mutton sales
-
Hyderabad: బాగానే లాగించేశారు!.. ఒకే రోజు అన్ని లక్షల కేజీలా?
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ రోజు గ్రేటర్ పరిధిలో మాంసం విక్రయాలు భారీగా జరిగాయి. నగరవాసులు ‘ముక్క’పై మక్కువ కనబర్చారు. సాధారణ రోజుల్లో 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సందర్భంగా బుధవారం 30 లక్షల కిలోల చికెన్, 10 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో మటన్ రూ. 850– 900.. కిలో చికెన్ రూ.230– 250కి విక్రయించారు. మాంసం అమ్మకాల జోరు ఆదివారం వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: (Dussehra 2022: కాసులు కురిపించిన దసరా) -
మండుతున్న మటన్, చికెన్ ధరలు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: మటన్, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలకు మటన్, చికెన్ వైపు మొగ్గు చూపుతుంటే దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెం చేస్తున్నారు. మరోవైపు చేపలు ధరలు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. డిసెంబర్లో కిలో చికెన్ ధర రూ. 120 నుంచి రూ. 180 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 270 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే ధర దా దాపు రెండింతలైంది. మటన్ మాత్రం షాపు నిర్వా హకులు ఇష్టానుసారంగా అమ్ముతున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.700 అమ్మితే.. కొందరు రూ. 750 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. బోన్ సెల్ అయి తే ఏకంగా రూ. 900 నుంచి 1000పైగా అమ్ముతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ కొంటే రెండు గుడ్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అలాగే గతంలో 10% నుంచి 20% డిస్కంట్ ఇచ్చేవారు.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలివే.. ►కరోనా సెకండ్ వేవ్ వస్తే ధరలు పడిపోతాయేమో అన్న భయంతో మూడు నెలల క్రితమే ఉన్న కోళ్లను చాలా మంది అమ్మేసుకోవడం. ► డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరగడం. ►పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతుండటం. చదవండి: చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం ఆదివారం నో బోర్డు.. మటన్ షాపు నిర్వహకులు నోటీసు బోర్డుపై ధరల పట్టి ఉంచుతారు. అయితే ఆదివారం మాత్రం బోర్డులో ధరలు ఉండటం లేదు. మటన్ ధరను ప్రభుత్వం కిలో రూ.700లకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో తనిఖీలు చేసి ఎక్కువ ధరకు అమ్మిన షాపులకు నోటీసులు, జరిమానాలు విధించినా కొందరు మారడం లేదు. ‘మేకలు, గొర్రెలు సప్లయ్ చాలా తక్కువగా ఉంది. అలాగే మటన్ ఎక్కువగా తింటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో కొంత మేరకు ధర పెరిగింది వాస్తవమే.’ – మటన్ షాపు నిర్వాహకులు చదవండి: సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క? -
సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే దీని వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. ప్రత్యేకించి మేక, గొర్రె మాంసం ఖరీదైనా ఎంతో కొంత కొనుగోలు చేయకుండా ఉండలేని వారెందరో. అయితే.. తాము కొనుగోలు చేస్తున్న మాంసం నాణ్యమైనదేనా? నిబంధనల ప్రకారమే వ్యాపారులు మాంసాన్ని అమ్ముతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆయా సందేహాలపై ‘మెహర్’ సర్వే నిర్వహించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆఫ్పాన్ ఖాద్రీ తెలిపారు. కొన్ని రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గి మటన్ విక్రయాలు పెరిగాయి. దీంతో మటన్ విక్రేతలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగాల బారినపడిన జీవాల మాంసాన్ని అమ్ముతున్నట్లు సర్వేలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. వెయ్యి మంది అభిప్రాయాల సేకరణ.. జంట నగరాల్లోని షాపుల్లో, రోడ్ల పక్కన విక్రయిస్తున్న మాంసంపై ముద్రలు ఉండట్లేదు. నిబంధనలకు అనుగుణంగానే మేకలు, గొర్రెలను కోస్తున్నారా? నాణ్యమైన మాంసాన్నే అమ్ముతున్నారా? ఇలాంటి నిబంధనలు నగర వాసులకు తెలుసా? షాపుల వారు ఇస్తున్న రసీదులను పరిశీలిస్తున్నారా? షాపుల్లో అమ్మే మాంసంపై నాణ్యత ముద్ర ఉండాలన్న విషయం కొనుగోలుదారులకు తెలుసా? అనే అంశాలపై వెయ్యి మంది అభిప్రాయాలను ‘మెహర్’ సంస్థ సేకరించింది. అవగాహన లేదు.. మటన్ నాణ్యతపై పెద్దగా అవగాహన లేదని అత్యధిక మంది స్పష్టం చేశారు. షాపుల్లో, రోడ్లపై ఎక్కడ కొన్నా నాణ్యత ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. నిజానికి నగరంలోని కబేళాల్లో రోజూ వేల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి మాంసాన్ని నగరంలోని షాపులకు, ఇతర హోటళ్లకు, విందులకు సరఫరా చేస్తున్నారు. కబేళాలో మేక, గొర్రెలను వెటర్నరీ డాక్డర్ల పర్యవేక్షణలోనే కోయాలన్న నిబంధనలను పెద్దగా పాటించడం లేదు. తెల్లవారుజామునే కబేళాల్లో మేక, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటేనే వాటిని కోసేందుకు డాక్టర్లు అనుమతి ఇవ్వాలి. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలి. ఇవేవీ పాటించడం లేదని స్పష్టమైంది. ప్రాంతాలను బట్టి.. జంట నగరాల్లోని ఆయా ప్రాంతాలను బట్టి కూడా మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. నగరం నడి»ొడ్డున మాంసం దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో దుకాణాల కంటే కూడా రోడ్లకు ఇరువెపుల మేకలు, గొర్రెలను కోసి అమ్ముతున్నారు. నగరంలోనూ కొన్నిషాపుల వారు సొంతంగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి ఇంటి వద్దనే వాటిని కోసి మాంసాన్ని షాపుల్లో అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని చాలా మంది వెల్లడించారు. -
మండుతున్న మటన్ ధరలు.. కేజీ ఎంతంటే!?
సాక్షి, ఖమ్మం : ఒక్కసారిగా మాంసాహారం ధరలు పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజల వినియోగాన్ని పసిగట్టిన మాంసాహార వ్యాపారులు అనూహ్యంగా ధరలు పెంచారు. పండుగ సందర్భంగా సహజంగా మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన మాంసాన్ని తింటారు. ప్రధానంగా కొనుగోలు చేసే చికెన్, మటన్, చేపల ధరలను వ్యాపారులు పెంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి చికెన్, చేపలు. ఈ రెండింటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.180 వరకు పలుతున్న చికెన్ ధరను ప్రాంతాన్ని బట్టి రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయించారు. అదేమిటంటే డిమాండ్ అలా ఉందని చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. గ్రామాల్లో కన్నా నగరాలు, పట్టణాల్లో చికెన్ ధర అధికంగా ఉంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌ను రూ.250 వరకు విక్రయించారు. పరిమిత ప్రాంతాల్లో లభించే నాటు కోళ్లకు కూడా బాగా ధర పెంచారు. రూ.300 వరకు లభించే కిలో నాటుకోడి రూ.400 వరకు విక్రయించారు. వేసవి కాలంలో, కోళ్లకు వ్యాధులు వచ్చి మరణాలు సంభవించినప్పుడు సహజంగా ధర పెరుగుతుంది. ప్రస్తుతం అటువంటిదేమీ లేనప్పటికీ ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కిలోకు రూ.50 వరకు పెంచారు. ఇక చేపల పరిస్థితి అదే. రకాన్ని బట్టి చేపలకు ధర ఉంటుంది. సాధారణంగా కిలో చేపల ధర రూ.150 వరకు ఉండేది. దీపావళి పండుగ సందర్భంగా కిలో రూ.180 వరకు పెంచి విక్రయించారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగటాన్ని గుర్తించి వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రొయ్యలు, కొర్రమేను వంటి చేపల ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం చేపలు పట్టే సీజన్ కాకపోవడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి చేపల చెరువుల్లో పెంచే చేపలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధరను చెప్పుకోలేకుండా ఆకాశానికి అంటింది. కిలో రూ.800లుగా ఉన్న మటన్ ధర పండుగ సందర్భంగా రూ.1,000గా విక్రయించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు మాత్రం మటన్ జోలికి వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున మటన్ విక్రయాలు జరిగాయి. పట్టించుకోని ప్రభుత్వ శాఖలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలు పాటించకపోవటంతో పాటు ధరలను కూడా ఇష్టారీతిన పెంచి విక్రయిస్తున్నారు. స్థానికంగా నియంత్రించాల్సిన కింది స్థాయి ఉద్యోగులను లోబరుచుకొని వ్యాపారులు ఈ విక్రయాలు చేస్తున్నారు. రహదారుల వెంట, కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో మాంసం, చేపలు, చికెన్ వంటి మాంసాహారాన్ని విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పలువురు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నప్పటికీ నియంత్రించాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు, ధరలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు పెంచి విక్రయిస్తున్నారు మాంసం ధరలను బాగా పెంచారు. పండుగ పేరుతో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి విక్రయిస్తున్నారు. చికెన్, చేపల ధరలు అందుబాటులో ఉండేవి. వాటిని కొనుగోలు చేసే వాళ్లం. అటువంటిది వాటి ధరలు కూడా అందకుండా పోతున్నాయి. – ఎ.వెంకటేశ్వర్లు, ప్రకాష్‌నగర్, ఖమ్మం మాంసం ధరలు ప్రియం మాంసం ధరలన్నీ పెరిగాయి. ప్రజల వినియోగాన్ని గమనించి ధర పెంచారు. గత వారం కన్నా దీపావళి పండుగ రోజున ధర పెరిగింది. మటన్ ధర రూ.200 వరకు పెరిగింది. చికెన్, చేపల ధరలు కూడా రూ.50 వరకు పెరిగాయి. – నల్లమోతు లక్ష్మయ్య, గుట్టలబజార్, ఖమ్మం -
మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
-
మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త
సాక్షి, విజయవాడ : విజయవాడ పాతబస్తీలోని గొల్లపాలెం సెంటర్లో ఉన్న మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా మేకలను చంపడమే గాక కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు షాపుల్లో నిల్వ ఉంచిన మాంసంను పరిశీలించగా అది కుళ్లిపోయి దాని నుంచి పురుగులు బయటికి వచ్చాయి. దీంతో వివిధ షాపుల్లో 10 రోజులకు పైబడిన 750 కిలోల మటన్‌తో పాటు నిల్వ ఉంచిన 70 మేక తలకాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి, సాంబశివరావు అనే వ్యక్తులకు చెందిన మటన్ షాపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీడియాతో మాట్లాడారు. నిల్వ చేసి ఉన్న మటన్‌లో పురుగులు ఉన్నాయని.. ఇలాంటి మాంసం తింటే ప్రజలు అనారోగ్యానికి గురవుతారని సూచించారు. మటన్, చికెన్ ప్రియులు తాజా మాంసాన్నే కొనలాని తెలిపారు. కాగా షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మాంసం శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. ఇకపై నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా సాంపిల్స్ రిపోర్టు ఆధారంగా ఆయా షాపులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలే: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమల వుతున్న నేపథ్యంలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మాంసం, కోడిగుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిపి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఈనెల 29న ఆదివారం వివిధ మార్కెట్లలో మాంసం, చికెన్, చేపలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న మాంసాన్ని అధిక ధరలకు విక్రయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరాపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, స్నేహ చికెన్ అధినేత రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని హామీ ఇచ్చారు. ప్రత్యేక అనుమతులు ఇస్తాం గొర్రెలు, మేకలను జంట నగరాలకు కానీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు కానీ తీసుకెళ్లి విక్రయించుకునేందుకు అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలను తరలించే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రను మంత్రి ఆదేశించారు. మటన్ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గోశాలల్లో ఉన్న జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు. వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని మత్స్యకారులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చి విక్రయించుకోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని, చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
కరోనా ఎఫెక్ట్; అమ్మో చికెన్.. మాకొద్దు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో చికెన్, వేట మాంసం అమ్మకాలపై కరోనా వైరస్(కోవిడ్–19) దెబ్బ పడింది. సోషల్ మీడియాలో మాంసాహారం వలనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ప్రచారం జరగడంతో మాంస ప్రియులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగానే చికెన్ అమ్మకాలు 60 శాతానికి పైగా పడిపోయాయి. అదేవిధంగా ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కోడి మాంసం అ మ్మకాల్లో రూ.3 కోట్లు, వేట మాంసం, చే పల అమ్మకాల్లో రూ.కోటి వరకు వ్యాపా రులు నష్టపోయివుంటారని అంచనా. సాధారణంగా ఆదివారం రెండు లక్షల కోళ్ల వరకు విక్రయిస్తుండేవారు. మిగిలిన నాలుగు రోజుల్లో మరో లక్ష కోళ్ల వరకు విక్రయించేవారు. ఈ లెక్కన జిల్లాలో వారానికి మూడు లక్షల కిలోల వరకు కోడి మాంసం విక్రయాలు జరిగేవి. ఇప్పుడు 70 వేల కిలోలు మాత్రమే అమ్ముడవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ధర కూడా స్కిన్‌తో ఉన్న చికెన్ కిలో రూ.95కు, స్కిన్లెస్ రూ.115 లకు పడిపోయింది. రెండు నెలల క్రితం ఇవే ధరలు రూ.230, రూ.250ల వరకు ఉండేవి. వేట మాంసం అమ్మకాలు కూడా పడిపోయాయి. ఆది, మంగళ వారాల్లో వేటమాంసం 30 వేల కిలోల వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు 15 వేల కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. సముద్ర చేపలను కూడా తినేందుకు మాంసాహారులు సుముఖత చూపడం లేదు. ఈ కారణంగా వాటి విక్రయాలు కూడా పడిపోయాయి. పాఠశాలలు, హాస్టళ్లలో మాంసం వడ్డిస్తున్నా విద్యార్థులు తినకపోవడంతో వార్డెన్లు, విద్యాశాఖ అధికారులు కూడా మాంసం కొనేందుకు సుముఖత చూపడం లేదు. వాటికి బదులుగా పౌష్టికాహారాన్ని వడ్డిస్తున్నారు. ఇటీవలి కాలంలో గుడ్డును తినేందుకు కూడా కొందరు విద్యార్థులు సుముఖత చూపడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అటువంటి వారిని వారించలేకపోతున్నామని చెబుతున్నారు. దీని వలన గుడ్డు ధర కూడా పడిపోయింది. 20 రోజుల క్రితం గుడ్డు ధర రూ.5.30 ల వరకు ఉండగా ఇప్పుడది రూ.4.30లకు దిగిపోయింది. ఇలా మాంసం, గుడ్డు ధరలు పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాంసం విక్రయాలు గణనీయంగా తగ్గాయి జిల్లాలో మాంసం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. మాంసంతోపాటు గుడ్లు రేటు కూడా తగ్గిపోయాయి. మాంసం తింటే కరోనా వైరస్ సోకే ప్రమాదముందని ప్రచారం జరగడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా అని కోళ్ల మేత ధరలు కూడా తగ్గలేదు. దీని వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాం. – పోలిశెట్టి వెంకటేష్, పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యుడు -
నేటి నుంచి మటన్ అమ్మకాలు బంద్
సీతంపేట(విశాఖ ఉత్తర): హనుమంతవాకలో ఉన్న మేకల కబేలాను నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలసకు తరలించిన నేపథ్యంలో నిరసనగా ఆదివారం నుంచి మటన్ విక్రయాలు నిలిపివేస్తున్నట్టు మటన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు కిలాని అప్పారావు మాట్లాడుతూ తగరపువలస నుంచి పెందుర్తి, గాజువాక వరకు ఉన్న 700 మటన్ షాపులు బంద్‌లో పాల్గొంటాయన్నారు. హనుమంతవాకలో కబేలా తెరిచేలా స్పష్టమైన హామీ వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. కబేలా తరలించడం వల్ల వ్యాపారాలు సరిగ్గా సాగక 6700 మంది గొర్రెల పెంపకం దారులు, సుమారు 10 వేల మంది మటన్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమంతవాకలో ఉన్న స్థలంలో రెండస్తుల భవనం నిర్మించి, పార్కింగ్, వాటర్ సదుపాయాలతో అత్యాధునిక కబేలాను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి హనుమంతవాక కబేలా వద్ద నిరసన చేపడతామన్నారు. మటన్ వ్యాపారులంతా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
చుక్క, ముక్క.. రూ.40 కోట్లు!
