సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్‌లతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: కూరగాయల ధరలు 37% అప్!
► నగర జనాభా ప్రకారం ప్రతిరోజు దాదాపు మూడు వేల టన్నుల కూరగాయలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలే 60 శాతం తీరుస్తాయి.
► మిగతా కూరగాయలు కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ నుంచి దిగుమతి అవుతాయి.
► కూరగాయల మార్కెట్లు, రైతు బజార్‌లతో ఏజెంట్లదే పెత్తనం. దీంతో వారు నిర్ణయించిన ధరే ఖరారు అవుతోంది.
► వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులకు కూడా నష్టం వాటిల్లుతోంది.
► గ్రేటర్ పరిధిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కడా కోల్డ్ స్టోరేజీ లేదు. దీంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. కూరగాయలు గత ఏడాది ప్రస్తుత
ధరలు | గతేడాది నవంబర్‌లో | ప్రస్తుత ధరలు(కిలోకు) |
టమాటా | రూ. 15 | రూ. 30 |
బెండకాయ | రూ. 30 | రూ. 60 |
బిన్నీస్ | రూ. 40 | రూ. 80 |
వంకాయ | రూ. 20 | రూ. 40 |
దొండకాయ | రూ. 20 | రూ. 40 |
క్యాబేజీ | రూ. 30 | రూ. 60 |
కాప్సికం | రూ.40 | రూ. 80 |
పచ్చిమిర్చి | రూ. 20 | రూ. 50 |
Comments
Please login to add a commentAdd a comment