Mutton price
-
మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కిలో ధర ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: మాంసాహార ప్రియులకు చేదువార్త. మటన్ ధరలు మంట రేపుతున్నాయి. తెలంగాణలో మేక మాంసం ధర మరోసారి ‘వెయ్యి’ మైలురాయివైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మటన్ థౌజండ్ వాలా పేలడం ఖాయంగానే కనిపిస్తోంది. క్వాలిటీని బట్టి కిలో మటన్ ధర ప్రస్తుతం 800 నుంచి 850 రూపాయలకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం ముగిసిన తర్వాత ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మటన్ ఇప్పటికే కొన్నిచోట్ల నాలుగు అంకెల స్థాయికి చేరిందని టాక్. సామాన్యులకు దూరం గత కొద్ది సంవత్సరాలుగా ధరలు బాగా పెరుగుతూ వస్తుండటంతో సామాన్యులు మటన్ కొనాలంటే జంకుతున్నారు. మేక మాంసం కొనే స్తొమత లేక చికెన్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొరగా మాత్రమే మటన్ కొంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు మటన్‌కు దూరమవుతున్నారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మటన్ కిలో ధర వెయ్యి రూపాయలు దాటినా తర్వాత దిగివచ్చింది. బర్డ్‌ప్లూను బూచిగా చూపి అప్పట్లో కొంతమంది వ్యాపారులు అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. కరోనా సమయంలోనూ మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో మటన్ వినియోగం ఎక్కువ. ఈమధ్య కాలంలో మటన్ వినియోగం బాగా పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల వినియోగానికి సరిపడనంతగా గొర్రెలు, మేకలు అందుబాటులో లేకపోవడమే ధరలు పెరగడానికి కారణమని అంటున్నారు. జాతీయ పశుగణన లెక్కల ప్రకారం తెలంగాణలో 2019లో 1.91 కోట్ల గొర్రెలు, మేకలు ఉన్నట్టు అంచనా. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 600 ట్రక్కుల్లో గొర్రెలు, మేకలు తెలంగాణకు సరఫరా అవుతుంటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా డిమాండ్‌ను అందుకోకలేకపోతోంది. గొర్రె, మేకల నుంచి 50 శాతం మాత్రమే మాంసం వస్తుందని.. అదే చికెన్ అయితే 70 శాతం వస్తుందని.. మటన్ ధర ఎక్కువగా ఉండడానికి ఇదీ ఓ కారణం. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా మంసాహారం వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. చికెన్ మాదిరిగా మటన్ ధరను నిర్ణయించే ఓ వ్యవస్థ లేకపోవడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోతోంది. ధరల మాట ఎలా ఉన్నా ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో మాత్రం గత నెల రోజులుగా మటన్ విక్రయాలు భారీగా పెరిగాయని పరిశీలకుల అంచనా. మాంసాహారులే ఎక్కువ దేశంలో మాంసాహారులు పెరుగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5 వెల్లడించింది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని తెలిపింది. అయితే మటన్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. 73 శాతం మంది ప్రజలు కనీసం వారంలో ఒకసారైనా మాంసం తింటున్నారు. కేవలం 4.4 శాతం మంది ఎటువంటి మాంసాహారం ముట్టకుండా కోడిగుడ్డు మాత్రమే తీసుకుంటున్నారు. 0.27 శాతం మంది మాత్రమే వెజిటేరియనన్లు ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (క్లిక్ చేయండి: నిమ్స్‌కు మునుగోడు గ్రహణం) -
కొండెక్కిన చికెన్ ధరలు.. రెండు నెలలైనా తగ్గని ధర.. గుడ్డుతోనే సరి!
సాక్షి, నారాయణఖేడ్: ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చికెన్ ముక్క లేకుండా ముగియదు. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యుడికి ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. రెండు నెలలుగా చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300లకు కిందకు దిగనంటోంది. గత నెల శ్రావణమాసంలో చికెన్ ధరలు తగ్గుతాయని ఆశించినా, కిలో రూ.260 రికార్డు ధర పలికింది. పెళ్లిళ్ల సీజన్‌తో ఈ ధర మరింత పైకి ఎగబాకింది. అనంతరం ధరలు తగ్గుతాయని ఆశించినా తగ్గడంలేదు. సాధారణ సమయంలో రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. మటన్ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది. తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్ వేసవి నుంచి చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా మాంసాహారం తినాలన్న ప్రచారంతో చాలా మంది డ్రైప్రూట్స్‌తో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డుతోనే సరి.. చాలామంది మాంసం ధరలు పెరగడంతో గుడ్డుతోనే సరిపెడుతున్నారు. ఓ వారం మాంసం కొనుగోలు చేస్తే మరో వారం గడ్డుతో కానిచ్చేస్తున్నారు. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. గుడ్లు ఒకటి రూ.4నుంచి రూ.4.50కు విక్రయించే వారు వీటి ధరలు కూడా పెరిగి రూ.6కు తగ్గనంటోంది. -
మండుతున్న మటన్, చికెన్ ధరలు.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: మటన్, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలకు మటన్, చికెన్ వైపు మొగ్గు చూపుతుంటే దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారం ధరలను పెం చేస్తున్నారు. మరోవైపు చేపలు ధరలు తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. డిసెంబర్లో కిలో చికెన్ ధర రూ. 120 నుంచి రూ. 180 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 270 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు. మూడు నెలల క్రితంతో పోలిస్తే ధర దా దాపు రెండింతలైంది. మటన్ మాత్రం షాపు నిర్వా హకులు ఇష్టానుసారంగా అమ్ముతున్నాయి. కొన్ని చోట్ల కిలో రూ.700 అమ్మితే.. కొందరు రూ. 750 నుంచి 800 వరకు అమ్ముతున్నారు. బోన్ సెల్ అయి తే ఏకంగా రూ. 900 నుంచి 1000పైగా అమ్ముతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ కొంటే రెండు గుడ్లు ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. అలాగే గతంలో 10% నుంచి 20% డిస్కంట్ ఇచ్చేవారు.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ప్రజలు వాపోతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలివే.. ►కరోనా సెకండ్ వేవ్ వస్తే ధరలు పడిపోతాయేమో అన్న భయంతో మూడు నెలల క్రితమే ఉన్న కోళ్లను చాలా మంది అమ్మేసుకోవడం. ► డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరగడం. ►పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతుండటం. చదవండి: చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు.. పౌల్ట్రీ చరిత్రలో అత్యధికం ఆదివారం నో బోర్డు.. మటన్ షాపు నిర్వహకులు నోటీసు బోర్డుపై ధరల పట్టి ఉంచుతారు. అయితే ఆదివారం మాత్రం బోర్డులో ధరలు ఉండటం లేదు. మటన్ ధరను ప్రభుత్వం కిలో రూ.700లకు మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో తనిఖీలు చేసి ఎక్కువ ధరకు అమ్మిన షాపులకు నోటీసులు, జరిమానాలు విధించినా కొందరు మారడం లేదు. ‘మేకలు, గొర్రెలు సప్లయ్ చాలా తక్కువగా ఉంది. అలాగే మటన్ ఎక్కువగా తింటున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో కొంత మేరకు ధర పెరిగింది వాస్తవమే.’ – మటన్ షాపు నిర్వాహకులు చదవండి: సిటీలో మటన్ ముక్కకు ఏదీ లెక్క? -
భారీగా పెరిగిన మటన్, చేపల ధరలు
