సాక్షి,హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‌పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌశిక్‌రెడ్డి అన్నారు.
నాలెడ్జ్ లేదు అన్న మాటలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్‌రెడ్డి వెనక్కి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment