సాక్షి, హైదరాబాద్: మటన్, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలకు మటన్, చికెన్ వైపు మొగ్గు చూపుతుంటే దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెం చేస్తున్నారు. మరోవైపు చేపలు ధరలు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. డిసెంబర్‌లో కిలో చికెన్ ధర రూ. 120 నుంచి రూ. 180 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 270 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే ధర దా దాపు రెండింతలైంది. మటన్ మాత్రం షాపు నిర్వా హకులు ఇష్టానుసారంగా అమ్ముతున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.700 అమ్మితే.. కొందరు రూ. 750 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. బోన్ సెల్ అయి తే ఏకంగా రూ. 900 నుంచి 1000పైగా అమ్ముతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ కొంటే రెండు గుడ్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అలాగే గతంలో 10% నుంచి 20% డిస్కంట్ ఇచ్చేవారు.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలివే..
►కరోనా సెకండ్ వేవ్ వస్తే ధరలు పడిపోతాయేమో అన్న భయంతో మూడు నెలల క్రితమే ఉన్న కోళ్లను చాలా మంది అమ్మేసుకోవడం.
► డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరగడం.
►పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతుండటం.
చదవండి: చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం
ఆదివారం నో బోర్డు..
మటన్ షాపు నిర్వహకులు నోటీసు బోర్డుపై ధరల పట్టి ఉంచుతారు. అయితే ఆదివారం మాత్రం బోర్డులో ధరలు ఉండటం లేదు. మటన్ ధరను ప్రభుత్వం కిలో రూ.700లకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో తనిఖీలు చేసి ఎక్కువ ధరకు అమ్మిన షాపులకు నోటీసులు, జరిమానాలు విధించినా కొందరు మారడం లేదు.
‘మేకలు, గొర్రెలు సప్లయ్ చాలా తక్కువగా ఉంది. అలాగే మటన్ ఎక్కువగా తింటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో కొంత మేరకు ధర పెరిగింది వాస్తవమే.’
– మటన్ షాపు నిర్వాహకులు
చదవండి: సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క?
Comments
Please login to add a commentAdd a comment