
సాక్షి, నాగిరెడ్డిపేట : కరోనా వైరస్ ప్రభావంతో చికెన్ ధరలు ఆమాంతం తగ్గుతున్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలు చికెన్‌కు దూరంగా ఉంటుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో సోమవారం జరిగిన వారాంతపు సంతలో 2కిలోల కోడిని రూ. 70కే విక్రయించారు. ఎల్లారెడ్డికి చెందిన కోళ్లఫారం యాజమాని ఒక ట్రాలీ ఆటోలో కోళ్లను తీసుకొచ్చి వారాంతపు సంతలో విక్రయించారు. తక్కువ ధరకు రావడంతో జనాలు కొనుగోలుకు ఆసక్తి చూపించారు. (ఇక క్షణాల్లో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment