
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ రోజు గ్రేటర్ పరిధిలో మాంసం విక్రయాలు భారీగా జరిగాయి. నగరవాసులు ‘ముక్క’పై మక్కువ కనబర్చారు. సాధారణ రోజుల్లో 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి.
దసరా సందర్భంగా బుధవారం 30 లక్షల కిలోల చికెన్, 10 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో మటన్ రూ. 850– 900.. కిలో చికెన్ రూ.230– 250కి విక్రయించారు. మాంసం అమ్మకాల జోరు ఆదివారం వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.