సాక్షి, హైదరాబాద్ : పప్పులు, నూనెలే కాదు..మటన్, చేపల ధరలు మార్కెట్లో మండిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం ఒక కిలో కొనుక్కుని వండుకోవాలన్నా అందనంత దూరానికి వెళ్లిపోయాయి. మామూలుగా కిలో రూ.500 అంతకంటే కొంచెం ఎక్కువ ఉండే మటన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.800 అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మటన్ ధర కిలో రూ.700 దాటకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మటన్ ధరను అదుపు చేయలేకపోతున్నాయి. పరిస్థితిని బట్టి మటన్ రూ.1000 వరకు కిలో అమ్ముతుండటం గమనార్హం. ఇక, చేపల ధరలు కూడా కొండెక్కాయి. రవ్వ, బొచ్చె, కొరమీను..ఏదైనా కిలోకు మూడొంతుల ధర పెరగడంతో మత్స్య ప్రియులు కూడా వెనక్కు తగ్గాల్సి వస్తోంది. కొరమీను కిలో రూ.650 వరకు చేపల ధరలు సైతం రోజురోజుకూ పైపైకి వెళ్లుతున్నాయి. రవ్వ, బొచ్చలు మామూలుS రోజుల్లో అయితే కిలో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతారు. ఇప్పుడు కిలో రూ.180 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు. కొరమీను అయితే కిలో రూ. 600 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నారు. పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దిగుమతి తక్కువగా ఉండటం, తెలంగాణలో ప్రభుత్వం ఉచితంగా విడుదల చేసిన చేపలు ఇంకా పెరగకపోవడం వంటి అంశాలు కూడా ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి. వినియోగం పెరిగింది.. ధరలు పెరిగాయి గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో మటన్ కనీసంగా రోజుకు 60 టన్నుల నుంచి 70 టన్నుల వరకు అమ్మేవారు. పండుగ సమయంలో అయితే ఇది 100 టన్నులకు పైగానే అమ్ముతారు. పోయిన వారంలో ఏకంగా మటన్ 170 టన్నుల వరకు వెళ్లిందని అధికారులు చెబుతున్నాయి. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కిలో మటన్ రూ. 700లకు మించి అమ్మొద్దని నిబంధనలు ఉన్నా అధికారులు మాటలకే పరిమితం కావడంగమనార్హం. చేపల ధరలు గతంలో, ఇప్పుడు చేపలు రవ్వ బొచ్చెలు కొరమీను రొయ్యలు (కిలోకు రూపాయల్లో) గతంలో 150 160 500–600 250–350 ఇప్పుడు 200 220 600–700 350–450 ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలే మార్కెట్లో మాంసం ధరలు పెంచి అమ్ముతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించారు. సోమవారం దీనిపై ప్రకటన చేస్తామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉంది కదా అని ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ -
మండుతున్న మటన్ ధరలు.. కేజీ ఎంతంటే!?
సాక్షి, ఖమ్మం : ఒక్కసారిగా మాంసాహారం ధరలు పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజల వినియోగాన్ని పసిగట్టిన మాంసాహార వ్యాపారులు అనూహ్యంగా ధరలు పెంచారు. పండుగ సందర్భంగా సహజంగా మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన మాంసాన్ని తింటారు. ప్రధానంగా కొనుగోలు చేసే చికెన్, మటన్, చేపల ధరలను వ్యాపారులు పెంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి చికెన్, చేపలు. ఈ రెండింటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.180 వరకు పలుతున్న చికెన్ ధరను ప్రాంతాన్ని బట్టి రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయించారు. అదేమిటంటే డిమాండ్ అలా ఉందని చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. గ్రామాల్లో కన్నా నగరాలు, పట్టణాల్లో చికెన్ ధర అధికంగా ఉంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌ను రూ.250 వరకు విక్రయించారు. పరిమిత ప్రాంతాల్లో లభించే నాటు కోళ్లకు కూడా బాగా ధర పెంచారు. రూ.300 వరకు లభించే కిలో నాటుకోడి రూ.400 వరకు విక్రయించారు. వేసవి కాలంలో, కోళ్లకు వ్యాధులు వచ్చి మరణాలు సంభవించినప్పుడు సహజంగా ధర పెరుగుతుంది. ప్రస్తుతం అటువంటిదేమీ లేనప్పటికీ ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కిలోకు రూ.50 వరకు పెంచారు. ఇక చేపల పరిస్థితి అదే. రకాన్ని బట్టి చేపలకు ధర ఉంటుంది. సాధారణంగా కిలో చేపల ధర రూ.150 వరకు ఉండేది. దీపావళి పండుగ సందర్భంగా కిలో రూ.180 వరకు పెంచి విక్రయించారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగటాన్ని గుర్తించి వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రొయ్యలు, కొర్రమేను వంటి చేపల ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం చేపలు పట్టే సీజన్ కాకపోవడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి చేపల చెరువుల్లో పెంచే చేపలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధరను చెప్పుకోలేకుండా ఆకాశానికి అంటింది. కిలో రూ.800లుగా ఉన్న మటన్ ధర పండుగ సందర్భంగా రూ.1,000గా విక్రయించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు మాత్రం మటన్ జోలికి వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున మటన్ విక్రయాలు జరిగాయి. పట్టించుకోని ప్రభుత్వ శాఖలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలు పాటించకపోవటంతో పాటు ధరలను కూడా ఇష్టారీతిన పెంచి విక్రయిస్తున్నారు. స్థానికంగా నియంత్రించాల్సిన కింది స్థాయి ఉద్యోగులను లోబరుచుకొని వ్యాపారులు ఈ విక్రయాలు చేస్తున్నారు. రహదారుల వెంట, కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో మాంసం, చేపలు, చికెన్ వంటి మాంసాహారాన్ని విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పలువురు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నప్పటికీ నియంత్రించాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు, ధరలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు పెంచి విక్రయిస్తున్నారు మాంసం ధరలను బాగా పెంచారు. పండుగ పేరుతో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి విక్రయిస్తున్నారు. చికెన్, చేపల ధరలు అందుబాటులో ఉండేవి. వాటిని కొనుగోలు చేసే వాళ్లం. అటువంటిది వాటి ధరలు కూడా అందకుండా పోతున్నాయి. – ఎ.వెంకటేశ్వర్లు, ప్రకాష్‌నగర్, ఖమ్మం మాంసం ధరలు ప్రియం మాంసం ధరలన్నీ పెరిగాయి. ప్రజల వినియోగాన్ని గమనించి ధర పెంచారు. గత వారం కన్నా దీపావళి పండుగ రోజున ధర పెరిగింది. మటన్ ధర రూ.200 వరకు పెరిగింది. చికెన్, చేపల ధరలు కూడా రూ.50 వరకు పెరిగాయి. – నల్లమోతు లక్ష్మయ్య, గుట్టలబజార్, ఖమ్మం -
మటన్ రూ.700కు మించి అమ్మితే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఇష్టానుసారంగా వ్యవహరించి గొర్రెల ధరలను పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. శనివారం పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రతో కలిసి చెంగిచెర్ల, జియాగూడ, బోయగూడ మండీల్లో లైసెన్స్ మొండెదార్లు (గొర్రెల విక్రయదారులు)తో సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వం నిర్ణయించిన ధర రూ.700 మించి విక్రయిస్తే శాఖాపరంగా కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతోనే పశుసంవర్థక శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో మొండెదార్లు అందరూ లాక్డౌన్ కారణంగా తాము ఎక్కువ లాభాలు ఆశించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. అలాగే గొర్రెలను కేవలం మాంసం దుకాణాల నిర్వాహకులకే అమ్ముతామని, మద్య దళారులకు గొర్రెలను విక్రయించబోమని మంత్రికి విన్నవించారు. సమావేశంలో తనిఖీ బృందం డిప్యూటీ డైరెక్టర్ వెంకట సుబ్బారావు, డాక్టర్ బాబుబేరి, సింహా రావు, సుభాష్, నిజాం, మొండెదార్లు గౌలిపుర ప్రకాశ్, హోమర్, పి.లక్ష్మణ్, రాజు మల్తూకర్, కమల్ ప్రకాశ్, భగీరథ్, శ్రీనివాస్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పీపీ విధానంతో చేపల మార్కెట్! మత్స్య ఫెడరేషన్ ద్వారా కాని, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కానీ హోల్ సేల్ చేపల మార్కెట్‌ను నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, ఇందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. చేపల ధరలు నియంత్రణలో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, ఆ శాఖ కమిషనర్ సువర్ణ, అధికారులతో మత్స్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల కారణంగా లాక్‌డౌన్‌లోనూ సమృద్ధిగా చేపలు లభ్యం అవుతున్నాయన్నారు. ముషీరాబాద్ (రాంనగర్)లోని హోల్‌సేల్ చేపల మార్కెట్ వారంలో మూడు రోజులు పని చేస్తుందని, ఈ మార్కెట్‌కు 80 నుంచి 90 మెట్రిక్ టన్నుల చేపలు వస్తున్నాయని, దీంతో నగర ప్రజల అవసరాల మేరకు చేపలు లభిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మత్స్యకారులు అందరికీ అందేలా చూడాలని అన్నారు. 33 జిల్లాల వారీగా జిల్లా మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం పాలకవర్గం ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు -
కిలో మటన్ రూ.700కే అమ్మాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మటన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వారాన్ని బట్టి కొన్ని షాపుల్లో రూ. వెయ్యి వరకు ధరలను పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మటన్ ధరలను కళ్లెం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. కిలో మటన్ రూ. 700 రూపాయలకే అమ్మాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేశించారు. అలాగే చేపలు, కోళ్లు, గుడ్లుకు ధరలు పెరగకుండా పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముందుగా నిర్ణయించిన ధరలకు మాత్రమే విక్రయించాలని, రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. (తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు) శనివారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామని తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ అమలు, కరోనా పరీక్షలు జరుగుతున్న తీరును కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రసంశించారని అన్నారు. వలస కార్మికుల తరలింపునకు రైళ్లు ఏర్పాటు చేయాలని తామే మొదట సూచించినట్లు తలసాని గుర్తుచేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. (రెడ్ జోన్లో దేశ రాజధాని జిల్లాలు) ‘కరోనా వైరస్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుని మాట్లాడాలి. బాధ్యత కలిగిన ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడు కరోనా కష్ట కాలంలో విమర్శలు చేయడం భావ్యం కాదు. నరం లేని నాలుక ఉందని, పనికి మాలిన చెత్త నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘అందుకే చికెన్, మటన్ రేట్లు పెరిగాయి’
సాక్షి, హైదరాబాద్ : మాంసాన్ని అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అధిక ధరకు మాంసం విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్, చేపల లభ్యతపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లాక్డౌన్ కారణంగా గొర్రెలు, మేకల సరఫరా నిలిచిపోవడంతో మటన్ ధరలు పెరిగాయని తెలిపారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు వాటిని విక్రయించుకునేందుకు వీలుగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. (చదవండి : పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!) కాగా, లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కిలో రూ.50 పలికి చికెన్ ఇప్పుడు 180 పలుకుతోంది. ఇక మటన్ ధర కూడా విపరీతంగా పెరిగింది. కిలో మటన్ రూ.800 నుంచి రూ.1000 దాకా పలుకుతోంది. కరోనా పుకార్లతో మొన్నటి వరకు నష్టపోయామంటున్న వ్యాపారులు.. ఇప్పుడు లాక్‌డౌన్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. -
ధర ఎక్కువ.. నాణ్యత ప్రశ్నార్థకం
కర్నూలు(అగ్రికల్చర్): కొన్నాళ్లు గడిస్తే మాంసం కొనలేని, తినలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలకుమాంసం ధరలు షాక్ కొడుతున్నాయి. దీనికితోడు కొన్ని చోట్ల విక్రయిస్తున్న మాసం పొట్టేలుదో, గొర్రెదో.. మేకదో.. అనారోగ్యంతో ఉన్న వాటిదో తెలియని పరిస్థితి. చనిపోయేవాటిని కూడా విక్రయానికి వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కర్నూలు నగరంలో మాంసం ధరలు ఏకంగా 20 నుంచి 30 శాతం ఎక్కువ. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అయి అడ్డగోలుగా ధరలు పెంచుతూ పోతున్నారు. దీనిని నియంత్రించే అధికారం ఎవ్వరికీ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జీవాల ఆరోగ్యం దేవుడెరుగు ధర ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నాణ్యమైన పొట్టేలు మాంసం ఇవ్వాలి. అలా కాకుండా మేక, గొర్రె మాంసం కూడా కిలో రూ. 680 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు చూసేందుకు ఎదురుగా ఒక పొట్టేలు తల పెట్టి దాని దాపున గొర్రె, మేకల మాంసం విక్రయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం మాంసానికి వినియోగిస్తున్నా జీవం ఏదైనా అది ఆరోగ్యంగా ఉందా లేదా అని పశుసంవర్ధకశాఖ వైద్యులు పరీక్షించాలి. లేకపోతే బ్రూసెల్లోసిస్, అంత్రాక్స్ వంటి వ్యాధుల బారిన పడిన జీవాలను మాంసానికి వినియోగిస్తే అవి మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే జీవాన్ని పరీక్షించిన తర్వాతే విక్రయించాలని నిబంధన పెట్టారు. జిల్లాలోని మున్సిపాలిటీ, మేజర్ పంచాయతీల్లో ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. కర్నూలులో జీవాలను జవ చేయడానికి ప్రత్యేకంగా కమేళా ఉంది. అక్కడ పశువైద్యుడు జీవాల ఆరోగ్యం పరీక్షించిన తర్వాత జవ చేయాలి. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో జీవాల ఆరోగ్యాలను పరీక్షించే పశువైద్యులు అక్కడ లేరు. దీంతో మాంసం వ్యాపారం ఇష్టారాజ్యమైంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై బహిరంగంగా మాంసం విక్రయాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకుని సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. కర్నూలులో చికెన్ ధరలు కూడా ఎక్కువే జిల్లా కేంద్రానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు, వెల్దుర్తి తదితర పట్టణాల్లో చికెన్ కిలో రూ.120 మాత్రమే. కర్నూలు నగరంలో మాత్రం రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. బతికిన కోడి కిలో రూ.40 వరకు ఉంది. చికెన్ దగ్గరకు వచ్చే సరికి ఎక్కడా లేని విధంగా కిలో రూ.200 వరకు ధర పెట్టి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. లైవ్ ధరల ప్రకారం చూస్తే కిలో చికెన్ రూ.100 నుంచి రూ.110కి మించదు. కాని వినియోగదారుల నుంచి 200 వసూలు చేస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మాంసం, చికెన్ అనేవి నిత్యావసరాలు కాదుగదా.. అంటూ అడ్డగోలుగా ధరలు పెంచుకోవడానికి అధికార యంత్రాంగమే వ్యాపారులకు అవకాశం ఇచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏదీ? మూడు నెలలకు ఒకసారి జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగాల్సి ఉంది. ఈ కమిటీకి జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పశుసంవర్ధకశాఖ జేడీ, నగరపాలక సంస్థ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. కాని రెండేళ్లలో ఒక్కసారి కూడా సమావేశమైన దాఖలాలు లేవు. అంటే ప్రజారోగ్యం పట్ల అధికార యంత్రాంగానికి దృష్టి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టని మాంసం ధరల నియంత్రణ మాంసం ధరల నియంత్రణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారు. ధరల నియంత్రణ కమిటీ ఏ నాడు కూడా మాంసం ధర పెరుగుదలపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను నియంత్రించాలిమాంసం ధరలను వ్యాపారులు అడ్డగోలుగా పెంచుకుంటుపోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కిలో మాంసం ధర రూ.680కు పైగా పెంచినా నాణ్యమైన మాంసం ఇస్తున్నారనేది ప్రశ్నార్థకమే. అనారోగ్యవంతమైన జీవాల మాంసం తినడంతో ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పశువైద్యులు పరిశీలించిన తర్వాతనే జీవాలను మాంసానికి వినియోగించాలి. అలా జరగడం లేదు. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.– శివనాగిరెడ్డి, అధ్యక్షుడు, రైతుసంఘాల ఐక్యవేదిక, కర్నూలు -
