మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : కూరగాయల ధరలు మండుతున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 మార్కెట్‌కు తీసుకెళ్తె చిన్న సంచినిండా కూడా నిండటం లేదు. మరోవైపు చికెన్ ధరలు దిగివచ్చాయి. కాలీఫ్లవర్ కిలో రూ.120 పలుకుతుండగా, కోడి కిలో ధర రూ.70 ఉంది. ఏ కూరగాయల ధరలు చూసినా రూ.70కి తక్కువ లేవు. ఆకు కూరల ధరలు కూడా అందుబాటులో లేవు. కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కూరగాయల ధరలు పెరిగాయని అమ్మకందారులు తెలుపుతున్నారు.
చికెన్ ధరలు ఢమాల్
నాలుగు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ.225. అంత డిమాండ్ పలికిన చికెన్ ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో ధర రూ.100కు పడిపోయింది. మూడు నెలల నుంచి చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అసలే పౌల్ట్రీ ఫాం నష్టాలతో వ్యాపారులు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లింది. మరోవైపు చికెన్ అమ్మకాలు తగ్గిపోవడంతో వ్యాపారులకు కూడా కోలుకోలేని దెబ్బతగిలింది. కార్తీక మాసంను పవిత్రంగా భావించే వారు మాంసం, చికెన్‌ను తినరు. ఇక వివాహాల సందర్భంగా చికెన్ అమ్మకాలు జరుగుతాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మాంసం, కూరగాయలకు మొగ్గుచూపడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. నవంబర్ మాసం నుంచి మరో రెండు నెలలు ఇదే పరిస్థితి కొనసాగే పరిణామాలు కనిస్తున్నాయి. మొత్తానికి చికెన్ ప్రియులు ధరల తగ్గుదలతో ఆనందిస్తున్నారు.
ధరల భగ్గు
Published Sat, Nov 16 2013 4:39 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement