుకుని, తిరిగి కోళ్లను వారికే అమ్మే పరిస్థితిని తెచ్చాయి. చికెన్ ధర రూ.300 దాటినా.. మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 దాటినా.. కోళ్లను పెంచే రైతులకు దక్కేది మాత్రం కిలోకు రూ.4.50 మాత్రమే. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ శక్తులు కోళ్ల పరిశ్రమలను గుప్పెట్లో పెట్టుకుని హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను శాసిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రోయింగ్ చార్జీలు పెంచకపోవడంతో, ఏటా వందలాది మంది రైతులు కోళ్ల పెంపకానికి స్వస్తి చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ విధించడంతో ఆ ప్రభావం మార్కెట్‌పై పడి, బ్రాయిలర్ కోళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు ఏపీలో లాక్డౌన్ చేపడితే కోళ్ల కొరతతో పాటు, చికెన్ ధర ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. చదవండి👉🏾 సేంద్రీయ సేద్యం.. రసాయన ఎరువులకు స్వస్తి కోట్లలో వ్యాపారం.. లక్షల మందికి జీవనాధారం రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. ఒక్కో బ్యాచ్ నుంచి దాదాపు 3.05 కోట్లకు పైగా కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వందల కోట్లలో జరుగుతున్న వ్యాపారంపై లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కూలీలు జీవనాధారాన్ని పొందుతున్నారు. కోడిపిల్ల వచ్చిన మొదటి రోజు నుంచి కూలీలు, వ్యాక్సిన్ల ఖర్చు, విద్యుత్ బిల్లులు, ఊక, కోళ్ల లిఫ్టింగ్ తదితర ఖర్చులన్నీ రైతే భరించాల్సి వస్తోంది. కోడి పిల్లలు, దాణా, మందులు, అడ్మినిస్ట్రేషన్ చార్జీల పేరుతో సంస్థ పెట్టిన ఖర్చులన్నీ లిఫ్టింగ్ సమయంలో లెక్కగడుతున్నారు. కోడి కేజీ బరువు పెరగడానికి రూ.95 మించి ఖర్చయితే ఆ భారాన్ని రైతుపైనే మోపుతున్నారు. ఖాళీగా ఫారాలు ద్వారకాతిరుమల మండలంలో మొత్తం 80 కోళ్ల ఫారాలకు గాను లాక్డౌన్ కారణంగా 70 ఫారాలు ఇప్పటికే మూతపడ్డాయి. మిగిలిన 10 ఫారాల్లోని కోళ్లను లిఫ్టింగ్ చేసిన తరువాత మూసివేస్తామని రైతులు చెబుతున్నారు. మూతపడ్డ కోళ్ల ఫారాల వద్ద అన్ని పరికరాలూ మూలనపడ్డాయి. పెట్టుబడులు కూడా రావడం లేదు బ్రాయిలర్ కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యాను. కార్పొరేట్ కంపెనీలు గత పదేళ్ల క్రితం నుంచి గ్రోయింగ్ చార్జీని పెంచలేదు. కూలీల ఖర్చులు, ఊక, విద్యుత్ బిల్లులు, రుణాలు, వడ్డీలు ఇతరత్రా ఖర్చులన్నీ విపరీతంగా పెరిగాయి. కంపెనీ వారు కిలోకి ఇచ్చే రూ.4.50 ఏ మూలకూ సరిపోవడం లేదు. – యలమర్తి రామకృష్ణ, రైతు, మెట్టగూడెం, ద్వారకాతిరుమల మండలం లాక్డౌన్ తప్పదు 10 వేల కోడి పిల్లల బ్యాచ్‌ను పెంచడానికి రైతుకు అయ్యే పెట్టుబడి రూ.1,72,600 అయితే కంపెనీ వారు ఇచ్చేది కేవలం రూ.94,050 మాత్రమే. అంటే ఒక బ్యాచ్‌కి రైతుకు రూ.78,550 నష్టం వస్తోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయించాం. గ్రోయింగ్ చార్జీని రూ.12కు పెంచడంతో పాటు మరో 17 డిమాండ్లను నెరవేర్చాలి. – చిలుకూరి ధర్మారావు, బ్రాయిలర్ రైతు సంఘం రాష్ట్ర సభ్యుడు, ద్వారకాతిరుమల చదవండి👇 క్వింటాల్ పసుపు రూ. 6,850 ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి -
Chicken Price Hike: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా?
సాక్షి, పార్వతీపురం: రోజురోజుకూ కోడి మాంసం ధర కొండెక్కుతోంది. వేసవి కాలం కావడంతో బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గింది. కొత్త పౌల్ట్రీలు ఏర్పాటు చేయకపోవడంతో ఉన్న పౌల్ట్రీల ద్వారానే కోళ్ల సరఫరా జరుగుతోంది. మరో వైపు జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్లు, పండగలు జరుగుతుండడంతో మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. సీజన్ కావడంతో డిమాండ్ ప్రస్తుతం చికెన్, మటన్ల విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకూ మాంసానికి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ నెలల్లో ఎక్కువగా గ్రామ దేవతల సంబరాలు, ఇంటి వారాలు, యానాళ్లు, అసిరితల్లి పండగలు వంటివి నిర్వహిస్తుంటారు. చికెన్, మటన్ వంటి వంటకాలను ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు. దీంతో ఏటా ఈ సమయంలో చికెన్ ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయి. గతంలో బ్రాయిలర్ కోడి చికెన్ ధర కిలో రూ. 220లు ఉండగా, ప్రస్తుతం రూ. 260 నుంచి రూ. 280 మధ్య పలుకుతోంది. మరో వైపు బ్రాయిలర్ కోడి లైవ్ కిలో ధర గతంలో రూ 140 నుంచి రూ.150 మధ్య ఉండేది. ఇప్పుడు రూ.180 నుంచి రూ. 200 మధ్య పలుకుతోంది. ఇవి కూడా చికెన్ దుకాణాల వద్ద పరిమితంగానే ఉంటున్నాయి. పౌల్ట్రీల నుంచి ఉత్పత్తులు లేకపోవడంతో కోళ్లకు డిమాండ్ పెరిగి, మాంసం ధర పైపైకి వెళ్తోంది. చదవండి👉🏾 గంగపుత్రులకు మరింత చేరువగా.. వేసవి ప్రభావం ప్రతి పౌల్ట్రీకి 4,500 నుంచి 7 వేల వరకు బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి కంపెనీలు పిల్లలను అందిస్తాయి. కొంతమంది సొంతంగా కొనుగోలు చేస్తారు. ఇవి 72 రోజుల వ్యవధిలో కిలోన్నర నుంచి రెండున్నర కిలోల వరకూ పెరుగుతాయి. వేసవికాలంలో వీటిని పెంచేందుకు పౌల్ట్రీల వద్ద షెడ్డులు కూల్‌గా ఉంచాలి. ఇందుకోసం డ్రిప్ విధానాన్ని అమలుచేసి షెడ్డులు తడుపుతుంటారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడం, వేడి గాలులు వీస్తుండడంతో బ్రాయిలర్ కోళ్లు అధికంగా చనిపోతుండడంతో దిగుబడి పూర్తిగా పడిపోతోంది. వీటికి తోడు కోడి మేత ధర పెరిగింది. బ్రాయిలర్ కోడికి ప్రధాన మేతగా పరిగణిస్తున్న సోయాబీన్ మేత కిలో రూ.102 నుంచి రూ.113 మధ్య ఉంది. గతంలో కిలో రూ. 60 ఉండేది. సాధారణ మొక్కజొన్న మేత కిలో రూ.13 లు నుంచి రూ.23కు ఎగబాకింది. చదవండి👉🏼 వినూత్న కేజ్ కల్చర్.. అద్భుత ప్యా‘కేజ్’ ఇతర ప్రాంతాల నుంచి.. జిల్లాలో దిగుబడి తక్కువ కావడంతో విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి జిల్లాకు బ్రాయిలర్ కోళ్లు దిగుమతి అవుతున్నాయి. రవాణా చార్జీలు అదనంగా ఉండడంతో కోళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నాటుకోడి కొనలేం బ్రాయిలర్ కోడి విషయం పక్కన పెడితే నాటుకోడి ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. నిత్యం జరిగే వారపు సంతలతో పాటు మార్కెట్లో కూడా నాటుకోళ్లు జిల్లాలో లభిస్తున్నాయి. కిలో బరువు తూగే కోడి ధర రూ. 400 దాటి 500 వరకూ పలుకుతోంది, నాటుకోడి మాంసం ధర కూడా కిలో రూ. 500 చొప్పున విక్రయిస్తున్నారు. పెరిగిన బ్రాయిలర్ చికెన్ ధర బ్రాయిలర్ కోడి మాంసం ధర మార్కెట్లో పెరిగింది. ప్రస్తుతం వేసవికావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గుతోంది. పౌల్ట్రీల వద్ద దిగుబడి పెద్దగా ఉండదు. ఈ రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి. పౌల్ట్రీ నిర్వాహకులకు గతేడాది ఈ సమయంలో నష్టం వచ్చింది. ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -ఎ.ఈశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
చుక్కల్లో ధరలు.. కిలో స్కిన్లెస్ చికెన్ రేటెంతో తెలుసా?
సాక్షి, కాకినాడ(మండపేట): రెండు నెలలుగా చికెన్ ధర దిగి రానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300 నుంచి రూ.320తో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలు కావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 వరకూ కోళ్లఫారాలు ఉన్నాయి. వీటిల్లో 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకూ పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోళ్ల మేత ధరలు గణనీయంగా పెరగడం వీటి పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. చదవండి: (అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే..) మొక్కజొన్న కిలో రూ.14 నుంచి రూ.25కు పెరగగా, సోయా రూ.40 నుంచి రూ.90కి పెరిగిపోయింది. అన్ని మేతలూ మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.30 నుంచి రూ.50 వరకూ పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ.35కు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుంది. ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకూ వ్యయమవుతోందని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధిక శాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడి పిల్లలను పెంచి, పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫారాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200 వరకూ ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300కు, లైవ్ కిలో రూ.100లనుంచి రూ.150కి చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350 వరకూ కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడూ లేనంతగా కోళ్ల మేత ధరలు, కోడి పిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంతో ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
కొండెక్కిన చికెన్ ధరలు.. షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను..
సాక్షి, ఖమ్మం: గత నెల రోజులుగా చికెన్ ధరలు కొండెక్కడంతో కొంతమంది దుండగలు రాత్రి సమయంలో కోళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. చికెన్ దుకాణం ముందు చిన్న షెడ్డులో దాచి ఉంచిన బాయిలర్ కోళ్లను తాళం పగలగొట్టి దొంగిలించుకుపోయిన సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది. వైరా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో బాలబోయిన వెంకన్న అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సాయికృష్ణ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చికెన్ సెంటర్లో ఎలాంటి దొంగతనాలు జరగకపోవటంతో ఎప్పటిలాగే షాపు ముందు ఉన్న దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి దుకాణంలో ఉన్న బాయిలర్ కోళ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం వచ్చిన షాపు యజమాని వెంకన్న ఇనుప జాలీలో ఉన్న కోళ్లు లేకపోవటంతో యజమాని బిత్తరపోయాడు. దీంతో వెంటనే సీసీ పుటేజ్ చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కాగా గత కొంతకాలంగా చికెన్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల చోరీకి పాల్పడి ఉండొచ్చని స్థానికులు తెలిపారు. చదవండి: వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి! -
కొండెక్కిన చికెన్ ధరలు.. రెండు నెలలైనా తగ్గని ధర.. గుడ్డుతోనే సరి!