నాటుకోడి ధర అదరహో
మాంసం ప్రియుల ట్రెండ్ మారింది. ఇంటి పెరట్లో సహజ సిద్ధంగా పెంచుకునే నాటు కోళ్ల మాంసం రుచే వేరు. వీటి మాంసం గట్టిగా ఉండడంతో వండడానికి, తినడానికి ఇబ్బంది పడేవారు. రుచి లేకపోయినా మృదువుగా ఉండే బాయిలర్ కోడి మాంసానికి అలవాటు పడిన జనం ప్రస్తుతం నాటు కోడి మాంసం వైపు చూస్తున్నారు. వీటి ధరలు మటన్ రేట్లను మరిపిస్తున్నా.. కేజీ బాయిలర్ కోడి మాంసం కంటే.. అరకేజీ నాటుకోడి మాంసంతో సరిపెట్టుకుంటున్నారు. ఆదివారం అయితే నాటు కోళ్ల కోసం జనం బారులు తీరుతున్నారు. దీంతో పల్లెల నుంచి నాటు కోళ్లు తీసుకొచ్చి విక్రయించేవారు ఎక్కువయ్యారు. పాత బస్టాండ్ ప్రాంతం ఆదివారం నాటు కోళ్ల సంతను తలపిస్తోంది. సాక్షి, గూడూరు(నెల్లూరు) : ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, వాటి మాంసాన్ని ఆహారంగా తినేవారు. కాలక్రమంలో వాటిని పెంచడంలో ఇబ్బందులతో పెంచేవారే తగ్గిపోయారు. దీంతో పల్లెల్లో సైతం పుట్టగొడుగుల్లా చికెన్ సెంటర్లు వెలిశాయి. ఇలా కొన్నాళ్లకు ఆ రుచి వెగటేసింది. మళ్లీ నాటు కోడి మాంసం అంటూ అటూ పల్లెలతో పాటు ఇటు పట్టణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనూ, ఫంక్షన్ల్లో ‘నాటు కోడి మాంసం, రాగి సంగటి’ అనే కొత్త సంప్రదాయం వచ్చింది. నాటు కోళ్లకు గిరాకీ పెరగడంతో కొందరు పల్లెల్లో నాటు కోళ్ల పెంపకాలు చేపట్టారు. వ్యాపారులు అక్కడ నాటు కోళ్లను కొనుగోలు చేసి, పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మాంసం ప్రియులు నాటు కోళ్లను కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఈ క్రమంలో నాటు కోడి ఒకటన్నర కిలో ధర రూ.600 ఉంది. వ్యర్థాలు పోను అది సుమారు కిలో మంసం మాత్రమే వస్తుంది. దీంతో నాటు కోడి మాంసం మటన్ ధరకు సరితూగేలా పలుకుతోంది. -
'మటన్' మంట
ముంబై : రాష్ట్రంలో బీఫ్ నిషేధంతో మటన్ ధర అమాంతం పెరిగిపోయింది. గత రెండు నెలల్లో రీటైల్ మార్కెట్లో 35 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. డిమాండు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో మటన్ ధర రూ. 500 పలుకుతోంది. ఏప్రిల్ నెలలో బీఫ్ నిషేధంపై స్టే విధించడానికి బాంబే హైకోర్టు నిరాకరించడంతో రాష్ట్రంలో బీఫ్ భద్రపరచడం, ఎగుమతి, దిగుమతిపై నిషేధం విధించారు. అయితే మూడు నెలల వరకు బీఫ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోకూడదని అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు నెలల సమయం తర్వాత మటన్ ధర పెరగడం మొదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 350-రూ.360 కి మటన్ లభించేది. తర్వాత నవీముంబై, ఇతర ప్రదేశాల్లో రీటైల్ మార్కెట్లో ధర రూ. 450కి చేరుకుంది. ప్రస్తుతం రూ. 500 కు దొరుకుతోంది. బీఫ్ నుంచి మటన్‌కు గత రెండు నెలలుగా కస్టమర్ల సంఖ్య పెరుగతోందని, గతంతో బీఫ్ తినేవారు ఇప్పుడు మటన్ తింటున్నారని నెరూల్‌లోని ఓ వ్యాపారి రఫీక్ ఖురేషి చెప్పారు. డిమాండ్ పెరిగినప్పటికీ అవసరమైన మటన్ అందుబాటులో లేదని మరో వ్యాపారి పేర్కొన్నారు. మేకలు, గొర్ల ధర 10 నుంచి 20 శాతం పెరిగిందని ఆయన అన్నారు. అందుకే ధర పెంచాల్సి వచ్చిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ.. ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ వినియోగదారులు మాత్రం పెరిగారని చెప్పారు. దేవనార్ వధశాల నుంచి ప్రతిరోజు 3,700 మేకలు, గొర్ల మాంసం వస్తున్నప్పటికీ నవీముంబైలో ఎక్కువ మంది వ్యాపారులు షాపుల్లోనే మేకలు, గొర్లను వధిస్తున్నారు. మరోవైపు ధరలు పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ‘గతంలో వారాంతంలో మటన్ తినేవాడిని. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. బీఫ్ నిషేధం తర్వాత మటన్ ధర అమాంతం పెరిగిపోయింది’ అని నెరూల్ వాసి శివరామ్ పేర్కొన్నారు. కాగా, హోళీ పండుగనాటికి ధర రూ. 600 తాకుతోందని వ్యాపారులు చెబుతున్నారు.