వైరల్‌: బిగ్‌బాస్‌ నటుడి సాహసం | Sidharth Shukla Stands Up Against a Gang of Arguing Men on the Road | Sakshi
Sakshi News home page

రోడ్డుపై గొడవ.. చాకచక్యంగా డీల్‌ చేసిన నటుడు

Published Tue, Dec 15 2020 5:37 PM | Last Updated on Tue, Dec 15 2020 8:15 PM

Sidharth Shukla Stands Up Against a Gang of Arguing Men on the Road - Sakshi

బిగ్‌బాస్‌ ఫేం సిధార్థ్‌ శుక్లాకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటుడి మీద ఈగ వాలనీయరు అభిమానులు. ఇక తాజాగా సిధార్థ్‌ శుక్లాకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మా అభిమాన నటుడు ఎంత ధైర్యవంతుడో చూడండి అంటూ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. పైగా ఈ రోజు సిధార్థ్‌ శుక్లా పుట్టిన రోజు కావడంతో ఈ వీడియోని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. 13-14 మంది వ్యక్తులు సిధార్థ్‌ను చుట్టుముట్టి తాగి డ్రైవ్‌ చేశాడంటూ ఆరోపిస్తూ.. అతడితో గొడవకు దిగారు. ఇంత మంది చుట్టుముట్టినా సిధార్థ్‌ ఏ మాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా వారిని డీల్‌ చేయడమే కాక.. తనను తాను కాపాడుకుంటారు. ఒక్కడే అంతమందిని ధైర్యంగా ఎదుర్కొవడంతో సిధార్థ్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన నటుడిని ‘షేర్‌’(సింహం) అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: ఏడేళ్ల ప్రేమకు బ్రేక్‌ పడింది..)

ఈ క్రమంలో ఓ యూజర్‌ ఈ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘వారు తాగి డ్రైవ్‌ చేస్తున్నావంటూ సిధార్థ్‌తో గొడవపడ్డారు. ఒక్కడిని 13-14 మంది చుట్టుముట్టారు.. వీరందరితో తలపడటానికి ధైర్యం కావాలి.. తనో సింహం. ఇక మొదట షేర్‌ చేసిన 20 సెకన్ల నిడివి గల వీడియోలో తను తాగి, డ్రైవ్‌ చేస్తున్నాడంటూ ఆయన పేరు చెడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోతో అసలు నిజం బయటకు వచ్చింది. ఇంకో సారి తన పేరు చెడ్డగొట్టాలని భావించేవారు కర్మ అందరిని గమనిస్తూ ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అంటూ ఈ వీడియోని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement