Vegetables prices
-
ఆకాశమే హద్దుగా.. 'ధరాభారం'
‘‘నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయాయా లేదా అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా.. బియ్యం రూ.55 అయిపోయింది.. కందిపప్పు 160.. వంట నూనె 120.. ఇలా కడాన ఇంటికి అదనంగా ఐదేళ్లలో రూ.8 లక్షల భారం పడింది. నా ఆడపడుచులందరికీ ఈ ఎనిమిది లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రీ?’’. మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊరూవాడా మైకు పట్టుకుని ఇలా హోరెత్తించారు. సీన్ కట్‌చేస్తే.. ఆయన సీఎం పీఠమెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి? నిజానికి.. ధరలు దిగిరావాలి. కానీ ఏం జరుగుతోంది? ఆకాశమే హద్దుగా పైపైకి పోతున్నాయి. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ జట్టు కట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ చోద్యం చూస్తూ సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయి. దీంతో.. ‘వాటిజ్ దిస్ బాబుగారు.. వీ ఆర్ ఆస్కింగ్ స్ట్రెయిట్ క్వశ్చన్’.. అని ప్రజలు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రంలో రోజురోజుకూ నింగినంటుతున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలను చూసి సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. మేలో ఉన్న ధరలతో పోలిస్తే కనీసం 30–100 శాతం మేర ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. రాష్ట్రంలో ధరలు జాతీయ సగటును మించిపోయాయి. కారణం.. ‘కూటమి’ పార్టీల్లాగే వ్యాపారులందరూ ఒక్కటయ్యారు. వరదలు, వర్షాల సాకుతో కూరగాయల వ్యాపారులు.. సుంకాలు పెరిగాయంటూ నిత్యావసరాల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అడ్డగోలుగా ధరలు పెంచేశారు. అయితే.. మార్కెట్‌ను నియంత్రించి, ధరలు అందుబాటులో ఉండేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలేవీ పట్టకుండా మద్యం, ఇసుక దందాలో మునిగితేలుతోంది. – సాక్షి, అమరావతి కాటేస్తున్న కూరగాయలు.. రిటైల్ మార్కెట్లో నాలుగు నెలల క్రితం కిలో రూ.28 ఉన్న టమోటాల ధర ప్రస్తుతం సెంచరీ దాటింది. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ వంటి ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లో రూ.100 నుంచి రూ.110 మధ్య పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో టమోటా ధరలు ఒక్కసారిగా వంద దాటిపోయాయి. ఆ సమయంలో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుల నుంచి ఓ దశలో కిలో రూ.150 చొప్పున సేకరించింది. ఇలా రూ.14.66కోట్లు వెచ్చించి రూ.1,364.55 టన్నుల టమోటాలు సేకరించి రూ.50 చొప్పున సబ్సిడీపై వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రస్తుతం అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఎంపిక చేసిన కొన్ని రైతుబజార్లలో మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా రూ.70కి పైగానే. ఇక కిలో రూ.25 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.70–80 వరకు విక్రయిస్తున్నారు. బంగాళదుంపలు మినహా మిగిలిన కూరగాయలన్నీ కిలో రూ.70 పైమాటగానే ఉన్నాయి. రూ.10కు దొరికే కొత్తిమీర కట్ట సైతం రూ.50–60 ఉంది. ఐదు కట్టలు రూ.20కు దొరికే ఆకుకూర ఏదైనాసరే కట్ట రూ.10కు తక్కువకు దొరకడంలేదు. పైగా.. కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి ఉంది. మొత్తం మీద రూ.150–200 పెడితే బ్యాగ్ నిండే కూరగాయల కోసం ఇప్పుడు రూ.500–600 పెట్టాల్సి వస్తోంది. మరుగుతున్న నూనె ధరలు.. కేంద్రం దిగుమతి సుంకం పెంచిందన్న సాకుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఫలితంగా దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వంట నూనెల ధరలూ విపరీతంగా పెరిగాయి. ప్రియా, ఫ్రీడం, రుచి ఇలా ప్రధాన బ్రాండ్ నూనెల ధరలన్నీ కిలోకి రూ.25–30 వరకు పెరిగిపోయాయి. దిగుమతి సుంకంతో సంబంధంలేని కొబ్బరి నూనె కిలోకి రూ.18, వేరుశనగ నూనెపై రూ.10, పూజాదికాలకు ఉపయోగించే నూనెలపై రూ.10 నుంచి రూ.30 చొప్పున పెంచేశారు. ప్రియా ఆయిల్స్ అయితే ఇతర బ్రాండ్ ధరల కంటే రూ.10 అదనంగా ఉన్నాయి. ధరలు పెంచిన తర్వాత మొక్కబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. ఆ తర్వాత పత్తా లేకుండాపోయారు. ఆ మూడింటి తర్వాత ఏపీలోనే పప్పుల ధరలు ఎక్కువ.. ఇక మేలో కిలో రూ.166.12 ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180–220 మధ్య ఉంది. పెసర పప్పు రూ.120.85 నుంచి రూ.139కి పెరిగింది. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత పప్పుల ధరలు ఏపీలోనే ఎక్కువ. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా కందిపప్పు కాదు కదా కనీసం అర కిలో పంచదార కూడా సక్రమంగా ఇవ్వలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో కిలోకి రూ.10–20 తగ్గించామని గొప్పలు చెబుతున్నప్పటికీ అవన్నీ నాసిరకం పప్పులే. గోధుమ పిండి సైతం కిలో రూ.45 నుంచి రూ.76కు పైగా పెరిగింది. బాబోయ్ బియ్యం.. మరోవైపు.. రోజువారీ మెనూలో ముఖ్యభూమిక పోషించే బియ్యం ధరలూ ప్రజలను వణికిస్తున్నాయి. పంజాబ్‌లో కిలో బియ్యం ధర రూ.39.58 మాత్రమే. కానీ, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రాలో మాత్రం వీటి ధరలకు అసాధారణంగా రెక్కలొస్తున్నాయి. సాధారణ రకం బియ్యమే ప్రస్తుతం కిలో రూ.57 ఉండగా, సూపర్ ఫైన్ బియ్యం (సోనా మసూరి, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు) కిలో రూ.65 నుంచి రూ.76కి పైనే పలుకుతున్నాయి. లూజ్ బాస్మతి బియ్యం కిలో రూ.119కి పైగా ఉంది. వాస్తవానికి బియ్యం రేట్లు సహజంగా పెరగట్లేదు. దేశవ్యాప్తంగా బియ్యం నిల్వలకూ లోటులేదు. కానీ, వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి బ్లాక్ చేస్తుండడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం ఎత్తేసింది. అలాగే, పారాబాయిల్డ్, బ్రౌన్ రైస్ ఎగుమతి సుంకాన్ని 20 నుంచి 10 శాతానికి తగ్గింది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి.ధరల స్థిరీకరణ నిధి ఏది.. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై వినియోగదారులకు విక్రయించేవారు. ఐదేళ్లలో రూ.18 కోట్ల విలువైన 8,460 టన్నుల టమోటాలను రైతుల నుంచి మార్కెట్ ధరకే కొనుగోలు చేసి సబ్సిడీపై కిలో రూ.50కే విక్రయించే వారు. అలాగే, రూ.69 కోట్ల విలువైన 94,335 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. ఇలా ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,758 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నులను 6.17 లక్షల మంది రైతుల నుంచి సేకరించారు. అలాగే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ప్యాకెట్ల రూపంలో కిలో రూ.11కే పంపిణీ చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అధికారులను అడిగితే బడ్జెట్లేదని తేల్చి చెప్పేస్తున్నారు. గడిచిన నెలరోజులుగా స్థానిక హోల్‌సేల్ మార్కెట్లో టమోటాలు సేకరించి రవాణా ఖర్చులు కలుపుకుని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కూరగాయలు కొందామంటే భయమేస్తోంది. టమోటా రూ.100 దాటిపోయింది. రైతుబజార్లలో కూడా కిలో రూ.75కు తక్కువగా ఇవ్వడంలేదు. పైగా ఎక్కడా సరుకు ఉండడంలేదు. బహిరంగ మార్కెట్లో ఉల్లి నుంచి కొత్తిమీర వరకు అన్ని ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, నూనె ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల నియంత్రణను ప్రభుత్వం గాలికొదిలేసినట్లుంది. – జే.సోమేశ్వరరావు, ప్రైవేటు ఉద్యోగి, విశాఖపట్నం ధరలను నియంత్రించాలి.. బహిరంగ మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. కిలో రూ.20–30లకు వచ్చే బెండ, వంకాయలకు సైతం నేడు రూ.కిలో రూ.80కు పైగా పెట్టాల్సి వస్తోంది. టమోటాలైతే కిలో రూ.100 దాటింది. రైతుబజార్లలో నాణ్యతలేనివి కిలో రూ.70కు పైగానే పలుకుతున్నాయి. – వన్నెంరెడ్డి సురేష్, విజయవాడ సబ్సిడీ ధరకే విక్రయించాలి.. గతంలో ఇలా టమోటాలు పెరిగినప్పుడు కిలో రూ.50లకే రైతుబజార్ల ద్వారా విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలేదు. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి అన్ని రైతుబజార్లలో కిలో రూ.50కే టమోటాలు సరఫరా చేయాలి. కూరగాయలతో పాటు నిత్యావసర ధరలనూ నియంత్రించాలి. – సీహెచ్ శివపార్వతి, కొల్లూరు, బాపట్ల ఇలా అయితే బతికేదెలా.. మార్కెట్లో కూరగాయలే కాదు.. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా విపరీతంగా పెరిగాయి. కిలో రూ.25–40 మధ్య దొరికే కూరగాయలు ప్రస్తుతం రూ.80కుపైగా పలుకుతున్నాయి. నూనెలు, బియ్యం ధరలూ అంతే. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది. – శ్రీలక్ష్మి, వెంగళాయపాలెం, గుంటూరు నూనె ధరలు పెరిగిపోయాయి.. ఆయిల్, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్స్ లీటర్‌కు రూ.25కు పైగా పెరిగాయి. పప్పుల ధరలు కూడా నాణ్యతను బట్టి కిలోకు రూ.30 వరకు పెరిగిపోయాయి. కూరగాయ ఏదైనాసరే రూ.80కి తక్కువలేదు. చికెన్ కూడా కిలో రూ.240 దాటిపోయింది. ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. – పి. దేవీకృష్ణవేణి, కాకినాడ -
నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలు
-
మండుతున్న కూరగాయల ధరలు..
సాక్షి, హైదరాబాద్: కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంత, కూరగాయల మార్కెట్.. ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయ చూసినా పావు కేజీ రూ.15 నుంచి రూ.20 పలుకుతోంది. సాగు నీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు రూ.20 నుంచి రూ.40 వరకు లభించేవి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో రూ.60–80 పలుకుతున్నాయి.గ్రేటర్‌కు కష్టాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. స్థానిక ప్రజల అవసరాలకు ఏడా దికి సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం ఉంటాయని అంచనా. నగర పరిసర ప్రాంతాలైన వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తున్నాయి. స్థానికంగా సుమారు 19 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 25 మెట్రిక్ టన్నులు వరకు కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆపై అవసరాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో సాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా చార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిపి మోపెడు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా నెల రోజుల క్రితం టమోటా కిలో రూ.15 ఉంటే ప్రస్తుతం రూ.40కి చేరింది. గతంలో పచి్చమిర్చి కిలో రూ.60 ఉండగా ఇప్పుడు రూ.120కి పెరిగింది.పావు కిలో రూ. 20కి అమ్ముతున్నారు..వారపు సంతలో కూరగాయలు ఏవి అడిగినా పావుకిలో రూ.15 నుంచి రూ.20 చెబుతున్నారు. నెల క్రితం వరకు కిలో టమాటా రూ.15 ఉండేది ప్రస్తుతం కిలో రూ.40కి అమ్ముతున్నారు. పచి్చమిర్చి పావు కిలో రూ.20కి దొరికేది. ప్రస్తుతం రూ.40కి అమ్ముతున్నారు. ఇలా అన్ని ధరలు పెరగడంతో తక్కువ కూరగాయలు కొనుగోలు చేస్తున్నాం. – అనిత, ఎల్.బి.నగర్.ధర ఉన్నా ఫలితం లేదు.. ఎకరన్నరలో కూరగాయలు సాగు చేస్తున్నా. వేసవి ఎండలకు బోర్లలో నీరు అడుగంటింది. సమయానికి నీటి తడులు అందక దిగుబడి తగ్గింది. మార్కెట్లో కూరగాయలకు మంచి ధర ఉన్నా దిగుబడులు లేకపోవడంతో ఫలితం లేకపోయింది. చేతి నిండా పంట ఉన్నపుడు ధర ఉండదు. – రైతు, చించల్పేట్, నవాబుపేట్ మండలంరొటేషన్ అయితే చాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలు తెస్తున్నాం. రవాణా చార్జీలు, హమాలీ, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు అన్నీ కలిపి తక్కువ లాభంతో అ మ్ముతున్నాం. ఒక్కోసారి వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పెట్టిన పెట్టుబడి డబ్బులు రొటేషన్ అయితే చాలు అనిపించిన రోజులు ఉంటాయి. మా దగ్గర కిలో రూ.20కి కొనుగోలు చేసి వారపు సంతలో కిలో రూ.40 వరకు అమ్ముతున్నారు. – జంగారెడ్డి, హోల్‌సేల్ వ్యాపారి, దిల్సుఖ్నగర్ప్రస్తుతం కూరగాయల ధరలు ఇలా.. కిలో ధర (రూ.లో) టమాటా 40 ఉల్లి 38 మునగకాడలు 40 క్యారెట్ 50 వంగ 45 బెండ 52 పచి్చమిర్చి 120 -
వామ్మో!.. కోడికూరను మించిపోయిన టమాటా ధరలు..
కూరగాయల ధరలు కుతకుతమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో.. దూరప్రాంతాల నుంచి రవాణా సౌకర్యానికి అంతరాయమేర్పడి దిగుమతి తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు, వరదలు ఉండగా సరుకులు రావడం లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న సరుకును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. రూ.500తో మార్కెట్‌కు కెళ్తే వారానికి సరిపడా రావడం లేదు. దిగిరాని ధరలు వంటకాల్లో టమాటాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఏ వంట చేయాలన్నా టమాటా తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ధరల పెరుగుదల సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టమాటా ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకు పెరిగిపోతూ వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి వరకు 100 నుంచి 150 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! టమాటా @200 కిలో టమాటా రూ.100 ఉండగానే జనాలు కొనేందుకు తంటాలు పడగా.. ఏకంగా రూ.200కు చేరగా ఇక కొనలేమంటూ వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.200పైనే పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమాటా వాడకాన్ని తగ్గించారు. అంతేగాక రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. టమాటా కంటే చికెన్ బెటర్ టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొన్నిచోట్ల టమాట కంటే చికెన్ ధరలు తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కేజీ చికెన్ ధర రూ.200(స్కిన్). రూ. 220(స్కిన్ లెస్)గా ఉంది.. రూ. 200 పెట్టి టమాటాలు కొనే బదులు చికెన్ కొనడమే బెటర్ అని చాలా మంది అంటున్నారు. నిత్యావసరాల ధరలకూ రెక్కలు.. రాష్ట్రంలో ఇటీవల వారంపాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రావాణా వ్యవస్థ కుదేలైంది. దీంతో ధరలు మరింత పెరిగాయి. కూరగాయల ధరలతోపాటు నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చాయి. రెక్కడితేగాని డొక్కాడని కూలీలు పొద్దంతా పని చేసి వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వర్షాల కారణంగా వారంరోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చదవండి: ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు! -
మంట.. మంట.. ధరల మంట.. రూ.100 కొడితేనే టమాటా.. మరి బీరకాయ?
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఎండలు ఎలా మండుతున్నాయో అదే మాదిరి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా టమాటతో పాటు ఇతర కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో వాటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత 20 రోజుల క్రితం ప్రస్తుతం వాటి ధరలు చూస్తే అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా టమాట 20 రోజుల క్రితం కిలో రూ. 20–30 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ. 100కు చేరుకుంది. జిల్లాలో టమాట, ఇతర కూరగాయల విస్తీర్ణం తగ్గడంతో హైదరాబాద్, కర్నూల్, మదనపల్లె తదితర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రావాలంటే రవాణా వ్యయం సైతం అధికంగా అవుతుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. దిగుబడి తగ్గడం, ఇంధనం, రవాణా వ్యయం కారణంగా ధరలు పెంచాల్సి వస్తుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో పంటలు చేతికి వచ్చేదాకా తగ్గే అవకాశం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధర పెరుగుతుంటే ఎలా జీవనం సాగించాలని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ రెట్టింపే వంటకు కావాల్సిన ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. నిత్యావసర సరుకులు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంది. కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నెల రోజులకు అయ్యే వంటింటి ఖర్చు ప్రస్తుతం పది రోజులకు కూడా సరిపోవడం లేదు. ఆర్థిక భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది. – జయమ్మ, గృహిణి, మహబూబ్‌నగర్ -
కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి
Vegetable Prices List In Hyderabad: వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు బయట మార్కెట్లోనే అనుకుంటే...ఇప్పుడు రైతుబజార్లో సైతం కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క టమాటా ధర నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.100కు చేరింది. అదే బాటలో బెండకాయ, వంకాయ, దొండ, చిక్కుడు, గోకరకాయ, క్యారెట్, బీన్స్...ఇలా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు పెరగడంతో కిలో కొనేచోట అర, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతుబజార్ ధరలే బెంబేలెత్తిస్తుంటే ఇక బయట ధరలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. (చదవండి: గిన్నిస్ బుక్‌లో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ వాస్తవ.. ఇంతకీ ఏం చేస్తోంది) వర్షాలు బాగా కురిసినప్పటికీ.. నిన్న మొన్నటివరకు వర్షాలు బాగానే కురిసినప్పటికీ కూరగాయల ధరల దిగుబడి మాత్రం పెరగకపోవడంతో ధరలకు రెక్కాలొచ్చాయి. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో నిన్నటి వరకు కురిసిన భారీ వరదలకు రోడ్లు దెబ్బతినటంతో కూరగాయల దిగుమతి తగ్గిపోయింది. వాహనాల రాకపోకలు లేకపోవటంతో ధరలు పెరిగాయి. మండు వేసవిలో ఉన్న ధరల కంటే అధికంగా ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య ఎనలేని వ్యత్యాసం ఉంటుండడంతో వ్యాపార వర్గాలు ధరలు పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భరత్‌నగర్ కాలనీ కూరగాయల మార్కెట్లో కూడా ధరలు అధికంగా ఉన్నాయి. కర్రీ పాయింట్లలో సైతం.. పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరల కారణంగా కర్రీ పాయింట్ల నిర్వాహకులు సైతం ధరలు పెంచేశారు. నిన్నటివరకు రూ.10– 12లుగా ఉన్న కనీస ధర (ఒక కర్రీ)ను రూ.20లకు పెంచేశారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉంది. మరోవైపు పెరిగిన కూరగాయల ధరలతో కొనడమే మానేసిన చాలా మంది కర్రీ పాయింట్లను ఆశ్రయించడంతో ఆయా సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆదే అదునుగా నిర్వాహకులు కర్రీ పాయింట్లపై ఆధారపడ్డ యువత, బ్యాచ్లర్స్, కుటుంబాలపై సైతం అదనపు భారం వేస్తున్నారు. (చదవండి: ముక్కలేనిదే ముద్ద దిగదు.. నీటుగా ఉండే ‘నాటు కోడి’ రుచి ఆస్వాదించాల్సిందే) ఎన్నడూ లేనంత ధరలు పలుకుతున్నాయి.. గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయల ధరలు మండుతున్నాయి. అదీ, ఇదీ అని కాకుండా దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగిపోయాయి. నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం తప్పడం లేదు. టమాట గతంలో 10 నుంచి 20 దాకా ఉండేది. ఒకేసారి 100కు చేరటం, మిగతా కూరగాయలు కూడా 60 రూపాయలు దాటి ఉండటం వినియోగదారుల నడ్డి విరుగుతోంది. – అనిత, మూసాపేట గడిచిన నెలలో పెరిగిన కూరగాయల ధరలు, రైతుబజార్ ధరల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి -
15 కేజీల టమాటా రూ.వెయ్యి..
సాక్షి, కోలారు: జిల్లావ్యాప్తంగా కొన్నిరోజులుగా కురుస్తున్న వానలకు కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. వానలతో దిగుబడి తగ్గడమే ఇందుకు కారణం. టమాటకు అతి పెద్ద విపణి అయిన కోలారు ఎపిఎంసి మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికింది. 15 కేజీల టమోటా బాక్సు రూ.వెయ్యికి వేలం పాడడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వానల కారణంగా టమాట దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు సరుకు కోసం కోలారు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో టమాట లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల కిందట వరకు టమాట బాక్స్ రూ.250 కంటే తక్కువగానే ఉండేది. గిరాకీ లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక బయట కూరగాయల మార్కెట్లలో కేజీ ధర నాణ్యతను బట్టి రూ.70– 80 వరకూ ఉంటోంది. -
కూరగాయల ధరలు కుతకుత
సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: కూరగాయల ధరలు 37% అప్! ► నగర జనాభా ప్రకారం ప్రతిరోజు దాదాపు మూడు వేల టన్నుల కూరగాయలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలే 60 శాతం తీరుస్తాయి. ► మిగతా కూరగాయలు కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నుంచి దిగుమతి అవుతాయి. ► కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లతో ఏజెంట్లదే పెత్తనం. దీంతో వారు నిర్ణయించిన ధరే ఖరారు అవుతోంది. ► వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులకు కూడా నష్టం వాటిల్లుతోంది. ► గ్రేటర్ పరిధిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కడా కోల్డ్ స్టోరేజీ లేదు. దీంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. కూరగాయలు గత ఏడాది ప్రస్తుత ధరలు గతేడాది నవంబర్‌లో ప్రస్తుత ధరలు(కిలోకు) టమాటా రూ. 15 రూ. 30 బెండకాయ రూ. 30 రూ. 60 బిన్నీస్ రూ. 40 రూ. 80 వంకాయ రూ. 20 రూ. 40 దొండకాయ రూ. 20 రూ. 40 క్యాబేజీ రూ. 30 రూ. 60 కాప్సికం రూ.40 రూ. 80 పచ్చిమిర్చి రూ. 20 రూ. 50 -
కొనలేం.. తినలేం!