సాక్షి, నారాయణఖేడ్: ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చికెన్ ముక్క లేకుండా ముగియదు. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యుడికి ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. రెండు నెలలుగా చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300లకు కిందకు దిగనంటోంది. గత నెల శ్రావణమాసంలో చికెన్ ధరలు తగ్గుతాయని ఆశించినా, కిలో రూ.260 రికార్డు ధర పలికింది. పెళ్లిళ్ల సీజన్‌తో ఈ ధర మరింత పైకి ఎగబాకింది. అనంతరం ధరలు తగ్గుతాయని ఆశించినా తగ్గడంలేదు. సాధారణ సమయంలో రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. మటన్ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది. తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్ వేసవి నుంచి చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా మాంసాహారం తినాలన్న ప్రచారంతో చాలా మంది డ్రైప్రూట్స్‌తో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డుతోనే సరి.. చాలామంది మాంసం ధరలు పెరగడంతో గుడ్డుతోనే సరిపెడుతున్నారు. ఓ వారం మాంసం కొనుగోలు చేస్తే మరో వారం గడ్డుతో కానిచ్చేస్తున్నారు. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. గుడ్లు ఒకటి రూ.4నుంచి రూ.4.50కు విక్రయించే వారు వీటి ధరలు కూడా పెరిగి రూ.6కు తగ్గనంటోంది. -
ఇక్కడ చికెన్ చీప్ గురూ!
సాక్షి, కామారెడ్డి: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎంత పోటీ పడినా, ధర విషయంలో మాత్రం కలిసే నిర్ణయిస్తాయి. వాళ్లు చెప్పిన ధరే చెల్లుబాటవుతుంది. రోజూ లైవ్ బర్డ్, డ్రెస్స్డ్ చికెన్, స్కిన్లెస్ చికెన్ ధరలను నిర్ణయించి పత్రికల ద్వారా వెల్లడిస్తారు. ఆ రేట్ల ప్రకారమే రాష్ట్రమంతటా విక్రయాలు జరుగుతాయి. కానీ కామారెడ్డి మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా ‘ఈ రోజు పేపర్ రేటుపై కిలోకు రూ. 30 తక్కువ’అన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో పాటు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. కిలో చికెన్ కొంటే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తుంటారు. రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గింపు.. కామారెడ్డి పట్టణంలో హోల్‌సెల్ చికెన్ సెంటర్లు దాదాపు 40 ఉండగా, రిటైల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. కామారెడ్డి మినహా మిగతా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్తే పత్రిక ధర ప్రకారమే చికెన్ విక్రయాలు సాగుతాయి. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా కొంత ఎక్కువకే అమ్ముతారు. కామారెడ్డిలోని చికెన్ వ్యాపారులు మాత్రం ధర తగ్గించుకుని విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గింపు ఇస్తున్నారు. కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న సిరిసిల్ల వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నాలుగైదేళ్లుగా ఇదే పోటీ.. కామారెడ్డి పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా ఈ పోటీ నెలకొంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిన చికెన్ వ్యాపారి.. తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితంగా అందించాడు. మరో వ్యాపారి పత్రిక ధరపై కిలోకు రూ.35 తక్కువ అన్న బోర్డు పెట్టాడు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల జిమ్మిక్కులతో చిరు వ్యాపారులు నలిగిపోతున్నారు. పెద్ద ఎత్తున అమ్మకాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఆర్డర్‌పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. కామారెడ్డికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా చికెన్ కోసం వస్తారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని సమీప గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరం ఉంటే కామారెడ్డికి వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. -
Chicken Prices: సగానికి తగ్గిన చికెన్ ధర!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ ప్రభావం చికెన్ ధరపై పడింది. కొద్దిరోజులుగా దీని ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం కిలో బ్రాయిలర్ కోడిమాంసం రూ.312కి చేరి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ చరిత్రలోనే చికెన్ అత్యధిక ధర పలకడం అదే తొలిసారి. అప్పట్లో మండుటెండలు, వడగాడ్పులతో పాటు ఫారాల్లో కోళ్ల కొరత ఏర్పడింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి చికెన్ ధర క్రమంగా క్షీణించడం మొదలైంది. రోజుకు రూ.5 నుంచి 10 చొప్పున తగ్గుతూ వచ్చి ఇప్పుడు కిలో రూ.160కి చేరింది. ప్రస్తుతం కొన్నిచోట్ల రూ.150కి కూడా చికెన్‌ను విక్రయిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో.. రెండు వారాల నుంచి కోవిడ్ విజృంభణ తీవ్రతరమవుతోంది. రోజూ కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. దీంతో జనం చికెన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వరకు చికెన్‌కు అధిక ధర లభిస్తుండడంతో రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని పెంచారు. అలా వేసిన బ్యాచ్‌లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకున్నాయి. ఈ బరువుకు మించి పెంపకాన్ని కొనసాగిస్తే రైతుకు నష్టం వాటిల్లుతుంది. రోజూ మేత ఖర్చు పెనుభారంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత బరువుకు పెరిగిన కోళ్లను తెగనమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగానికి మించి కోళ్ల లభ్యత పెరగడంతో చికెన్ ధర క్షీణిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆగిన కోళ్లు.. మరోవైపు హైదరాబాద్‌లో ధర ఒకింత తక్కువగా ఉండడం అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు బ్రాయిలర్ కోళ్లను తీసుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కోళ్లే ధర లేక అమ్ముడవకపోవడంతో అక్కడ నుంచి కొనుగోలు చేయడం లేదని బ్రాయిలర్ కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు. ఏడాదిగా పడుతూ.. లేస్తూ.. ► దాదాపు ఏడాది నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదొడుకులకు లోనవుతోంది. కోడి ధర కొన్నాళ్లు పెరుగుతూ, మరికొన్నాళ్లు పతనమవుతూ వస్తోంది. ► వాస్తవానికి గత ఏడాది కోవిడ్ ఆరంభానికి ముందు వరకు చికెన్ రేటు కిలో రూ.270 వరకు ఉండేది. ► కోవిడ్ ఉద్ధృత రూపం దాల్చాక చికెన్ తింటే కరోనా సోకుతుందన్న దుష్ప్రచారంతో అప్పట్లో వినియోగం తగ్గింది. నాలుగైదు నెలల పాటు దీని ధర భారీగా పతనమై ఒకానొక దశలో మూడు కిలోలు రూ.100కి దిగజారింది. ► ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ గట్టెక్కడంతో మళ్లీ చికెన్ ధర పెరగడం మొదలైంది. ► ఇలా విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. అయితే బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో మళ్లీ చికెన్ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి పడిపోయింది. ఆ భయం నుంచి బయట పడి మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ► ఇలా ఫిబ్రవరి 23న రూ.200 ఉన్న ధర మార్చి 31కి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 6 రూ.312కి పెరిగింది. ► కాగా ప్రస్తుత చికెన్ ధరలు కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ చదవండి: Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు ‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట.. -
