కూరగాయల ధరలు కుతకుతమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో.. దూరప్రాంతాల నుంచి రవాణా సౌకర్యానికి అంతరాయమేర్పడి దిగుమతి తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు, వరదలు ఉండగా సరుకులు రావడం లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న సరుకును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. రూ.500తో మార్కెట్‌కు కెళ్తే వారానికి సరిపడా రావడం లేదు.
దిగిరాని ధరలు
వంటకాల్లో టమాటాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఏ వంట చేయాలన్నా టమాటా తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ధరల పెరుగుదల సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టమాటా ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకు పెరిగిపోతూ వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి వరకు 100 నుంచి 150 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది.
చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!
టమాటా @200
కిలో టమాటా రూ.100 ఉండగానే జనాలు కొనేందుకు తంటాలు పడగా.. ఏకంగా రూ.200కు చేరగా ఇక కొనలేమంటూ వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.200పైనే పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమాటా వాడకాన్ని తగ్గించారు. అంతేగాక రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.
టమాటా కంటే చికెన్ బెటర్
టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొన్నిచోట్ల టమాట కంటే చికెన్ ధరలు తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కేజీ చికెన్ ధర రూ.200(స్కిన్). రూ. 220(స్కిన్ లెస్)గా ఉంది.. రూ. 200 పెట్టి టమాటాలు కొనే బదులు చికెన్ కొనడమే బెటర్ అని చాలా మంది అంటున్నారు.
నిత్యావసరాల ధరలకూ రెక్కలు..
రాష్ట్రంలో ఇటీవల వారంపాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రావాణా వ్యవస్థ కుదేలైంది. దీంతో ధరలు మరింత పెరిగాయి. కూరగాయల ధరలతోపాటు నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చాయి. రెక్కడితేగాని డొక్కాడని కూలీలు పొద్దంతా పని చేసి వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వర్షాల కారణంగా వారంరోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
చదవండి: ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు!
Comments
Please login to add a commentAdd a comment