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారం రోజుల్లో నే కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. హోల్‌సేల్/ రైతు బజార్లలోనే పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు దాదాపు మూడు రెట్లు కావడం గమనార్హం. నగరంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ యార్డులో ఈ నెల 17, 24వ తేదీల్లో హోల్‌సేల్ / రైతు బజార్లలో కూరగాయల ధరలు పరిశీలిస్తే దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. విరివిగా ఉపయోగించే టమాట, వంకాయ, దొండకాయ, బెండ, బీరకాయ వంటి కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా వర్షాలతో పెద్ద మొత్తంలో పంటలు నీట మునగడంతో దిగుబడి తగ్గిన కారణంగా కూరగాయల ధరలు పెరుగుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా వినాయక చవితికి ఎక్కువగా వినియోగించే పచ్చి చింతకాయ ధర మాత్రం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో రూ. 250 పలకడం గమనార్హం. -
వెజి'ట్రబుల్!'
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌తో కూరగాయల ధరలు ఒక్కరోజులోనే మూడింతలయ్యాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సోమవారం నగరంలోని బోయిన్పల్లి మార్కెట్‌కు 46 శాతం కూరగాయల సరఫరా తగ్గింది. దీంతో పాటు గుడి మల్కాపూర్ మార్కెట్ శుభ్ర పర్చడానికి సోమవారం మూసివేశారు. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు రూ.60 నుంచి రూ.80 మధ్య పలికాయి. జనతా కర్ఫ్యూ, నగర లాక్‌డౌన్‌కు ముందు కిలో రూ.10 పలికిన టమాటా సోమవారం రూ.80కి విక్రయించారు. అత్యధికంగా చిక్కుడు, బిన్సీస్ ధర రూ. 100 నుంచి రూ.120 వరకు బహిరంగ మార్కెట్లో వ్యాపారులు విక్రయించారు. కరోనా ప్రభావంతో నగర జనం ఎక్కువ శాతం కూరగాయలను వినియోగిస్తున్నారు. దీంతో కూడా మామూలు రోజుల కంటే ఎక్కువగా కూరగాయలు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెల 31 వరకు నగరం లాక్‌డౌన్‌తో కూడా నగర ప్రజలు అర కిలో, కిలో చోటా నాలుగు, ఐదు కిలో వివిధ రకాల కూరగాయలు కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీంతోనూ దిగుమతి అయినా కూరగాయలు సరిపోకపోవడంతో వ్యాపారులు ధరలు ఒకేసారి పెంచేశారు. కూరగాయల డిమాండ్ ఇలా.. గ్రేటర్ హైదరాబాద్ నగర జనాహి దాదాపు కోటి మంది. వీరు ప్రతిరోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగిస్తుంటారు. ప్రతిఒక్కరికీ 300 గ్రాముల కూరగాయలు అవసరం. కరోనా ప్రభావంతో నగర జనం నాన్‌వెజ్‌కు దూరమయ్యారు. దీంతో ప్రస్తుతం నిత్యం 4 వేల టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతున్నాయని మార్కెటింగ్ శాఖ అధికారుల అంచనా. కానీ మార్కెట్లకు డిమాండ్‌కు తగ్గ కూరగాయలు సప్లయ్ లేకపోడంతో కూరగాయల కొరత నెలకొందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. సోమవారం బోయిన్పల్లి మార్కెట్‌కు దాదాపు 745 టన్నులు, ఎల్బీనగర్ మార్కెట్‌కు 11, మాదన్నపేట్ మార్కెట్‌కు 8, మీరాలంమండి మార్కెట్‌కు 6 టన్నుల కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో పాటు నగరంలోని 11 రైతు బజార్లను కలుపుకొని 110 టన్నులు, ఇతల చిన్నాచితకా మార్కెట్లకు 10 టన్నుల కూరగాయలు దిగుమతి అయినట్లు అంచనా. గ్రేటర్ కూరగాయల అవసరం ఒక్క రోజుకు 3 వేల నుంచి నాలుగు వేల టన్ను అయితే సోమవారం కేవలం వెయ్యి టన్ను కూరగాయలు దిగుమతి అయ్యాయి. దీంతో డిమాండ్ ఎక్కువ.. సప్లయ్ తక్కువ కావడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. జాడలేని ప్రత్యామ్నాయం.. ఈ నెల 31 వరకు నగరంలో లాక్డౌన్ ఉండడంతో.. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా కూరగాయలు నగర మార్కెట్లకు దిగుమతి కావడంలేదు. కూరగాయల వినియోగం ప్రస్తుతం ఉన్నట్లు రానున్న రోజుల్లోనూ ఇలాగే ఉంటే ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుందో తెలియని పరిస్థితి నెలకొంది. కోల్డ్ స్టోరేజీ ఒక్కటీ లేదు గ్రేటర్లో ఒక్క కోల్డ్‌స్టోరేజీ లేకపోవడంతో జనతా కర్ఫ్యూ, నగర లాక్డౌన్ లాంటి సందర్భంలో కూరగాయలు నిల్వ చేసి ఉంటే ధరలు అంతగా పెరిగేవి కావని వినియోగదారులు అంటున్నారు. డిమాండ్‌కు తక్కువ కూరగాయలు దిగుమతి అయితే కమీషన్ ఏజెంట్లు సిండికేట్‌గా మారి ధరలను అమాంతంగా పెంచారు. కూరగాయల దిగుమతులు తగ్గడంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకు కూరగాయలు కొనాల్సి ఉంటుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో కమీషన్ ఏజెంట్లు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో దోపిడీ.. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ప్రజలకు భరోసా ఇచ్చి 24 గంటలు గడవక ముందే మార్కెట్లో వీటి ధరలు సాధారణ ప్రజానీకానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ఉప్పల్, కుషాయిగూడ, సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్తో పాటు ఇతర మార్కెట్లలో కూరగాయల ధరలు మండి పోయాయి. మార్కెట్లలోనే కాదు బయట బండి మీది కాయగూరలు అమ్మే వారు సైతం అమాంతంగా రేట్లను పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. నేటి నుంచి ధరలు తగ్గుతాయి.. అదివారం జనతా కర్ఫ్యూ కారణంగా శుక్ర, శనివారాల్లో కూరగాయల విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఆదివారం అన్ని మార్కెట్లు బంద్ పాటించాయి. సోమవారం లాక్‌డౌన్‌తో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు చాలావరకు తగ్గాయి. గుడిమల్కాపూర్ మార్కెట్ శుభ్రపర్చడానికి సోమవారం మూసివేశాం. దీంతో కూరగాయల ధరలు పెరిగాయి. మంగళవారం నుంచి కూరగాయల దిగుమతులు పెరుగుతాయి. ధరలు తగ్గుతాయి. ధరలు నియత్రించడానికి మార్కెట్ శాఖ సిబ్బంది వ్యాపారులపై నిఘా పెట్టనున్నారు. – జి.లక్ష్మీబాయి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ -
ఉల్లి ఘాటు.. పప్పు పోటు!
సాక్షి, జమ్మికుంటటౌన్ (హుజూరాబాద్): ఉల్లి ఘాటెక్కింది. స్వల్పకాలంలో ధర అమాంతం పెరి గింది. ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.48 పలుకుతోంది. పప్పుల ధరలు సైతం నిప్పులు చిమ్ముతున్నాయి. మినప, కందిపప్పు రూ.వందకు చేరువయ్యాయి. మిగతా పప్పులూ అదే వరుసలో నిలిచాయి. కూరగాయల ధరలు ఇంకా కరుస్తూనే ఉన్నాయి. వర్షాకాలంలోనూ ధరలు దిగిరావడం లేదు. మార్కెట్లో నిత్యావసరాలు మండుతున్నా, ధరలకు తాళలేక సామా న్యులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ధరల నియంత్రణపై యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కొరతతో ఘాటెక్కిన ఉల్లి ధర.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉల్లిసాగు ఎక్కడా లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొం దరు రైతులు వారి అవసరాల కోసం పెరట్లో పండించడం తప్ప భారీగా సేద్యం చేసిన దాఖలాల్లేవు. ఉద్యానశాఖ అంచనా ప్రకారం.. ఉమ్మడి జిల్లాకు ఏటా 52,000 టన్నుల ఉల్లిగడ్డ అవసరం. ప్రజల అవసరాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. అధికశాతం మహారాష్ట్ర వ్యాపారులే సరఫరా చేస్తారు. అక్కడి రైతులు రబీలో పండించిన ఉల్లిగడ్డను భారీగా ఇళ్లలో దాచుకుంటారు. ఆర్థిక అవసరాలకు అనుగు నంగా వ్యాపారులకు విక్రయిస్తారు. వారు గోదాముల్లో నిల్వచేసుకున్న సరుకుతో ఏడాది పొడవునా వ్యాపారం సాగిస్తారు. కాగా.. ఈసారి మహారాష్ట్రలో ఉల్లిసాగు గణనీయంగా తగ్గింది. వరుస తుపాన్లకు వరద ముంచెత్తడంతో పంట దెబ్బతింది. ఫలితంగా దిగుబడులు భారీగా పడిపోయాయి. చేతికొచ్చిన అరకొర పంట సైతం ముసురుకు పాడైపోయింది. దీని ప్రభావం క్రమంగా ధరలపై పడుతూ వస్తోంది. ఈయేడు మార్చిలో కిలోకు రూ.15 నుంచి రూ.18 పలికిన ఉల్లి ధరలు ఐదు నెలల వ్యవధిలో రెట్టింపు అయ్యాయి. ఆగస్టు 16న కిలోకు రూ.22 ఉండగా, సెప్టెంబరు ఒకటిన రూ.35 చేరింది. ప్రస్తుతం రూ.38 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. తెల్ల ఉల్లిగడ్డకు డిమాండ్ నెలకొనడంతో వ్యాపారులు కిలోకు రూ.48 దాకా అమ్ముతున్నారు. ద్వితీయశ్రేణి సరుకును రూ.10 నుంచి రూ.15 తక్కువకు ఇస్తున్నారు. ప్రస్తుతం రెండు రకాల ఉల్లి ఉత్పత్తులు మహారాష్ట్రతోపాటు కర్నూలు నుంచి దిగుమతి అవుతున్నాయి. కర్నూలు నుంచి వచ్చే ఉల్లిగడ్డ చిన్నగా ఉంటోంది. కొరత నేపథ్యంలో మరో మూణ్నెళ్లు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబరు దాకా ధరలు తగ్గే అవకాశం లేదని పేర్కొంటున్నారు. పెరుగుతున్న పప్పుల ధరలు.. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాకు ఏటా 51,557 టన్నుల పప్పుధాన్యాలు అవసరం. ప్రజలు ఇంతకంటే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అంచనా. కానీ.. పప్పుధాన్యాల సేద్యం ఇక్కడ చాలా తక్కువగా ఉంది. కంది, శనగ, పెసర, మినుము, సోయాబీన్ కలుపుకొని ఏటా 25 వేల నుంచి 30 వేల హెక్టార్లలో సాగవుతుంది. వాటి దిగుబడులు స్థానిక అవసరాలకు పూర్తిగా సరిపోవు. పప్పుల సాగు అధికంగా ఉండే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి దిగుమతి అవుతాయి. డిమాండ్‌ను బట్టి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది. దిగుబడులు సైతం ఆశించిన స్థాయిలో రాకపోగా, రాష్ట్రంలో పప్పుల వినియోగం పెరగడంతో దీని ప్రభావం క్రమంగా ధరలపై పడుతూ వస్తోంది. çసరిగ్గా పక్షం కిందట కిలోకు రూ.65 నుంచి రూ.86 వరకున్న వివిధ పప్పుల ధరలు ఇప్పుడు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం కిరాణ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.96 విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లో రూ.98 నుంచి రూ.102కు లభిస్తోంది. మినపపప్పు రూ.96, శనగపప్పు రూ.74, పెసరుపప్పు రూ.90, మైసూరుపప్పు రూ.68 లకు వ్యాపారులు అమ్ముతున్నారు. వివిధ కార్పొరేట్ మార్టుల్లో వీటి ధరలు ఎక్కువే ఉన్నాయి. పప్పులకు కొరత తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతికి సన్నాహాలు చేస్తోంది. నేటికీ దిగిరాని కూరగాయల ధరలు.. జిల్లాలో నడి వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు దిగిరావడం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి కొనసాగుతుండడంతో కొన్ని రకాల కూరగాయల ధరలు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో క్యారెట్ రూ.65 నుంచి రూ.72, వంకాయ రూ.45 నుంచి రూ.48, దేశవాలి చిక్కుడు రూ.50 నుంచి రూ.64, దొండకాయ రూ.32 నుంచి రూ.36, బీరకాయ రూ.56, క్యాబేజీ రూ.40, బీన్స్ రూ.60, కొత్తిమీర రూ.40, గోరుచిక్కుడు రూ.40 పలుకుతోంది. మిగతా రకాలు రూ.20 నుంచి రూ.30 లోపు ఉన్నాయి. వాస్తవానికి ఈ ధరలు వేసవిలో ఉండాలి. వర్షాకాలం ఆరంభం నుంచి క్రమంగా తగ్గుతూ రావాలి. ప్రస్తుతం చాలారకాలు కిలోకు రూ.15 నుంచి రూ.30 లోపే లభించాలి. కానీ సాగుకు సర్కారు నుంచి కొరవడిన ప్రోత్సాహం, సేద్యంపై రైతుల్లో సన్నగిల్లిన ఆసక్తితో ఉమ్మడి జిల్లాలో పరిస్థితి భిన్నంగా మారింది. కానరాని నియంత్రణ చర్యలు.. నిత్యావసరాల కొరతతో మార్కెట్లో ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నా సర్కారుకు పట్టింపు కరువైంది. ధరల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉల్లిగడ్డ, పప్పుల కొరతతో కొందరు వ్యాపారులు సరుకులను నల్లబజారుకు తరలిస్తూ భారీగా నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా ధరలు గణనీయంగా పెరిగినా జిల్లాలో ఎక్కడా తనిఖీలు జరగడం లేదు. ధరలను అదుపు చేసేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగాల్సి ఉన్నా కాలు కదపడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు సదరుశాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను తక్కువ ధరకు అందించారు. గిడ్డంగులపై దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను వెలికి తీశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు చర్యలు కొనసాగించారు. సామాన్యులు అల్లాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడూ అలాగే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
రూ. 200 పెట్టినా.. సగం సంచే..!
కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయనూ కొనేటట్టు లేదు, తినే టట్టు లేదు. ఆ స్థాయిలో ధరలు మండిపోతున్నాయి. జిల్లాలో గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, వేసవి ఎండల దెబ్బకు కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వీటిని సాగు చేసిన ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోయి బోర్లు ఎండిపోవడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ధరలు సామాన్యులను కలవర పెడుతున్నాయి. కిలో కూరగాయలు కొందామని వచ్చిన వినియోగదారులు పావు కిలోతో సరి పుచ్చుకునే పరిస్థితులు ఉన్నాయంటే ధరలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయలతో పాటు ఆకు కూరలది అదే పరిస్థితి. ఒక్క ఆలుగడ్డ తప్ప అన్నింటి ధరలు రెట్టింపు కావడంతో వినియోదారులు లబోదిబోముంటున్నారు. ల్లాలోని ఆయా ప్రాంతాలలో వేసిన కూరగాయల తోటలు ఎండల దాటికి వట్టి పోవడం, కొన్ని చోట్ల బోర్లు ఎండిపోవడం లాంటి సమస్యలు రైతన్నలను వెంటాడుతున్నాయి. రూ. 20 కూడా పలకని వంకాయలు ప్రస్తుతం 60 రూపాయలకు పెరగడంతో సామాన్యులు, నిత్య కూలీలు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితులు దాపురించాయి. పదేళ్ల నుంచి జిల్లాలో కూరగాయల సాగు కూడా గణనీయంగానే పెరిగిపోయింది. పొరుగు జిల్లాల నుంచి కూరగాయల తెచ్చుకోకుండా రైతులు స్థానికంగా కూరగాయలు పండిస్తున్నా ధరలు మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఆకు కూరలూ అంతే మోత ... కూరగాయల ధరలు పెరగడంతో ఆకు కూరలు కొందమన్నా ధరల మోత మోగుతోంది. మనకు ఏ రకం ఆకు కూర కావాలన్నా రూ.20 òపెట్టాల్సిందే. కొత్తిమిర, పాలకూర అసలు నాణ్యమైనది దొరకని పరిస్థితి వచ్చింది. రూ. 10కి ఏడునుంచి 10 పాలకూర కట్టలు రాగా ఇప్పుడు రూ. 20 రూపాయలు పెట్టినా 5 కట్టలే ఇస్తున్నారు. 25 రోజుల నుంచి ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. సాగు పెరిగినా పండని పంట.. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం భారీగానే పెరిగిపోయింది. అయితే పంట మాత్రం రైతుల చేతికి పూర్తి స్థాయిలో రాలేదు. గత ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడం, ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఖమ్మం, గుంటూరు, విజయవాడ పట్టణాల నుంచి ఎక్కువగా కూరగాయలు దిగుమతి చేసుకునేవాళ్లు. 10 ఏళ్ల నుంచి ఏటేటా కూరగాయల సాగు జిల్లాలో పెరుగుతూ రావడంతో బయటినుంచి దిగుమతి 90 శాతం తగ్గిపోయింది. జిల్లాలోని నల్లగొండ, కనగల్, పీఏ పల్లి, త్రిపురారం, అనుముల, పెద్దవూర, కేతేపల్లి, తిప్పర్తి, వేములపల్లి, నకిరేకల్, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలలో కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు. టమాట, బీరకాయ, దొండకాయ, కాకర, గోకర, పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, దోసకాయ, సొరకాయ, ఆకు కూరలు పంటలు వేసినా రైతులకు అక్కరకురాకపోవడంతో ధరలు మిన్నంటాయని చెప్పొచ్చు. మరో నెల వరకు ఇదే పరిస్థితి ... ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున వర్షాలు పడగానే కూరగాయల సాగు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే రైతులు త మ పొలాల్లో నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారు. మళ్లీ పంట లు వస్తేనే ఈ ధరలు తగ్గే అవకాశం ఉందన వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు పోయినందున ఇక కూరగాయల నిల్వ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉన్నందున వర్షాలు కురిస్తే కొంత మేర ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మదనపల్లి నుంచి టమాట, పచ్చి మిర్చి ... ఇక్కడి ఎండల తాకిడికి టమాట పంట తీవ్రంగా దెబ్బతిన్నది. రైతులు వేసిన పంటలు సరిగా పూతకు రాకపోవడంతో టమాట పంట దిగుబడి పడిపోయింది. పచ్చి మిర్చి కూడా ఇక్కడ సాగు లేదు. దీంతో టమాటను, పచ్చి మిర్చిని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నుంచి దుగుమతి చేసుకుంటున్నారు. ధరలు ఈ రెండింటికి మండుతున్నాయి. టమాట కిలో రూ. 60, పచ్చి మిర్చి కిలో రూ.120కి విక్రయిస్తున్నారు. ధరలు పెరిగాయి 20 రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ కూరగాయ కొందామన్నా రూ. 50కి తక్కువగా లేదు. కిలో వచ్చే కూరగాయలు ఇప్పుడున్న ధరలకు పావు కిలో మాత్రమే వస్తున్నాయి. తినాలంటే కొనాల్సిందే కదా.. అందుకే రేటు ఎక్కువగా ఉన్నా తప్పదు. – గిరి, వినియోగదారుడు, చర్లపల్లి ఏం కొనేటట్టు లేదు మార్కెట్లో ఏ కూరగాయ కొనేటట్టు లే దు. బీరకాయ రూ. 120కి విక్రయిస్తున్నా రు. ఈ కాలంలో ధరలు ఇంత ఉండడం ఇదే మొదటి సారి. మార్కెట్లో ధరలు చూ స్తే భయ పడాల్సి వస్తుంది. రూ.200 పెట్టి కొనుగోలు చేస్తే రెండు రోజులే వస్తాయి. – ప్రభాకర్, వినియోగదారుడు, గుర్రంపూడ్ సామాన్యులం కొనలేం కూరగాయల ధరలు ఇంత ఎక్కువగా పెరిగితే సామాన్యులం కొనలేం. పావు కిలో బీరకాయ, పచ్చి మిర్చి ధరలు రూ.30 ఉంది. ధరలను చూసి కిలో కొనే కాడ అర కిలో కూడా కొనలేకపోతున్నాం. పేద వారు పచ్చడితోనే గడపాల్సి వస్తది. – వనజ, వినియోగదారురాలు, చర్లగౌరారం -
భలే చౌక
సాక్షి సిటీబ్యూరో: ఈ సీజన్లో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత పది రోజులుగా స్థానిక మార్కెట్లలో ధరలు సగానికి సగం తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సెప్టెంబర్ మొదటి వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఆగస్టు నుంచే శివారు జిల్లాల నుంచి భారీగా కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు అదుపులో ఉన్నాయి. ప్రస్తుతం చాలా రకాలు కిలో రూ.35–40 లోపే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. టమాటా ధర కొన్ని నెలలుగా రూ.10 మాత్రమే ఉండడం గమనార్హం. శివారు జిల్లాల్లో పెరిగిన దిగుబడి సాధారణంగా ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మాసాలను అన్‌సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుంటాయి. అందువల్లే రేట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి శివారు జిల్లాల్లో కూరగాయల సాగు అధికమై దిగుమతులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మోతాదులో నగరంలోని బోయిన్పల్లి, గడిమల్కాపూర్, ఎల్బీనగర్, మెహిదీట్నం, కొత్తపేట తదితర మార్కెట్లకు కూరగాయలు భారీగా తరలిస్తున్నారు. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ సీజన్‌కు ముందు ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.60 పైనే ఉండేవి కానీ. గత పది రోజులుగా పచ్చిమిర్చి, బీన్స్, దొండ, బెండ, ఆలుగడ్డ, టమాటా, వంకాల తదితర కూరగాయలు రూ.40 లోపే లభిస్తున్నాయి. దుర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ. 40 లోపే ఉన్నాయి. -
భారీగా పెరగనున్న కూరగాయల ధరలు
న్యూఢిల్లీ : తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. పంటకు కనీస మద్దతు ధరతో పాటు రైతులకు రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలంటూ ఏడు రాష్ట్రాల్లో రైతులు నిరసన ఉద్యమాలు చేపట్టారు. 10 రోజుల వరకు నిర్వహించనున్న ఈ నిరసనలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. పాలు, కూరగాయల సరఫరాను రైతులు పూర్తిగా నిలిపేశారు. నిరసనలో భాగంగా పాలను రోడ్లపై పారబోశారు. కూరగాయలను రోడ్డుపై పడేశారు. రైతుల నిరసనతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పాలు, కూరగాయలు, పళ్లు తీసుకుని పట్టణాలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణాల్లో కూరగాయల ధరలు, పాల ధరలు మండిపోతున్నాయి. 10రోజులపాటు సమ్మెకు దిగడంతో కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర కొరత తప్పదని, ఈ ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. 10 రోజుల వరకు పాల నుంచి పచ్చిమిర్చి దాకా అన్నింటిన్నీ బంద్ చేస్తామని రైతులు కూడా తేల్చి చెప్పేశారు. రైతుల నిరసనలతో మొదటి రోజే కూరగాయలు, పాల సరఫరా 50 శాతం వరకు పడిపోయింది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 10న భారత్ బంద్‌ను కూడా రైతులు చేపట్టనున్నారు. -
వెజి‘ట్రబుల్’
పదిరోజుల్లోనే ధరల రెట్టింపు సరకుకు తగ్గటంతోనే డిమాండ్ ఖమ్మం: కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయన్న సామాన్యుల ఆనందం ఎన్నోరోజులు నిలవలేదు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన సరుకు దిగుమతి తగ్గడం...జిల్లాలోనూ కూరగాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు రెట్టింపయ్యాయి. కూరగాయల (వెజిటబుల్స్) ధరలు మళ్లీ పెరగడంతో సామాన్యులకు కష్టాలు (ట్రబుల్స్) మొదలయ్యాయి. కూరగాయ ఉత్పత్తులు తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే మన జిల్లాలో వర్షాలు కురవడంతో రైతులు తొలకరిలోనే కూరగాయ పంటలు సాగు చేశారు. జూన్‌లో సాధారణానికన్నా అధికంగా; జూలై, ఆగస్టులోlసాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. నీటి వనరుల ఆధారంగా సాగు చేసిన కూరగాయలు జూలై, ఆగస్టు నెలల్లో విక్రయానికి వచ్చాయి. ఆగస్టులో వరుసగా 20 రోజులపాటు వర్షాల జాడ కనిపించకపోవడం... పంట దిగుబడులపై ప్రభావం చూపింది. అయినప్పటికీ మన జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్(ఏపీ) నుంచి పంట ఉత్పత్తులు విరివిగా విక్రయానికి రావడంతో ధరలు బాగా తగ్గాయి. మన జిల్లాలో ఉత్పత్తి పడిపోవడం, ఏపీ నుంచి కూడా దిగుబడులు తగ్గడంతో ఒక్కసారిగా వెజి‘ట్రబుల్స్’ మొదలయ్యాయి. పది రోజుల్లో రెట్టింపు ధరలు పది రోజుల కాలంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. ఆరు నుంచి ఏడు రూపాయలు పలికిన కిలో టమాట ధర ఇప్పుడు రూ.16కు చేరింది. దొండకాయ, నాటు చిక్కుళ్లు, బెండకాయ ధరలు రెట్టింపును దాటాయి. మిగతావాటి రేట్లు కూడా దాదాపుగా ఇలానే ఉన్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కూరగాయలు ఆగస్టు 27న ధర సెప్టెంబర్ 7న ధర కిలో ఒక్కింటికి(రూ.లలో) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– టమాట 07 16 వంకాయ 20 26 బెండకాయ 12 30 కాకర 16 34 బీర 20 28 దొండ 10 32 పొట్లకాయ 16 24 నాటు చిక్కుళ్లు 30 54 ఫ్రెంచ్ బీన్స్ 32 60 ––––––––––––––––––––––––––––––––––––––––––– -
ధర దడ
మహబూబ్‌నగర్ వ్యవసాయం : కూరగాయల ధరలు ఆకాశన్నంటాయి. సామాన్యులు వాటివైపు చూడడానికే భయపడుతున్నారు. గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో భారీగా ధరలు పెరిగాయి. టమాట ధర మరీ దారుణమైంది. టమాట కిలో 60 రూపాయలకు చేరడంతో వినియోగదారులు వాటిని కొనడమే మానేశారు. ఒక చిన్న కుటుంబానికి వారానికి సరిపోయే కూరగాయలు కొనాలంటే వెయ్యి రూపాయలకు తక్కువ కావడం లేదు. వీటిని అదుపులో పెట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దళారులు కూరగాయల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. తగ్గిన టమాట దిగుబడి.... జిల్లాలో 2011-12లో 3,905 హెక్టార్లలో టమాట పంట సాగైంది. 2012-13లో 3,875 హెక్టార్లు, 2013-14లో 4,296 హెక్టార్లలో సాగైంది. అయితే, ఎండలు ఎక్కువగా ఉండడం, సమయానికి వర్షాలు కురవక పోవడంతో ఈ ఏడాదిలో నాలుగున్నర నెలలు గడిచినా 400 హెక్టార్లకు మించి దిగుబడి రాలేదు. అక్కడక్కడా పండిన పంట కూడా వివిధ తెగుళ్ల బారిన పడి నాశనమైంది. జిల్లాలో బీర్నిస్, చామగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి సాగు గతేడాది కంటే తగ్గిపోయిందని ఉద్యానవనశాఖ అధికారులు తెలుపుతున్నారు. టమాట దిగుబడి ఎక్కడిక్కడ ఆగిపోవడంతో రోజురోజుకు టమాట ధరల్లో వ్యత్యసం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఈ నెల 8న రూ.30 పలికిన కిలో టమాట వారం రోజుల కాలవ్యవధిలో రూ.60 పలుకుతుంది. పంటలకు తెగుళ్లు సోకి దిగుబడి రావడం లేదు నేను 20గుంటల పొలంలో రెండు నెలల క్రితం టమాట పంట సాగు చేశాను.ఆ పంటకు తెగుళ్లు సోకి ఇప్పటి వరకు దిగుబడి రావడం లేదు. ఎన్ని మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. ఈ సారి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండొచ్చు -ప్రశాంతి, మహిళా రైతు,పెర్కివీడు, కోయిలకొండ మండలం వాతావరణం అనుకూలించడం లేదు ఎండకాలం ఎండలు ఎక్కువగా కొట్టడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. మళ్లీ వానలు కూడా వరుసగా రావడంతో టమాట తోట దెబ్బతిన్నది. పంటకు తెగుళ్లు కూడా సోకుతున్నాయి. దిగుబడి చాలావరకు తగ్గిపోయింది. - శివమ్మ, మహిళా రెతు, కాకర్లపాడు -
ధరాభారం తగ్గించరేం?
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. రైతుబజార్లలోనే ప్రతి కూరగాయా కిలో రూ.25పైగా పలుకుతుండడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరాభారం తగ్గించేందుకు ప్రత్యామ్నాయమార్గాలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన కూరగాయల పంటలు గత నెల 22 నుంచి 27 వరకు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. రబీలో సాగు చేసినవి ఇంకా మార్కెట్లోకి రాలేదు. అంతంతమాత్రం పండే కూరగాయలను సైతం రైతులు దూరప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా కొరత ఏర్పడడంతో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఎం.వెంకటేశ్వరరెడ్డి దాదాపు మూడు నెలలుగా సెలవుల్లో ఉన్నారు. దీంతో వినియోగదారుల కష్టాలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఇలా చేయాలి..: ధరలు నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ వద్ద రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది. వివిధ స్కీమ్‌లకు సంబంధించిన ఇంట్రెస్ట్ నిధులు ఉంటాయి. ఈ నిధులతో రైతుల నుంచి హోల్‌సేల్‌గా కూరగాయలు కొని నోలాస్, నో ప్రాఫిట్ కింద రైతుబజార్లలో అమ్మించవచ్చు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయవచ్చు. ఉద్యాన శాఖ సబ్సిడీపై కూరగాయల రైతులకు వెండింగ్ వ్యాన్లను ఇస్తోంది. రైతు తాము పండించిన కూరగాయలను రద్దీ ప్రదేశాలకు, కీలకమైన ప్రాంతాలు, అపార్ట్మెంట్ల వద్దకు తీసుకుని వెళ్లి అమ్మేలా చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మార్కెటింగ్‌శాఖ ఉన్నా లేనట్లుగా తయారైంది. కర్నూలులోని సి.క్యాంప్ రైతుబజార్‌కు ప్రతినెలా సగటున రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ఈ నిధులతో సంచార రైతుబజార్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా చర్యలు తీసుకునే అధికారి లేకపోవడంతో వినియోగదారులు ధరల భారాన్ని భరించాల్సి వస్తోంది. ఎప్పుడో ఒకసారి హడావుడి..: ధరల నియంత్రణ విషయంలో అప్పుడప్పుడు హడావుడి చేసే అధికారులు కొద్ది రోజులకే దాన్ని పక్కన బెడుతున్నారు. కొద్ది నెలల క్రితం కూరగాయల ధరలు పెరిగినప్పుడు జేసీ కన్నబాబు ఆదేశాల మేరకు రూ.99కే 9 రకాల కూరగాయలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉల్లిని హోల్‌సేల్ ధరకే అమ్మించే కార్యక్రమాన్ని మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టారు. అయితే ఇవన్నీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. మార్కెటింగ్‌శాఖ నోలాస్, నో ప్రాఫిట్ కింద నిరంతరం హోల్‌సేల్ ధరలకే కూరగాయలను సరఫరా చేసే అవకాశం ఉన్నా ఉలుకు, పలుకు లేకుండాపోయింది. దిగిరాని కూరగాయల ధరలు..: గత వారంతో పోలిస్తే కొన్ని కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఏ కూరగాయా కిలో రూ.25 కంటే తక్కువకు లభించడం లేదు. రైతుబజార్లోనే టమాట కిలో రూ.26, వంకాయ రూ.30, కాకర రూ.28, బీర రూ.30, క్యాలీఫ్లవర్ రూ.36, క్యారెట్ రూ.30, క్యాబేజి రూ.25, బీన్స్ రూ.36, ఆలు రూ.28, చెవుల రూ.28, చిక్కుడు రూ.28, చామ రూ.40, కంద రూ.30 ప్రకారం విక్రయిస్తున్నారు. రైతుబజార్ బయట కిలో రూ.2 నుంచి రూ.6 వరకు, నగరంలో 10కి పైగా ధరలు అధికంగా ఉన్నాయి. -
ధరల భగ్గు
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : కూరగాయల ధరలు మండుతున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 మార్కెట్‌కు తీసుకెళ్తె చిన్న సంచినిండా కూడా నిండటం లేదు. మరోవైపు చికెన్ ధరలు దిగివచ్చాయి. కాలీఫ్లవర్ కిలో రూ.120 పలుకుతుండగా, కోడి కిలో ధర రూ.70 ఉంది. ఏ కూరగాయల ధరలు చూసినా రూ.70కి తక్కువ లేవు. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులో లేవు. కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూరగాయల ధరలు పెరిగాయని అమ్మకందారులు తెలుపుతున్నారు. చికెన్ ధరలు ఢమాల్ నాలుగు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ.225. అంత డిమాండ్ పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో ధర రూ.100కు పడిపోయింది. మూడు నెలల నుంచి చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అసలే పౌల్ట్రీ ఫాం నష్టాలతో వ్యాపారులు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లింది. మరోవైపు చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో వ్యాపారులకు కూడా కోలుకోలేని దెబ్బతగిలింది. కార్తీక మాసంను పవిత్రంగా భావించే వారు మాంసం, చికెన్‌ను తినరు. ఇక వివాహాల సందర్భంగా చికెన్ అమ్మకాలు జరుగుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మాంసం, కూరగాయలకు మొగ్గుచూపడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. నవంబర్ మాసం నుంచి మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే పరిణామాలు కనిస్తున్నాయి. మొత్తానికి చికెన్ ప్రియులు ధరల తగ్గుదలతో ఆనందిస్తున్నారు. -
సీజన్ ఆరంభమైన ఆకాశంలోనే.. కూరగాయల ధరలు
సాక్షి, హైదరాబాద్: సీజన్ ప్రారంభమైనా కొన్ని కూరగాయల ధరలు ఆకాశంలోనే ఉన్నాయి. దిగుబడి పెరిగితే ధరలు దిగివస్తాయనుకున్న పేదవర్గాలకు నిరాశే మిగిలింది. ఉల్లి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు, వంకాయల ధర లు సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. ఇవి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.25 -60 దాకా పలుకుతుండటంతో సామాన్యులు అల్లాడుతున్నా రు. నిజానికి టమాటా, పచ్చి మిర్చి, కాకర, క్యాబేజీ, క్యారెట్, దొండ వంటి ధరలు హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ. 12-20 మధ్యలోనే ఉన్నాయి. అయితే.. అవి వ్యాపారుల చేతి లోకి వచ్చేసరికి హమాలీ, రవాణా, డ్యామేజీ, లాభం కలుపుకొని అధిక ధర నిర్ణయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. గుడిమల్కాపూర్ హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం కేజీ టమాటా ధర రూ.12 పలకగా.. రిటైల్ మార్కెట్లో రూ.20కు విక్రయించారు. పచ్చి మిర్చి, బెండ, బీర, చిక్కుడు, గోరుచిక్కుడు వంటివి హోల్‌సేల్‌గా రూ.16, రూ.22, రూ.15, రూ.38, 28గా ధర నిర్ణయించగా, రిటైల్‌లో 20 నుంచి రూ.50 దాకా అమ్ముతున్నారు. ఆలుగడ్డ హోల్‌సేల్‌గా రూ.13 ధర పలకగా.. బహిరంగ మార్కెట్లో రూ.18-20కు విక్రయిస్తున్నారు. మొన్నటివరకు డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉండటంతో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు సీమాంధ్ర నుంచి నగరానికి కూరగాయల సరఫరా యథావిధిగా సాగుతోంది. అలాగే కూరగాయల దిగుబడీ పెరిగింది. అయినా ధరలు తగ్గట్లేదు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నగరానికి కూరగాయల సరఫరా తగ్గిందని, ఫలితంగా ధరలు దిగిరావట్లేదని వ్యాపారులు చెబుతుండడం గమనార్హం.