మండుతున్న మటన్, చికెన్ ధరలు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: మటన్, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలకు మటన్, చికెన్ వైపు మొగ్గు చూపుతుంటే దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెం చేస్తున్నారు. మరోవైపు చేపలు ధరలు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. డిసెంబర్లో కిలో చికెన్ ధర రూ. 120 నుంచి రూ. 180 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 270 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే ధర దా దాపు రెండింతలైంది. మటన్ మాత్రం షాపు నిర్వా హకులు ఇష్టానుసారంగా అమ్ముతున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.700 అమ్మితే.. కొందరు రూ. 750 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. బోన్ సెల్ అయి తే ఏకంగా రూ. 900 నుంచి 1000పైగా అమ్ముతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ కొంటే రెండు గుడ్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అలాగే గతంలో 10% నుంచి 20% డిస్కంట్ ఇచ్చేవారు.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలివే.. ►కరోనా సెకండ్ వేవ్ వస్తే ధరలు పడిపోతాయేమో అన్న భయంతో మూడు నెలల క్రితమే ఉన్న కోళ్లను చాలా మంది అమ్మేసుకోవడం. ► డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరగడం. ►పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతుండటం. చదవండి: చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం ఆదివారం నో బోర్డు.. మటన్ షాపు నిర్వహకులు నోటీసు బోర్డుపై ధరల పట్టి ఉంచుతారు. అయితే ఆదివారం మాత్రం బోర్డులో ధరలు ఉండటం లేదు. మటన్ ధరను ప్రభుత్వం కిలో రూ.700లకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో తనిఖీలు చేసి ఎక్కువ ధరకు అమ్మిన షాపులకు నోటీసులు, జరిమానాలు విధించినా కొందరు మారడం లేదు. ‘మేకలు, గొర్రెలు సప్లయ్ చాలా తక్కువగా ఉంది. అలాగే మటన్ ఎక్కువగా తింటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో కొంత మేరకు ధర పెరిగింది వాస్తవమే.’ – మటన్ షాపు నిర్వాహకులు చదవండి: సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క? -
చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం
సాక్షి, అమరావతి: చికెన్ ధర సరికొత్త రికార్డు సృష్టించింది. కిలో రూ.306కు చేరి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఇంతటి ధర దేశంలోనే ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాలులకు తోడు కోళ్ల కొరత వల్ల చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతేడాది కోవిడ్‌కు ముందు వరకు చికెన్ రేటు అధికంగానే (కిలో రూ.270 వరకు) ఉండేది. కోవిడ్ ఉధృత రూపం దాల్చిన తర్వాత వచ్చిన రూమర్స్‌తో నాలుగైదు నెలల పాటు చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. ఒకానొక దశలో మూడు కిలోల చికెన్‌ను రూ.100కే విక్రయించారు. ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ నెమ్మదిగా బయటపడింది. క్రమేపీ చికెన్ ధర పెరగడం మొదలైంది. విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో చికెన్ రేటు మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి దిగివచ్చింది. దాన్ని కూడా అధిగమించి.. చికెన్ ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 23న కిలో రూ.200 ఉన్న ధర.. మార్చి 31వ తేదీకి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 3న రూ.296కు పెరిగింది. తాజాగా ఆదివారం రికార్డు స్థాయిలో కిలో రూ.306కి చేరింది. కోళ్ల కొరత వల్లే.. కొన్నాళ్ల నుంచి బ్రాయిలర్ కోళ్లకు కొరత ఏర్పడింది. దీనికితోడు ఎండలు, వడగాలుల వల్ల కోళ్లు చనిపోతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా చికెన్ ధర పెరగడానికి ఇదే కారణం. ఈ స్థాయిలో ధర పెరగడం పౌల్ట్రీ చరిత్రలో ఇదే ప్రథమం. – కాజా వెంకటేశ్వరరావు (నాని), ప్రెసిడెంట్, అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఎండ దెబ్బ.. వేసవికాలంలో కోళ్ల ఎదుగుదల తగ్గుతుంది. మేత అధికంగా తింటే ఎండల ధాటికి తట్టుకోలేక చనిపోతాయని పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్లకు ఉదయం పూట మేత పెట్టరు. పైగా నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కోళ్లు సరిగ్గా తిండి కూడా తినలేవు. ఫలితంగా కోళ్లు ఎదుగుదల తగ్గి బరువు పెరగవు. అదే సమయంలో వడగాలులకు ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు 10 నుంచి 15 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. అలాగే ఏటా కోళ్ల విక్రయాల పెంపును దృష్టిలో ఉంచుకుని హ్యాచరీలు వారంపాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తాయి. ఆ సమయంలో పౌల్ట్రీలకు హ్యాచరీల వాళ్లు కోడి పిల్లలను విక్రయించరు. ఇలా నెల కిందట తెలుగు రాష్ట్రాల్లో క్రాప్ హాలిడే అమలు చేశారు. ఇవన్నీ వెరసి ఇప్పుడు డిమాండ్‌కు సరిపడినన్ని కోళ్లు లభ్యం కావడం లేదు. ఫలితంగా చికెన్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మరో రెండు వారాలకు కోళ్ల లభ్యత పెరుగుతుందని, ఆ తర్వాత చికెన్ ధర దిగివస్తుందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. -
కోడికూర కిలో రూ.30; ఎగబడి కొంటున్న ప్రజలు
సాక్షి, కోడుమూరు: వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా చికెన్ ధరలు అమాంతం తగ్గించేశారు. గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో కిలో రూ.30లకే చికెన్ అమ్ముతున్న విషయం సంచలనమైంది. మంగళవారం కె.నాగలాపురంలో సుంకులమ్మ దేవర జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. చికెన్ కిలో రూ.30లకే అమ్ముతున్న విషయం తెలియడంతో కోడి కూర కోసం చికెన్ అంగళ్ల దగ్గర క్యూ కట్టారు. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ100లు పలుకుతోంది. హోల్‌సెల్ చికెన్ ధర వ్యాపారస్తులు రూ.46లకు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వాహిద్ అనే హోల్‌సెల్ వ్యాపారికి గూడూరులో కోళ్లఫారం ఉంది. సదరు వ్యక్తి దగ్గర వ్యాపారస్తులు కోళ్లను తీసుకోకపోతే ఆ గ్రామాల్లో పోటీగా వ్యాపారం పెట్టి ఇతరులను దెబ్బతీసే పనులు చేస్తున్నాడు. గతంలో ప్యాలకుర్తి గ్రామంలో కూడా ఇదే విధంగా చికెన్ వ్యాపారస్తుల మధ్య పోటీ పెట్టాడు. నాలుగైదు రోజులుగా కె.నాగలాపురంలో కిలో రూ.40లకే చికెన్ అమ్మేందుకు దుకాణం తెరిచాడు. సదరు పోటీదారుడిని దెబ్బతీసేందుకు గ్రామంలో చికెన్ వ్యాపారస్తులు కిలో రూ.30లకే చికెన్ అమ్మడం మొదలు పెట్టడంతో చికెన్ ప్రియుల పంట పండింది. పప్పన్నం మానేసి చికెన్ కూర తినేందుకు చికెన్ అంగళ్ల దగ్గర జనం క్యూ కడుతున్నారు. కిలో కూరగాయలు బీన్స్ రూ.60, బీరకాయలు రూ.30 ధర పలుకుతుండగా, కూరగాయలు తినడం మానేసి ఓ పూట కోడి కూర తినడం జనాలు అలవాటు చేసుకుంటున్నారు. కోడి గ్రుడ్ల ద్వారా డజను రూ.60లుండగా, అంతకంటే తక్కువగా కిలో చికెన్ రూ.30లకే వస్తోందని జనం కోడి కూర కోసం ఎగబడుతున్నారు. కె.నాగలాపురంలో మహమ్మద్‌బాషా అనే చికెన్ వ్యాపారి మంగళవారం నాడు దాదాపు 500కిలోలకు పైగా చికెన్ అమ్మినట్లు తెలిపాడు. పోటీ వ్యాపారంలో నిలదొక్కునేందుకు నష్టానికైనా వ్యాపారం చేస్తున్నామంటూ మహమ్మద్‌బాషా తెలిపారు. ఇద్దరు వ్యాపారుల మధ్య పెరిగిన పోటీ కారణంగా చికెన్ ప్రియులు కోడి కూరకు రుచి మరిగారు. -