- ఇదీ దసరా లెక్క..! - ఆదివారం మరో దసరా!! విశాఖపట్నం : దసరాలో మందుబాబులు చుక్కకు ముక్క జోడించి మజా చేస్తున్నారు. దసరా శుక్రవారం రావడంతో ఆ రోజు వీలైనంత ఎంజాయ్ చేశారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆదివారం రావడంతో మిత్రబృందాలతో కలిసి మళ్లీ సిటింగ్‌లకు సమాయత్తమవుతున్నారు. దసరా అవసరాల కోసం ఎక్సైజ్ అధికారులు రూ.20 కోట్ల మద్యాన్ని సిద్ధం చేశారు. ఇందులో శుక్రవారం మందుప్రియులు రూ.10 కోట్ల విలువైన లిక్కర్‌ను తాగేశారు. ఆదివారం మిగిలిన రూ.10 కోట్ల మద్యం అమ్ముడైపోతుందని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు దసరాకు మందుతోపాటు మాంసాహారానికి ప్రాధాన్యమ్విడం రివాజు. ఇందులోభాగంగా శుక్రవారం నాటి విజయదశమికి అటు జిల్లాలోనూ, ఇటు నగరంలోనూ భారీగానే చికెన్, మటన్ అమ్మకాలు జరిగాయి. ఒక్క శుక్రవారమే నగరంలో రూ.ఆరు కోట్ల విలువైన (కిలో రూ.150 చొప్పున) నాలుగు లక్షల కిలోల చికెన్, మరో నాలుగు కోట్ల విలువైన మటన్ అమ్ముడయినట్టు అంచనా. ఆదివారం నాటి అమ్మకాలు కూడా దాదాపు అంతే ఉంటాయని మాంసం విక్రయదార్లు అంచనాకొచ్చి ఆ మేరకు సన్నాహాలు చేశారు. ఆదివారం అర్బన్ పరిధిలో నాలుగు లక్షల కిలోల చికెన్ డిమాండ్ ఉండవచ్చని ‘బ్యాగ్’ అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు. దీంతో మాంస విక్రయాలు రూ.20 కోట్ల వరకూ ఉండవచ్చని భావిస్తున్నారు. ఫుల్కే ప్రాధాన్యత! ప్రతి నెలా ఎక్సైజ్ శాఖ జిల్లాకు దాదాపు రూ.90 నుంచి 100 కోట్ల విలువైన మద్యాన్ని విడిపిస్తుంది. దసరాను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నెల రూ.120 కోట్ల లిక్కర్‌ను విడిపించారు. జిల్లావ్యాప్తంగా 312 మద్యం దుకాణాలు, 134 బార్ల ద్వారా వీటి విక్రయాలు జరుగుతాయి. దసరా నాడు రూ.10 కోట్ల అమ్మకాలు జరగ్గా మిగిలింది ఆదివారం తాగేస్తారని భావిస్తున్నారు. ఈ అమ్మకాల్లో ఆఫీసర్ ఛాయిస్, ఏసీ ప్రీమియం, బ్యాగ్‌పైపర్, డెరైక్టర్స్ స్పెషల్ వంటి బ్రాండ్లు అత్యధికంగా అమ్ముడుపోయినట్టు ఎక్సైజ్ అధికారులు చెప్పారు. విశేషమేమిటంటే వీటిలో ఎక్కువ మంది ఫుల్‌బాటిళ్లను కొనుగోలు చేసిన వారే ఉన్నారు. నలుగురైదుగురు కలిసి మందుకొట్టేందుకు వీలుగా ఇలా ఫుల్‌బాటిళ్లను కొనుగోలు చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే స్టార్ హోటళ్ల యజమానులు మద్యం నిల్వలను మూడింతలు పెట్టుకున్నారు. బెంగాలీల సందడి.. దసరాను విశాఖలో ఎంజాయ్ చేసేందుకు బెంగాలీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దసరాకు ఏటా ఇచ్చే సెలవులను విశాఖలో సెలబ్రేట్ చేసుకుంటారు. నాలుగు రోజులుగా విశాఖలోని స్టార్ హోటళ్లు, లాడ్జిలు నిండిపోయాయి. ఆరో తేదీ వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని హోటళ్ల సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులు ఈ నెల ఆరేడు తేదీల్లో బయల్దేరినా పర్యాటకులు మాత్రం డిసెంబర్ ఆఖరు వరకూ ఇలా వస్తూనే ఉంటారని అంటున్నారు. బెంగాలీలు, ఇతర పర్యాటకులు విశాఖ పరిసర పర్యాటక ప్రాంతాలకుకార్లలో షికారు చేస్తుండడంతో కార్లకు డిమాండ్ పెరిగింది.