అయ్యో! కోడికి ఎంత కష్టం వచ్చింది
సాక్షి, నాగిరెడ్డిపేట : కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ ధరలు ఆమాంతం తగ్గుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలు చికెన్‌కు దూరంగా ఉంటుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో సోమవారం జరిగిన వారాంతపు సంతలో 2కిలోల కోడిని రూ. 70కే విక్రయించారు. ఎల్లారెడ్డికి చెందిన కోళ్లఫారం యాజమాని ఒక ట్రాలీ ఆటోలో కోళ్లను తీసుకొచ్చి వారాంతపు సంతలో విక్రయించారు. తక్కువ ధరకు రావడంతో జనాలు కొనుగోలుకు ఆసక్తి చూపించారు. (ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) -
చికెన్.. డౌన్
చికెన్ ప్రియులకు శుభవార్త. ధరలు భారీగా తగ్గిపోయాయి. చలి తీవ్రత, ఆధ్యాత్మిక దీక్షల కాలం కావడం, ఉత్పత్తి భారీగా ఉండడం వంటి కారణాల వల్ల చికెన్ ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.150 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. లైవ్ ధర రూ.82–92 మధ్య ఉంది. గత వారం పది రోజుల క్రితం వరకు కూడా చికెన్ ధరలు కిలో రూ.220కి పైనే ఉండగా..ఇప్పుడు రూ.150కి తగ్గడం గమనార్హం. సాక్షి సిటీబ్యూరో: ఆదివారం వచ్చిందంటే చికెన్ ప్రియులకు కోడి కూర వండందే ముద్ద దిగదు. చికెన్ బిర్యాని, చికెన్ కరి ఉంటే చాలు లొట్టలేసుకుని రెండు ముద్దలు ఎక్కువగా ఆరగించేస్తారు. కానీ చలితీవ్రతతో పాటు అయ్యప్ప భక్తుల సీజన్‌కావడంతో నగర జనం చికెన్ వైపు ఆసక్తిచూపడడం లేదు. మరోవైపు డిమాండ్ కంటే కోళ్ల ఉత్పత్తి ఎక్కువ కావడం కూడా చికెన్ ధరలు విపరీతంగా పడిపోవడానికి ప్రధాన కారణం. గత వారం రోజుల్లో ఈ ఏడాదిలో అతి తక్కువ ధరలు నమోదయ్యాయి. లైవ్ చికెన్ హోల్‌సేల్ ధర కిలో రూ.82 నుంచి రూ. 92 మధ్య ఉంది. చికెన్ ధర కూడా విపరీతంగా తగ్గింది. కిలో చికెన్ రూ. 150 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ఉత్పత్తికి సరిపడా అమ్మకాలు లేకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. డిమాండ్ తక్కువ సరఫరా ఎక్కువ సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఇక నగర వ్యాప్తంగా లక్ష కిలోలకు అటు, ఇటుగానే విక్రయాలు సాగుతున్నాయి. ఇతర రోజులతో పోల్చితే వినియోగం సగానికి సగం తగ్గింది. పలు కోళ్ల ఫారం వ్యాపారులు ప్లానింగ్ చేసుకోని కోళ్లను పెంచుతారు. అయితే కోళ్ల విక్రయాల్లో దాదాపు 30 శాతం తగ్గడంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంకా తగ్గే అవకాశం శ్రావణ మాసం ముగియడంతో పాటు అయ్యప్ప దీక్షలు ప్రారంభ, చలి తీవ్రత నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో ఇతర రోజులతో పోల్చితే వినియోగం సగానికి సగం తగ్గింది. మాములు రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే గత వారంలో 30కిలోలు కూడా విక్రయించడం కష్టంగా మారిందని ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపాడు. ఆదివారం ఎప్పడైనా కనీసం 150 కిలో కంటే తగ్గకుండా విక్రయిస్తానని అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి చెప్పారు.